యూపీటెట్… ఉపాధ్యాయుల నియామకం కోసం ఉద్దేశించిన అర్హత పరీక్ష… దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు… పేపర్ లీకైంది… ఏం చేయాలి..? వేరే ప్రభుత్వం అయితే ఏదో ఎంక్వయిరీ అంటుంది, సీఐడీకి అప్పగిస్తుంది, అదెప్పుడూ తేలదు… ఈలోపు పార్టీలు ఒకరినొకరు బదనాం చేసుకుంటయ్… అసలే యూపీలో అరాచకానికి మారుపేరుగా ఉండే అఖిలేష్ పార్టీ, మధ్యలో దూరి పూర్వవైభవం కోసం నానా కష్టాలూ పడుతున్న ప్రియాంక వాద్రా… విమర్శలు స్టార్ట్… బురద జల్లుకోవడం స్టార్ట్… కానీ అక్కడున్నది యోగీ కదా… అక్రమార్కులపై కొన్ని వేల ఎన్‌కౌంటర్లతో విరుచుకుపడే కేరక్టర్… తను మోడీ కాదు, ఇతర రాష్ట్రాల సీఎంల తరహా కాదు… ఏమన్నాడు..?
29 మందిని అరెస్టు చేశారు… దాదాపు ప్రాథమిక ఆధారాలున్నయ్… కానీ అలాంటోళ్లకు భయం ఎందుకుంటుంది..? అదసలే అరాచక రాష్ట్రం… ఏళ్ల తరబడీ కులం కుళ్లులో కొట్టుమిట్టాడిన రాష్ట్రం… అందుకని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, గ్యాంగ్‌స్టర్ యాక్ట్ పెట్టాలని పోలీసులను ఆదేశించాడు… ఒకవేళ కావాలని రాజకీయ దురుద్దేశాలతో ఈ కుట్రకు పాల్పడిన వారు తేలితే… వాళ్ల జీపులు తిరగబడటం ఖాయం… ఈలోపు ఆ నిందితుల ఆస్తుల స్వాధీనానికి ఆదేశించాడు… రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఓ గ్యాంగ్ ఈ పనికి పాల్పడిందని బీజేపీ సందేహం… యూపీలో అది పెద్దగా ఆశ్చర్యజనకం కూడా కాదు… అందుకని ప్రాథమిక ఆధారాలున్న నిందితుల ఆస్తుల స్వాధీనం అన్నాడు… ఇప్పుడు అదీ మార్చి, వాళ్ల ఆస్తుల కూల్చివేతకు ఆదేశించాడు…
Ads
ఓ భయం ఏర్పడాలి… స్వార్థం కోసమో, రాజకీయ ఉద్దేశాల కోసమో, ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమో లక్షల మంది ఆశావహుల జీవితాలతో ఆడుకునే వాళ్లకు ఓ భయం అవసరం… బీఎస్పీ దెబ్బతిని, ఎస్పీ క్రమేపీ పుంజుకుంటున్నవేళ యోగీ పెద్దగా రిస్క్ తీసుకోడేమో… రైతు చట్టాలనే రద్దు చేసి సారీ చెబుతున్న నేపథ్యంలో యోగీ కాస్త సరళంగా వ్యవహరిస్తాడేమో అనుకున్నారు… కానీ యోగీ కదా… పొలిటికల్ స్థితిగతులు జాన్తా నై… రాజకీయ కోణం జాన్తా నై… అలాంటోళ్ల వెన్నులు వణకాలి… అసలే జైళ్లలో ఉన్న వేలాది మంది అరాచకవాదుల్లో ఓ ఆశ… ఈసారి యోగీ దిగిపోతాడు, మళ్లీ మా అఖిలేష్ వస్తాడు, మా ఆజంఖాన్ రాజ్యం వస్తుందీ, మళ్లీ ఊళ్లపై పడాలి అని… ఈ స్థితిలో కూడా యోగీ తన టెండెన్సీ మార్చుకోలేదు… పెద్ద కొరడా పట్టుకుని రంగంలోకి దిగిపోయాడు…
ఒక్కసారి తెలంగాణకు వద్దాం, నయీం ఎన్‌కౌంటర్ మినహా… ఇంకేమైనా పెద్ద పెద్ద కేసులు పరిష్కృతమయ్యాయా..? అంతటి వోటుకునోటు కేసునే కోల్డ్ స్టోరేజీలో పడేశారు… ప్రత్యేకించి సీఐడీ కేసుల్లో ప్రగతి మాట..? ఏపీ సంగతికొద్దాం… సీఎం మీద హత్యాప్రయత్నం చేసిన కోడికత్తి కేసుకే దిక్కులేదు… వివేకా హత్య కేసు కదలదు, వదలదు, ఎటూ తేలదు… ఇవే కాదు, అన్ని రాష్ట్రాలూ అంతే… నేరగాళ్లలో భయం ఏది..? ఎందుకో యోగీ కఠిన వైఖరి ఈ సమాజానికి అవసరం అనిపిస్తోంది… బీజేపీ, యోగీ, మోడీ అనగానే వెంటనే నెగెటివ్‌గా విరుచుకుపడే రాజకీయ శక్తులుంటయ్… ఐనా సరే, యోగీ తన ధోరణి మార్చుకోకపోవడం ఆశ్చర్యమే… ఆశ్చర్యమే..!!
Share this Article