….. By…. పార్ధసారధి పోట్లూరి………… కొత్త కోవిడ్ వేరియంట్‌కు ఓమ్రి కాన్ అని ఎందుకు పేరు పెట్టింది WHO..? OMICRON పేరు ఎక్కడి వచ్చింది..? Well…! ప్రపంచ ఆరోగ్య సంస్థని మొదటి నుండి చైనా ప్రభావితం చేస్తున్నది అని పోయిన సంవత్సరమే అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే..! అదే సమయంలో WHO కి ఇచ్చే అమెరికన్ ఫండ్స్ మీద కోత కూడా పెట్టాడు… అదే సమయంలో కోవిడ్ ని చైనా వైరస్ అని పిలవకూడదు అంటూ క్సీ జింగ్పింగ్ అభ్యంతరం చెప్తూనే రావడమే గాకుండా, కొత్త వెరియంట్స్ కి పేర్లు దేశాల పేర్లు స్ఫురించకుండా పెట్టాలని WHO మీద ఒత్తిడి తెచ్చాడు జింగ్పింగ్…
చేసేది లేక WHO గ్రీకు ఆల్ఫాబెట్స్ ని కొత్త వెరియంట్స్ కి పెట్టడం మొదలుపెట్టింది. ఫోటో చూడండి… ఆల్ఫా, బీటా లాంటివి గ్రీకు ఆల్ఫాబెట్స్. ఈ క్రమంలో ఇప్పటి వరకూ వరసగా పెట్టిన పేర్ల తరువాత సౌత్ ఆఫ్రికా వేరియంట్ కి పెట్టాల్సిన పేరు ఏమిటో తెలుసా? XI.. క్సి లేదా గ్జి… కానీ జింపింగ్ కి కోపం వచ్చే పనిని చేయలేడు WHO అధ్యక్షుడు కాబట్టి ఆ పేరుని పక్కన పెట్టి, దాని తరువాత పేరు అయిన OMICRON ని ఎంపిక చేసి, దాన్నే పెట్టింది WHO… ఒకసారి ఇమేజ్ చూడండి వాటిలో CHI అనే పేరు కూడా ఉంది. బహుశా CHI పేరు పెట్టాల్సి వస్తే దాన్ని కూడా వదిలేసి, దాని పక్క పేరు పెట్టవచ్చు… ఎందుకంటే CHI అనే గ్రీకు పేరుకు చైనా అని అర్ధం రావొచ్చు…
Ads
చేతిలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఉంటే ప్రపంచాన్ని శాసించవచ్చు అని చైనా 30 ఏళ్ల క్రితమే తెలుసుకుంది. ఇప్పుడు డాలర్లని ఎర వేసి అంతర్జాతీయ మీడియాని కూడా కొనేస్తున్నది. అఫ్కోర్స్, అమెరికన్ మీడియా దిగ్గజాలు కూడా చైనాకి అమ్ముడుపోయి చాలా కాలం అయిపోయింది, కాబట్టే ట్రంప్ మీద విపరీత వ్యతిరేక ప్రచారం చేయించగలిగింది. చైనా నుండే కరోనా ప్రపంచం మొత్తం వ్యాపించింది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అప్పుడప్పుడూ ఏవో ప్రకటనలు చేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావించాలి… చాలా రోజులుగా జింగ్పింగ్ చైనా దాటి పేరున్న ఏ పెద్ద దేశానికి వెళ్ళడం లేదు! వైరస్ భయమా? లేక అవమానం ఎదురవుతుంది అనే భయమా? ఏమో! చైనా అభిమానులే చెప్పగలరు దీనికి సమాధానం…
Share this Article