…….. ఈమెను గుర్తుపట్టగలరా…? పేరు తృప్తి దేశాయ్…. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని, కట్టుబాట్లను, ఆచారాలపై అసంతృప్తీ దేశాయ్… సంఘ్ భాషలో చెప్పాలంటే ఓ అర్బన్ నక్సల్… ఆమెకు వేరే మతాల సంస్థలపై విమర్శలు చేతకావు… చేతకావని కాదు, తన్ని తరిమేస్తారనీ, మరీ తిక్కలేస్తే చంపి పోగులేస్తారనీ భయం… హిందువులు కదా, పిరికి సమాజం.,. ఏమీ అనలుదే అనే ధైర్యం, ధీమా, అలుసు… అందుకే ఆమె హిందూ గుళ్లపై కాన్సంట్రేట్ చేస్తుంది…
పేరుకు ఓ సామాజిక కార్యకర్త… మనకు తెలిసిందే కదా… ఈ దేశంలో సామాజిక కార్యకర్త అంటేనే హిందూయిజానికి వ్యతిరేకంగా ఉద్యమించడం… హిందూ మనోభావాల్ని, సంప్రదాయాల్ని, ఆచారాల్ని తిట్టిపోయడం… వేరే మతస్థుల జోలికి వెళ్లలేని మన అసహాయ లీగల్ వ్యవస్థను వాడుకుని, పబ్లిసిటీ పొందడం… ఎస్, ఆమెకు కూడా అదే అలవాటు… పోనీ, ఏదైనా మంచి చెబుతుందా అంటే, ఆ తెలివి కూడా లేని ఓ పర్వర్టెడ్ కేరక్టర్…
Ads
మొదట శనిశింగాపూర్ అని రచ్చ చేసింది… సక్సెస్ అయింది… మన లీగల్ సిస్టం కూడా సేమ్, ఆమెకు ప్రతిరూపమే కదా… హిందూ ఆచారాల్ని చీల్చి చెండాడటమే మేధస్సు కదా… ఈ తిక్క కేసు కూడా సేమ్ అలాంటిదే… పొరపాటున వేరే మతస్థుల జోలికి వెళ్తే తస్లీమా నస్రీన్ అయ్యేది… అందుకే తెెలివిగా ఐక్యత ఏ కోశానా కనిపించని హిందూ ఆచారాలపై పడింది…
ఏ గుడిలో ఏ ఆచారం ఉంటే ఆమెకు ఎందుకట..? నీకు ఇష్టముంటే వెళ్లు, లేకపోతే అవాయిడ్ చేయి…… ఈ సింపుల్ సూత్రం ఆమెకు పనికిరాదు… రచ్చ చేయాలి, దునుమాడాలి… సకల హిందూ సమాజం ఎడ్డి మొహాలు వేసుకుని, ఆమె చెప్పినట్టు…. ఆమెకు ప్రతిరూపాల్లాంటి కోర్టుల తీర్పులను చూస్తూ లోలోపల పిసుక్కోవాలి…
మరి చాలా రోజులైంది కదా… శనిశింగాపూర్ అయిపోయింది, శబరిమల అయిపోయింది… ఇక ఇప్పుడు తృప్తి లేదు తనకు… మెల్లిగా షిర్డీ మీద పడింది… అక్కడ ఏముంది..? సంప్రదాయ దుస్తుల్లో రావాలనేది అక్కడి నియమం… అది కూడా తప్పే అనిపించింది ఆమెకు… మరి ఆమె అంటే మజాకా..? హిందూ ఆచార ప్రక్షాళన ఛాంపియన్ కదా…
Share this Article