Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వావ్… ఇంత అగ్గిమండినట్టు బహుశా అమిత్‌షాకు కూడా తెలిసి ఉండదు…

November 16, 2021 by M S R

కొన్ని వార్తలు భలే ఆశ్చర్యపరుస్తయ్… నవ్వు కూడా తెప్పిస్తయ్… ఆంధ్రజ్యోతిలో ఓ ఫస్ట్ పేజీ వార్త… ఏపీ బీజేపీ నేతలపై అమిత్ షా ఫైర్… ‘‘ఆయ్, ఏమనుకుంటున్నారు మీరంతా..? అమరావతి రైతులకు ఊరూరా జనం పూలు జల్లి స్వాగతాలు చెబుతుంటే మీరేం చేశారు..? ఎందుకు మద్దతు ప్రకటించలేదు..? టీడీపీ భలే వాడుకుంది… ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు, అసలు ఆంధ్రజ్యోతి మీద బ్యాన్ పెట్టడం ఏమిటి, నాన్సెన్స్, అది జనం మెచ్చిన మీడియా, ఎవరిని అడిగి బ్యాన్ పెట్టారు..? జగన్ మీద జనంలో ఫుల్ వ్యతిరేకత కనబడుతోంది, వాడుకుని మన బలం పెంచుకోవడంలో మన అసమర్థత కనిపిస్తోంది…’’ అంటూ అగ్గి ఫైరయిపోయాడట… అమిత్ షా ఇలా ఫైరయిపోతే బాగుండు అని ఆర్కే తన మనసులో ఏదైతే గట్టిగా అనుకున్నాడో అదే వార్త నిండా…! ఎవరో మిత్రుడు వెటకరించినట్టు… నిజానికి తను ఇంత ఫైరయిపోయానని బహుశా అమిత్ షాకు కూడా తెలిసి ఉండదు…!!

aj

అసలు మీరు పనిచేస్తోంది వైసీపీకా..? మన పార్టీకా..? అని కూడా అడిగాడట… అదే మాట ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీని అడగలేరు కదా ఫాఫం… ఐనా తనకు తెలియదా..? ఏపీలో బీజేపీ ఉనికే నామమాత్రమని… తాము కొత్తగా టీడీపీ నుంచి చేర్చుకున్న ఎంపీల ప్రజా బలమేమిటో తెలియదా… ఏపీ బీజేపీ ఆంధ్రజ్యోతి మీద బ్యాన్ పెట్టడమే అమరావతి డిబేట్ గొడవకు సంబంధించి కదా, అది ఎప్పుడో జరిగింది కదా, అమిత్ షాకు ఇప్పుడు తెలిసిందా..? ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో కూడా తెలియదా డిఫాక్టో పార్టీ అధ్యక్షుల వారికి..? ఇప్పటికిప్పుడు అందరినీ పిలిచి, పార్టీ ప్రగతిని సమీక్షించాడా..? క్లాసులు పీకాడా..? అసలు ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దేవధర్ చేసిన ట్వీట్ మరింత నవ్వు తెప్పించింది…

Ads

In today’s meeting of @BJP4Andhra leaders with Hon’ble HM @AmitShah Ji, @BJP4India GS(O) @blsanthosh Ji,
the direction given was clear – We have to come to power in Andhra Pradesh on our own in next general elections 💪 pic.twitter.com/hbE5hk17NO

— Sunil Deodhar (@Sunil_Deodhar) November 15, 2021

వచ్చే ఎన్నికల్లో పార్టీ సొంత బలంతో అధికారంలోకి రావాలని అమిత్ షా చెప్పేశాడట… పార్టీ తరఫున పోటీచేయడానికి మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులున్నారా సార్..? అంతెందుకు..? స్థానిక ఎన్నికల్లో నిలబడ్డ స్థానాలెన్ని..? వచ్చిన వోట్లెన్ని..? రెండేళ్లలో ఏపీ కమ్మేసి, వోట్లు కుమ్మేసి, కుర్చీ ఎక్కేస్తారా..? సరే, సంకల్పంలో దరిద్రం దేనికి..? ఆశపడదాం సరే… కానీ ఒక్కరు… ఒక్కరున్నారా పార్టీని నడిపించడానికి..? పురంధేశ్వరి, కావూరి, సీఎంరమేష్, జీవీఎల్, వీర్రాజు… వీళ్లేనా..?! నిజానికి తెలంగాణలో కూడా పార్టీ సిట్యుయేషన్ కొన్నాళ్ల క్రితం ఇలాగే ఉండేది… టీఆర్ఎస్ కోసం చేస్తున్నారా..? బీజేపీ కోసం చేస్తున్నారా..? అని అడిగేట్టుగానే ఉండేది… కానీ కొన్నాళ్లుగా సీన్ మారింది… బండి సంజయ్ పగ్గాలు పట్టాక ఢీఅంటేఢీ… తనకు పార్టీలోని అన్ని వర్గాల సహకారం లభిస్తోందా..? స్ట్రాటజీలలో గందరగోళం ఉందా..? అనేది వేరే చర్చ… కానీ పార్టీలో ఓ కదలిక వచ్చింది… దుబ్బాక, జీహెచ్ఎంసీ, మొన్నటి హుజూరాబాద్… పార్టీ కేడర్‌లో జోష్ కనబడుతోంది… బండి మీద టీఆర్ఎస్ ప్రత్యక్షంగానే కోడిగుడ్లతో, రాళ్లతో దాడికి దిగిందంటేనే ఆ పార్టీలోని ఫ్రస్ట్రేషన్ బయటపడుతోంది… బజారులో నిలబడి కయ్యానికి సై అంటున్నాడు… రిజల్ట్ సంగతి జానేదేవ్…

అరెరె, అసలు సంగతి మరిచేపోయాం… సొంత బలంతో పార్టీ అధికారంలోకి రావాలని అమిత్ షా చెప్పాడట… సునీల్ దేవధర్ ట్వీటాడు… పొత్తుల గురించి మీకెందుకోయ్ అని కూడా తన నేతల మీద ఆయన ఫైరయ్యాడట, ఆర్కే రాశాడు… అంటే… మరి… ఇక… పవన్ కల్యాణ్ అనబడే కాబోయే ముఖ్యమంత్రితో పొత్తు, సయోధ్య, దోస్తీ గట్రా ఇప్పుడు ఉన్నట్టా..? లేనట్టా..? దేవుడా… టీడీపీ అయిపోయింది, బీఎస్పీ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, వైసీపీతో అయిపోవడానికి ఏమీలేదు… తను ఇంకెవరితో కొత్తగా జతకట్టాలిప్పుడు..? పోనీ, మళ్లీ చంద్రబాబుకే జై అంటే సరిపోతుందేమో… సై సై…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions