ఒమైక్రాన్… దీనికి అంత సీన్ లేదురా నాయనా… అని ఎందరు చెప్పినా మన మీడియా వినదు… మన ప్రభుత్వాలు వినవు… అసలు సమయాల్లో కరోనాను అడ్డుకునే తెలివి లేదు, జనాన్ని ఆదుకున్న ఔదార్యం-సామర్థ్యం లేవు గానీ… ఇప్పుడు తెగ భయపెట్టేస్తున్నారు… ఆంక్షలు, జరిమానాలు, తెగ హడావుడి… మళ్లీ బూస్టర్ల డోసుల పేరిట అడ్డగోలు ధరలకు వేక్సిన్లను జనానికి కుచ్చేయాలనే దందా… WHO చెబుతోంది, ఇప్పటికి ప్రపంచంలో ఒమైక్రాన్ వల్ల ఒక్క మరణం లేదని..! మెలికలుగా, చుట్టలుగా అల్లుకున్న రెండు పోగుల జీవపదార్థం అది… జీవం అనాలో లేదో తెలియదు… అది ప్రపంచాన్ని వణికిస్తోంది… వైరస్ అంటేనే బహురూపి… రకరకాలుగా తన రూపాన్ని మార్చేసుకుంటుంది… ఈ ఒమైక్రాన్ కూడా మరో మ్యుటేషన్ అని ఇన్నాళ్లూ చెప్పారు కదా… కానీ కాదట… ఓసారి ఈ పోస్టు చదవండి…
Amarnath Vasireddy…. ఓమిక్రాన్: సంకర వైరస్..! వామ్మో ! ఇన్ని మ్యుటేషన్లా ? ముప్పైకి పైగా మ్యుటేషన్లు వున్నాయి. దీనితో ఇక ప్రళయమే అన్నారు కదా అందరు ? మరో పక్క omicron వల్ల కేవలం మైల్డ్ symptoms వుంటున్నాయి . ఇప్పటిదాకా ఒక్కరు కూడా మరణించలేదు అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. WHO కూడా అదే చెప్పింది. మరి పై రెండు అంశాలకు పొంతన కుదరడం లేదు కదా ? ఓమిక్రాన్ ను లాబరేటరీ లో జీన్ సీక్వెన్సింగ్ చేసిన శాస్త్రవేత్తలేమో ఇది అరివీరభయంకరం అంటుంటే, వాస్తవంగా చూస్తే మాత్రం ఇది సాధుజీవిలాగా కనిపిస్తోంది . ఇది ఎలా సాధ్యం ?
Ads
దీనికి సమాధానం ఇచ్చారు దీనిపై పరిశోధన చేసిన కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన వెంకీ సౌందరాజన్ . ఎవరో ఒక ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వ్యక్తి వున్నాడు అనుకుందాం… అంటే వైరస్‌లకు సులభ టార్గెట్… బహుశా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు అనుకుందాం. అతనికి అప్పటికే జలుబు సోకింది. జలుబు కలుగచేసే HCOv 229E అతని శరీరంలో వుంది. అతనికి ఇప్పుడు కరోనా కూడా సోకింది. అతని కణంలో ఆ జలుబు వైరస్, ఈ కరోనా వైరస్ కలిసి ఓ కొత్త పిల్లని పెట్టాయి. అంటే మ్యుటేషన్ కాదు, సంతానం… ఈ పద్దతిని వైరల్ recombination అంటారు. అంటే ఓమిక్రాన్ ఓ సంకర జాతి వైరస్. అటు జలుబు వైరస్ ను ఇటు కరోనా వైరస్ ను పోలివుంది. శాస్త్రవేత్తలేమో వామ్మో ఇన్ని మ్యుటేషలా ? ఇన్ని మార్పులా ? అని జడుసుకొన్నారు . సో, అది మ్యుటేషన్ కాదు. సంకర వైరస్. వేగంగా విస్తరిస్తుంది. కానీ కాస్త ఒళ్లునొప్పులు, గొంతు గరగర జలుబు తప్పించి ఏమీ కాదు. అదండీ సంకర బేబీ… ఓ మై క్రోన్ !
Share this Article