ఈరోజు సాక్షి పేపర్ చూశారా… అబ్బ, ఆ వార్తలు, వాటిల్లోని గొప్ప క్వాలిటీ గురించి కాదు, దాంట్లో చెప్పుకోవడానికి ఏమీలేదు… అక్కడ భజన, ఇక్కడా భజనే… నమస్తే సాక్షి… అది కాదు, కొన్నిరోజులుగా సాక్షి ప్లస్ అని ఓ డిజిటల్ ఎడిషన్ కనిపించేది… మొదట్లో నాలుగు పేజీలు కనిపించేవి… ప్రింట్ ఎడిషన్లో కవర్ చేయలేక, వదిలేయలేక, స్పేస్ లేక, అంతలేసి జీతాలతో పెట్టుకున్న రిపోర్టర్లు రాసిన వార్తలు ఏం చేయాలో తెలియక ఆ సాక్షి ప్లస్ డిజిటల్ పేజీల్లో అచ్చేసి, చేతులు దులుపుకునేది… నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, బిజినెస్, ఆఫ్ బీట్, వుమెన్ ఓరియంటెడ్ ఎట్సెట్రా వార్తలేం మిగిలినా అందులోకి తోసేసేవాళ్లు… పైగా అది చదవడానికి మెయిల్ ఐడీ రిజిస్ట్రేషన్… ఓ తంతు…
తీరా చూస్తే ఏమైంది..? అసలు పేజీల్లో పెట్టడానికే మంచి ఎక్స్క్లూజివ్ స్టోరీలో, ఇంట్రస్టింగ్ స్టోరీలో రావడం లేదు… ఇక ఈ డిజిటల్ ఎడిషన్ ఏం చేసుకోవాలి..? నాలుగు పేజీలు మెల్లిగా మూడు పేజీలు అయ్యాయి… అవి కాస్తా రీసెంటుగా రెండు పేజీలకు కుదించుకుపోయాయి… ఈరోజు మరీ ఒకటే పేజీ… పోనీ, అందులో ఏమైనా మంచి స్టోరీలున్నాయా..? లేవు… ఏదో సాక్షి ప్లస్ అని డిజిటల్ పేజీలు పెట్టుకున్నాం కదా, ఏదో ఒక పేజీ అయినా ఉండకపోతే ఇజ్జత్ పోతది అన్నట్టుగా… ఏవో నాలుగు స్టోరీలు తోసేసి మమ అనిపించేశారు… మరి ఈమాత్రం దానికి ఈ డిజిటల్ ఎడిషన్ దేనికి అంటారా..? భలేవారే… అంత ఆలోచించేవాళ్లు ఎవరున్నారు అక్కడ..? ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితిలాగే సాక్షి పేపర్ కూడా… భిన్నంగా ఎందుకు ఉంటుంది..? అవునూ, ఆమధ్య ఎవరో కొత్త ఎడిటర్, పీకే రికమెండేషన్ అన్నారు, ఏమైందో మరి..? ఐనా మనకెందుకులెండి… వాళ్ల పేపర్ వాళ్లిష్టం..!~!
Ads
ఈనాడు కూడా ఈ పనిచేస్తోంది… కాకపోతే ప్రింట్ పేజీలు వేరు, డిజిటల్ పేజీలు వేరు… దాన్నలా కంటిన్యూ చేస్తోంది… జనం చదువుతున్నారా లేదా అనేది వేరే సంగతి, పేజీలనైతే నింపుతోంది… పాఠకుడి ప్రాప్తం… అసలు పేజీల్లోనే ఒక్కటీ చదివించే వార్త ఉండటం లేదు… ఇక డిజిటల్ పేజీలను ఎవడు పట్టించుకున్నాడు..? ఉన్నంతలో కాస్త ఆంధ్రజ్యోతి నయం… తన పొలిటికల్ లైన్ స్టోరీలు ఫస్ట్ ప్రయారిటీ, తప్పక వేయాల్సిన ఇంపార్టెంట్ వార్తలు రెండో ప్రయారిటీ, మస్త్ మసాలా చల్లగల వార్తలు మూడో ప్రయారిటీ… అంతే, అన్నీ ప్రింట్ ఎడిషన్లోనే అడ్జస్ట్ చేస్తోంది… మరి సాక్షికి ఎందుకు చేతకాదు అనడక్కండి… బాగుండదు…!!
Share this Article