అదుగో ఒమిక్రాన్…. వచ్చె, వచ్చె… అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక సత్తెనాశ్… అదుగో రెండు కేసులు, హైదరాబాద్ కూడా వచ్చేసిందట… ఈ నీచ్ కమీన్ మీడియా చేస్తున్న దుర్మార్గం, సమాజాన్ని ప్యానిక్ చేస్తున్న దారుణం అంతా ఇంతా కాదు… దిక్కుమాలిన జర్నలిజానికి అజ్ఞానం తోడయితే ఎంత నష్టమో ఒమిక్రాన్ వార్తలే చెబుతున్నయ్… అన్నింటికన్నా నీచం ఏమిటంటే అప్పుడే రాష్ట్రాల వైద్యారోగ్య బాధ్యులు కూడా ఆ రేంజులో మాట్లాడుతుండటం… కొత్తగా ఆంక్షలు, జరిమానాలు అంటూ బెంబేలెత్తించడం… అరాచకానికి అసలైన నకళ్లు వీళ్లు… ఒకవైపు అంతర్జాతీయ వైద్య నిపుణులేమో ఒమిక్రాన్ ఒకరకంగా ప్రపంచానికి మేలు చేయబోతోంది, పాండెమిక్‌ను ఎండెమిక్ చేయబోతోంది అని విశ్లేషిస్తున్నారు… ఆ కరోనా వేరియంట్‌తో ప్రాణాపాయాలు పెద్దగా లేవనీ చెబుతున్నారు… కానీ మన మీడియా, మన ఆరోగ్య శాఖలు, మన ప్రభుత్వాలు మాత్రం అర్జెంటుగా మళ్లీ లాక్ డౌన్లు పెట్టేసి, కార్పొరేట్ డ్రగ్ మాఫియాకు వేలు, లక్షల కోట్లు సంపాదించి పెట్టాలనే తహతహలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నయ్… అంతా ఆధునిక ప్రపంచంలోని మిస్-ఇన్‌ఫర్మేషన్ అనే మరో మాఫియా పైత్యం… దీనికితోడు 1963లో ఇదే పేరుతో సినిమా వచ్చింది అంటూ సోషల్ మీడియా చేసే దరిద్రపు ప్రచారం సరేసరి…
వాడెవడో వచ్చాడు, హోటల్‌లో దిగాడు, వాడికి కరోనా, జీనోమో సీక్వెన్స్ చేయిస్తే ఒమిక్రాన్ అని తేలింది అని మొన్నటి నుంచీ తెగచావగొడుతున్నది మీడియా… మిత్రుడు, కరోనాపై నిరంతరం అధ్యయనం చేస్తున్న విద్యావేత్త Amarnath Vasireddy…… సోషల్ పోస్ట్ ఓసారి చదవండి… మళ్లీ మాట్లాడుకుందాం…
పోయిందే ! పోయి పొచ్చి ! It’s gone !
Ads
4. అన్నిటికంటే ముఖ్యం ఆయన వయస్సు 66. ఈ సోది ఓమిక్రాన్ ఏదో చేసేస్తుందని ప్రచారం ఏదైతే ఉందో… ఇక మీ ఇష్టం…
Share this Article