ప్రపంచంలో మీరు ఏ మూలకైనా వెళ్లండి… దట్టమైన అటవీ దేశాలు, నిస్సారమైన ఎడారి దేశాలు, ఎండపొడ తగలని ధ్రువప్రాంతాలు, కఠిన పర్వత ప్రాతాలు… ఎక్కడికి వెళ్లినా సరే, ఓ మోస్తరు జనావాసం కనిపిస్తే చాలు… అక్కడ మీకు ఓ పంజాబీ దాబా, ఓ గుజరాతీ షాప్ కనిపిస్తయ్… నవ్వకండి… అతిశయోక్తిలా అనిపించినా అందులో ఓ వాస్తవం ఉంది… వాళ్లు ఎక్కడికైనా వెళ్తారు, జెండా పాతుతారు, సొంత ఐడెంటిటీ కాపాడుకుంటారు, కష్టపడతారు, స్వదేశం విడిచి ఇంకెక్కడికో వెళ్తున్నామనే ఫీల్ ఏమీ ఉండదు, విశ్వమే వాళ్లకు ఓ గ్రామం… అంతే… మరి తెలుగు వాళ్లు..? ఎక్కడ క్రీమ్ ఉంటే అక్కడ వాలిపోతారు… కుల సంఘాల గజ్జి, పార్టీ అనుబంధాల పిచ్చి, హీరోల అభిమానోన్మాదం… మనది ఓ తరహా పైత్యం, ప్రపంచంలో ఏ జాతికీ లేని ఏదో జెనెటిక్ డిజార్డర్…
ఆమధ్య కొందరు రీసెర్చర్లు ఓ సర్వే చేశారు… ఇండియన్ అమెరికన్లపై ఆ సర్వే… చేసింది కూడా అక్కడి యూనివర్శిటీల్లో చదివేవాళ్లు, పనిచేసేవాళ్లు… ఏదో గ్రూపు ఉందిలెండి… ఇంతకీ వాళ్లేమంటారంటే… అమెరికాకు వలసవచ్చిన విదేశీయుల సంఖ్య పరిశీలిస్తే నంబర్ టూ స్థానం ఇండియన్లది… దాదాపు 43 లక్షల మందిగా ఏదో లెక్కవేశారు… అఫ్కోర్స్, వారిలో 38 శాతం మంది కేవలం వీసాల మీద ఉన్నవాళ్లే… గుజరాతీలు 14 శాతం, మహారాష్ట్రులు 12 శాతం ఉంటారట… ఏపీ నుంచి 10 శాతం, తెలంగాణ నుంచి జస్ట్ 4 శాతం… పనిచేయడం కోసం ప్రపంచమంతా వెళ్లే మలయాళీలు కూడా కేవలం ఏడు శాతమేనట… సిక్కిం, నాగాలాండ్ జీరో… లడఖ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ సోసో… మరీ 0.1, 0.2 శాతాలు… అవంటే పర్వతప్రాంతాలు, తక్కువ జనాభా, విద్యావకాశాలు తక్కువ వంటి బోలెడు కారణాలున్నయ్… చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశాలు కూడా దాదాపు అదే స్థాయి… హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా జీరోకు కాస్త పైన…
Ads
చివరకు ఈ కోణంలోనూ అవి బీమారు రాష్ట్రాలే… ఏమాటకామాట… ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక ప్లస్ మహారాష్ట్ర కూడా కలిపితే… అవకాశాలను వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్లి జెండా పాతడంలో నంబర్ వన్… పంజాబ్ 8 శాతం… నిజానికి కెనడా, బ్రిటన్ లెక్కలు కూడా ఇలాగే తీస్తే పంజాబీలకు సాటి ఎవరూ రారు, ఉండరు… ఒక్క ముక్కలో చెప్పాలంటే కెనడా పంజాబీలదే… అమెరికాలో ఉండే ఇండియన్స్ మతం, కులం పేరిట ఐడెంటిఫై కావడానికి ఏమాత్రం సంకోచించరు… తమ మూలాల్ని విస్మరించరు… గతంలోకన్నా ఇండియన్ అమెరికన్లపై వివక్ష పెరిగింది… చివరకు అమెరికాలోనే పుట్టిపెరిగిన ఇండియన్లు కూడా వివక్షకు గురవుతున్నారు… అమెరికాలో పుట్టిన ఇండియన్ ఆరిజిన్.. వీళ్లను పెళ్లి చేసుకోవడానికి మనవాళ్లు ఇష్టపడుతుంటారట… ఇలా చాలా విషయాలను ఆ సర్వే రిపోర్టులో చెప్పుకొచ్చారు… ఎటొచ్చీ ఆ రిపోర్టులో చూడగానే చటుక్కున పట్టేసుకున్న పాయింట్… ‘‘ఇక్కడా గుజరాతీలే’’…
Share this Article