మొన్నామధ్య ఎక్కడో ఒకాయన దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.., నా బర్రె పాలిస్తలేదు సార్, ఎవడో మంత్రగాడు చేతబడి చేసి ఉంటాడని నా డౌటనుమానం, వెంఠనే మీరు దర్యాప్తు జరిపి, వాడి అంతు తేల్చేయాలె, అవసరమైతే ఉల్టా రివర్స్ చేతబడి చేయించాలె, వెంటనే కేసు పెట్టండి అని కోరుకున్నాడు తెలుసు కదా… అలా చాలా కేసులు వస్తుంటయ్, అసలు మామూలు వాడికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే డ్యాష్ డ్యాష్… కానీ కొందరు పోలీసులతోనే గేమ్స్ ప్లే చేస్తుంటారు… అంతేలెండి, యూపీలో మాజీ మంత్రి ఆజంఖాన్ అని ఒకడుండేవాడు… బర్రెలు తప్పిపోయాయని పోలీసులకు ఫోన్ చేస్తే ఓ పటాలమే ఆ వెతుకులాటకు పూనుకుంది… మరి సామాన్యుడు ఏం తక్కువ..? ఒడిశా, బాలాసోర్, నీలగిరి ఠాణాలో ఓ కోళ్ల రైతు పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు…
ఫిర్యాదుదారు పేరు రంజిత్ పరీడా… కందగరడి ఊరు… ‘‘నా పక్కింటాయన రాంచంద్ర పరీడా, వాళ్లింట్లో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో పెద్ద సౌండుతో డీజే పెట్టాడు, దాంతో నా బ్రాయిలర్ ఫామ్‌లో 63 కోళ్లు గుండెపోటుతో చనిపోయాయి’’ అని కేసు పెట్టాడు… డీజే అనేది ఈమధ్య మరీ చికాకు యవ్వారంగా మారిందనేది నిజమే… గుండె రోగాలున్నవాళ్లకు పైన ప్రాణాలు పైనే పోయినంత పనవుతోంది… ఐనా ఒక్కడూ వినడు… డీజే లేకపోతే ఇజ్జత్ పోతుందన్నంత ఫీలవుతుంటారు… డీజే ఎందుకురా అనడిగితే వాడు ఇక శత్రువే… పోరగాళ్లు ఫుల్ తాగాలె, డీజే పెట్టి ఎగరాలె…
Ads
మొన్న ఆదివారం అర్ధరాత్రి పదకొండున్నరకు సరిగ్గా నా పౌల్ట్రీ ఫామ్ ముందు డీజే పెట్టేసరికి, కోళ్లు అసాధారణంగా ప్రవర్తించాయి, ఎగిరాయి, భయంతో అరిచాయి… ఒరేయ్, కోళ్లు భయపడుతున్నయ్, ఆ డీజే నా ఫామ్ దాటాక మోగించండిరా అని ఎంత బతిమిలాడినా ఎవరూ వినలేదు… చెవులు పగిలిపోయే ఆ సౌండ్ నా కోళ్లను పొట్టన పెట్టుకుంది అంటాడు రంజిత్… మొదట ఏదో రోగంతో పిట్టలు రాలిపడ్డట్టు ప్రాణాలు వదిలేస్తున్నాయేమో అనుకున్నాడట, కానీ ఓ లోకల్ వెటర్నరీ డాక్టర్‌తో పరీక్షింపజేస్తే డీజే సౌండ్ షాక్‌కు గురిచేయడం వల్లే చచ్చిపోయినట్టు తేల్చేశాడట…
రంజిత్ (22) ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… ఉద్యోగం దొరక్కపోతే 2019లో ఓ సహకార బ్యాంకు నుంచి 2 లక్షలు రుణం తీసుకుని ఈ కోళ్ల ఫామ్ పెట్టుకున్నాడు… ఈ డీజే మారణకాండతో కోళ్లు చచ్చిపోవడంతో హతాశుడయ్యాడు… ముందుగా ఆ పొరుగు హంతకుడిని పరిహారం చెల్లించాలని అడిగాడు… ఎహె ఫోరా అన్నాడాయన… దాంతో పెళ్లి ఊరేగింపు డీజే, బాణాసంచా పేలుళ్లతో కోళ్లు చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు… దీన్ని ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు… కొందరు పోలీసులైతే ఈ ఫిర్యాదు తెచ్చినవాడినే నాలుగు తగిలించి పంపించేవాళ్లేమో, కానీ నీలగిరి పోలీసులు మంచోళ్లు… ‘ఇద్దరితోనూ మాట్లాడి ఏదోరకంగా ఇష్యూ సెటిల్ చేస్తాం’ అంటున్నాడు బాలాసోర్ ఎస్పీ సుధాంశు మిశ్రా… ‘‘ఎహె, ఇది తప్పుడు ఫిర్యాదు, డీజేతో కోళ్లు చావడం ఏంటి..? ఐనా రంజిత్ వచ్చి అడగ్గానే సౌండ్ తగ్గించాం’’ అంటున్నాడు కోళ్ల హంతకుడు..!!
Share this Article