కరోనా భయాలు, లాక్ డౌన్లు, థియేటర్ బందులు, స్టే హోమ్ ఇబ్బందులు, ఫంక్షన్ల రద్దులు, సోషల్ గ్యాదరింగుల ఆంక్షలు… ఇవన్నీ జనాన్ని ఎటువెైపు నెట్టాయి..? కంప్యూటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఓటీటీల వైపు జనం మళ్లిపోయారు… ఫలితంగా జనం వాడే బ్రాడ్‌బ్యాండ్ పెరిగింది… టైమ్ పెరిగింది… దీని రిజల్ట్ ఏమిటంటే..? గూగుల్, ఫేస్‌బుక్ మరింత పాతుకుపోయాయి… 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి ఇండియా ఆదాయం ఎంతో తెలుసా..? 23,215 కోట్లు…! 29 శాతం ఎక్కువ..! ఈసారి మార్చి వస్తే 2021-22 లెక్కలు తెలుస్తాయి కదా, ఇంకా పెరగనుందని అంచనా… అసలు అది కాదు విశేషం… Star India, ZEEL, Sony Pictures Networks India (SPNI), Bennett Coleman and Company Limited (BCCL), TV18, Sun TV Network, DB Corp, Jagran Prakashan, HT Media తదితర టాప్ యాడ్స్ పొందే తొమ్మది ఇండియన్ కంపెనీల ఉమ్మడి నికర ఆదాయాన్ని మించి గూగుల్-ఫేస్‌బుక్ యాడ్స్ సంపాదించాయి… మన మీడియా ఆదాయం ఘోరంగా కుంచించుకుపోయింది…
గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి కంపెనీల బలుపు ఎలా ఉంటుందంటే… అవి ఏ దేశ చట్టాల్ని గౌరవించవు, మా రూల్సే మాకు రాజ్యాంగం అంటాయి… ఏ దేశ చట్టాలూ మమ్మల్నేమీ చేయలేవు అనుకుంటాయి… ఆమధ్య ఇండియా పార్లమెంట్ కమిటీ ఒకటి పిలిస్తే, ప్రభుత్వం కొత్త రూల్స్ పెడితే ఆమోదించడానికి మొరాయించాయి… ప్రభుత్వం ఓ కొరడా అందుకునేసరికి తోవకు వచ్చినట్టు అనిపించింది… కానీ నిజం ఏమిటంటే..? ఇండియన్ మార్కెట్ పాలిచ్చే గేదె… వదులుకోలేదు… ఇంకా పొటెన్సీ ఉంది, ఇంకా దున్నుకోవాల్సి ఉంది… అందుకే తాత్కాలికంగా తగ్గినట్టు కనిపిస్తుంటయ్…
Ads
ఎన్నాళ్లుగానో చెప్పుకుంటున్నాం కదా… ప్రింట్ మీడియా పని, అనగా పత్రికల పని రాను రాను మరింత క్షీణతే… అదేసమయంలో టీవీ మీడియా కూడా పెద్దగా పికప్ కావడం లేదు… రేడియోను వదిలేయండి… ఇక డిజిటల్ యాడ్స్ టర్నోవర్ విపరీతంగా పెరుగుతోంది… (ఐతే ఇదే గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్ సంస్థలు తమకు కంటెంట్ ప్రొవైడ్ చేసే సైట్లు, వీడియో కంపెనీలకు మాత్రం షేర్ చేసే రెవిన్యూలో బాగా కోత పెట్టేశాయి… ఇదొక డబుల్ స్టాండర్డ్… ఒకవైపు రెవిన్యూ పెరుగుతూ ఉంటే, మరోవైపు కంటెంట్ ప్రొవైడర్ల షేర్ కూడా పెరగాలి కదా… లేదు… అది మరో కథ…)
ఈ రెండింటినీ విడివిడిగా పరిశీలిస్తే ఫేస్‌బుక్ వాడి ఆదాయం 41 శాతం, గూగుల్ వాడి ఆదాయం 21 శాతం పెరిగాయి… అదే సమయంలో తొమ్మిది ఇండియన్ టాప్ యాడ్స్ కంపెనీల ఆదాయం మాత్రం 29 వేల కోట్ల నుంచి 21 వేల కోట్లకు పడిపోయింది… ప్రింట్, టీవీ, రేడియో, ఔట్‌డోర్ ఆదాయాలన్నింటిలోనూ డ్రాపే… స్టార్ ఇండియా 15, జీ 20, సోనీ 11, సన్ టీవీ 28, టీవీ-18 21 శాతం ఆదాయాన్ని కోల్పోయాయి… (వీటిల్లో సన్ టీవీ బార్క్ రేటింగుల్లో దేశంలోకెల్లా నంబర్ వన్ టీవీ నెట్‌వర్క్)… టైమ్స్ వాడి రెవిన్యూ ఏకంగా 48 శాతం పడిపోయింది… ఒకప్పుడు అది యాడ్స్ సేకరణలో, ఆదాయంలో కింగ్… ఇప్పుడు ఏడుపే… దైనిక్ భాస్కర్ రెవిన్యూ కూడా అంతే… 35 శాతం డ్రాప్… జాగరణ్ ప్రకాశన్ 42, హిందుస్థాన్ టైమ్స్ 48 శాతం రెవిన్యూ కోల్పోయాయి… పత్రికల మీద కరోనా ప్రభావం ఎంత ఉందో తెలిసిందిగా… అందుకే యూనిట్ల మూసివేత, ఉద్యోగాల కోత, డిజిటల్ పబ్లికేషన్ల వైపు ప్రయాణం… పెద్ద పెద్ద పత్రికలు సైతం వెబ్ ఎడిషన్ల మీద కాన్సంట్రేట్ చేస్తున్నాయి… భారీ జీతాలు ఆఫర్ చేస్తూ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి, ప్రాంతీయ భాషల్లోకి విస్తరిస్తున్నాయి..!!
Share this Article