పెద్ద పెద్ద రాజకీయ పండితులు అవసరం లేదు… మమతకు ప్రధాని పీఠంపై కన్నుపడింది, ఆశ పెరిగింది, చాన్స్ కనుచూపు మేరలో లీలగా కనిపిస్తోంది… మొన్నటి గెలుపుతో ధీమా పెరిగింది… పీకే మీద భరోసా కుదిరింది… కాంగ్రెస్ రాహుల్‌తో ఇక వేస్టని తేల్చేసుకుంది… ఇక ఆట మొదలెట్టింది… అసలు ఈ ఆట నుంచి కాంగ్రెస్‌ను డిలిట్ చేయాలని అనుకుంటోంది… శరద్ పవార్‌ను కలిసింది… కూటమి కడదాం అని చెప్పింది, తనూ సరే అన్నాడు… (ఒకవైపు కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్థితిలోనూ… రాజకీయం అంటే ఇదే)… ఆల్‌రెడీ మేఘాలయలో కాంగ్రెస్‌ను చీల్చేసింది… ఎమ్మెల్యేలను లాగిపడేసింది… మునుపటి కాంగ్రెస్ కాదు కదా, బేర్‌మంటోంది…
గోవాలో పోటీకి సై… యూపీలో పోటీకి సై… జతకట్టడానికి ఆప్ రెడీ… దక్షిణాదిన కేసీయార్, జగన్, స్టాలిన్ కలిసొస్తారా..? లేదా..? పీకేను పురమాయించింది… ఆల్‌రెడీ జగన్ పీకే మాయలో ఉన్నవాడే… కేసీయార్ క్యాంపుతో కూడా భేటీలు నడుస్తున్నవే… స్టాలిన్ ఒక్కడే ఇంకా యూపీయే, కాంగ్రెస్ అంటూ కమిటెడ్‌గా ఉన్నాడు… తన ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఉంది… సో, సైలెంట్… హేమంత్ సొరెన్‌లు గట్రా ప్రాంతీయ నాయకులు గనుక కలిసొస్తే… కాంగ్రెస్‌ను వదిలేసి, సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునని ఆమె ఆశ… ఏదో ఓ అతుకుల బొంత, గతంలో పాలించలేదా..? దేశాన్ని బోలెడంత ఉద్దరించలేదా..? ఇక చాన్స్ దొరికితే వీళ్లంతా కలిసి మళ్లీ దేశాన్ని బ్రహ్మాండంగా ఉద్దరిస్తారన్నమాట…
Ads
కానీ మమతకు సోయి లేని అంశం ఒక్కటుంది… బీజేపీకి మెజారిటీ రాకపోవచ్చునేమో వాళ్లు అనుకున్నట్టు… కానీ అన్ని పార్టీలకన్నా బెటర్ పొజిషన్‌లో ఉంటుంది… సేమ్, కాంగ్రెస్ ఈరోజుకు కూడా రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర నార్త్ రాష్ట్రాల్లో స్ట్రాంగ్… రాహుల్ అనే కేరక్టర్‌ను వదిలించుకోగలిగితే బెటరే, కానీ అది జరగదు, కాంగ్రెస్ కదలదు, అదొక్కటే బలహీనత… మేం వోట్లేస్తాంరా బాబూ అంటూ జనం ముందుకొస్తున్నా సరే వాడుకోలేని దురవస్థ… ఐనా సరే, కాంగ్రెస్ లేకుండా ఇప్పుడున్న స్థితిలో యాంటీ-బీజేపీ కూటమి అసాధ్యం… ఏర్పాటు వరకూ వోకే, కానీ కాంగ్రెస్ పార్టీ లేకుండా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యం…
ఒకవేళ కాంగ్రెస్ సహకారం తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినా సరే, అది నాలుగు రోజులు కూడా ఉండనివ్వదు, అది కాంగ్రెస్ నైజం, దాని జెనెటిక్ కేరక్టర్ అది… మమత తెలంగాణలోకి, ఏపీలోకి ప్రవేశించినా సరే ఆమె సాధించేదేమీ ఉండదు… అన్నింటికీ మించి కేసీయార్, జగన్ పొలిటికల్ అడుగులను ఆమె ఏమాత్రం అంచనా వేయలేదు… ఇద్దరూ ఇద్దరే… వర్తమానంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ తెలంగాణలో… ఏపీలో పరిస్థితి అనూహ్యం… ఒకవేళ తెలుగుదేశం దెబ్బతిన్నదీ అనుకుంటున్న స్పేస్‌లోకి మమత ఎంటర్ కావాలన్నా సరే, ఆమెకు ఏ పాయింటూ ఉపయోగపడదు… అసలు లీడరంటూ ఎవరున్నారు..? ఎవరూ లేకే కదా, బీజేపీ ఎదుగుదల లేక అక్కడ నేల మీద పాకుతోంది… ఇక బెంగాల్ నుంచి వచ్చి మమత చేసేది ఏముంటుంది..? పైగా శల్యసారథ్యానికి పీకే ఉండనే ఉన్నాడు… తను జగన్‌కు జాన్ జిగ్రీ… సో, మమత ఇప్పటికిప్పుడు దక్షిణాదిలో చేసేదేమీ ఉండకపోవచ్చు… కాకపోతే పీకేను ముందుబెట్టి, బలమైన రీజనల్ పార్టీల సమాఖ్యను ఏర్పాటు చేసి, ప్రధాని పదవి వైపు ఆశతో అడుగులు వేసే ప్రయత్నం చేయవచ్చు… వీలైతే ములాయం, మాయావతి, చంద్రబాబు తదితరులతో జట్టు కట్టవచ్చు… కానీ PK పడనివ్వడు… పైగా బీజేపీని తక్కువ అంచనా వేయలేం… మోడీ-షా అసలే ప్రపంచముదుర్లు… చూడాలిక..!!
Share this Article