అఖండమైన ఉత్సాహంతో ఉన్నాడు బాలయ్య… ఇన్నాళ్లు ఫ్లాపుల వైరాగ్యం మొత్తం పోయింది… అఘోరా శివతాండవానికి బాక్సులు బద్దలవుతున్నయ్… ఎస్, బాలయ్యకు శాతకర్ణులు, కథానాయకులు, మహానాయకులు పనికిరారు… అఘోరాలే కరెక్టు అని తేలిపోయింది… (నిజానికి శాతకర్ణి వంటి సబ్జెక్టు ప్రస్తుత తెలుగు హీరోల్లో ఎవరికీ చేతకాదు… అంతేకాదు, అఖండ పాత్ర కూడా…) ఈ ఉత్సాహపు ఊపులో దర్శకులకు, నిర్మాతలకు ఓ సవాల్ వంటిది విసిరాడు… ‘‘నేను విలన్‌గా చేస్తాను’’ ఇదీ ఆ ప్రకటన… ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో చేస్తున్నాడు కదా… ఈసారి అఖండ దర్శకుడు బోయపాటి, విలన్ శ్రీకాంత్, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, సంగీత దర్శకుడు థమన్, ఇంకెవరో స్టంట్ మాస్టర్ పాల్గొన్నారు… ఆహా అయితే ఏమిటి..? ఓహో అయితే ఏమిటి..? ఇప్పుడు అంతా అఖండ ప్రమోషనే కదా… ఇదీ అంతే…
ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు విలన్‌గా చేయడానికి రెడీ అనేశాడు… అయితే ఒక్క షరతు… ఆ సినిమాలో హీరో కూడా తనే అయి ఉండాలిట… నవ్వొచ్చింది… బాలయ్య వంటి నటుడు విలన్‌గా చేసినా సరే, ఆ విలనీ కూడా కరెక్టే అనిపించేలా పాత్రచిత్రణ ఉండాలి… కథ అలా రాయబడాలి, తీయబడాలి, అలాగే చూడబడాలి కూడా..! లేకపోతే కథారచయిత, దర్శకుడి పని అయిపోయినట్టే… ప్చ్, మళ్లీ బోయపాటే కరెక్టు… ఎస్సర్, ఎస్సర్ అంటూ బాలయ్య మనసు తెలిసినట్టుగా, శృతి తెలిసి వ్యవహరిస్తాడు బోయపాటి… బాలయ్య దేనికి నప్పుతాడో తనకు తెలుసు… లాజిక్కులు తొక్కాతోలూ ఏమీ ఉండనక్కర్లేదు… తెర మీద ఒక్కొక్కడి తోలు తీయాల్సిందే, తుక్కు రేగాల్సిందే… అదొక్కటే సింపుల్ సూత్రం… వేరే దర్శకులతో బాలయ్యకు ఇంత శృతి-తాళం కుదరవు అదేమిటో…
Ads
(బాలయ్య తన ఇష్టాల్ని దాచుకోడు… ఆహా షోను ప్రజెంట్ చేస్తున్నది మాన్షన్ హౌజ్…. సరదాగా తీసుకొండి…) నిజంగానే బాలయ్య విలన్‌గా చేస్తే భలే ఉంటుంది… తనకు ఇన్నాళ్లూ దబిడిదిబిడి టైపు హీరో పాత్రలే కదా… తను విలనీ ఎలా చేస్తాడనేది ప్రేక్షకులకు కూడా ఇంట్రస్టింగుగా ఉంటుంది… అదీ సాఫ్ట్ విలనీ పనికిరాదు… నరికే కేరక్టరే ఉండాలి… (సాధారణంగా ఇలాంటి చాట్ షోలతో హోస్ట్ ప్రశ్నలు అడగాలి, గెస్ట్ జవాబులు చెప్పాలి కదా… ఈసారి హోస్టు బాలయ్యే, గెస్టూ బాలయ్యే… మరి అఖండ ప్రమోషన్‌లో బాలయ్య గాకుండా ఎవరు మాట్లాడతారు..?) ఎన్టీయార్‌కు వెన్నుపోటు అనే ప్రస్తావన ఏదో వచ్చినట్టుంది… ‘‘వెన్నుపోటు అబద్ధం, నేను ఆయన కొడుకుల్లో ఒకరిని, అలాగే ఆయన ఫ్యాన్స్‌లో ఒకరిని’’ అంటూ నాడు ఎన్టీయార్‌కు చంద్రబాబు చేతిలో జరిగిన ద్రోహాన్ని ఏదో సమర్థించి, జస్టిఫై చేసే ప్రయత్నం చేసినట్టుగా ఉంది… నిజానికి పబ్లిక్ డొమైన్‌లో ఆయన ఎప్పుడూ వెన్నుపోటు ఎపిసోడ్ మీద ఏమీ మాట్లాడినట్టు గుర్తులేదు, సో, ఈ షోలో ఏం చెప్పాడో చూడాలిక…!!
Share this Article