ఎమర్జన్సీ… ప్రభుత్వ వ్యతిరేక వార్త అనిపిస్తే చాలు, జర్నలిజంతో ఏమాత్రం టచ్ లేకపోయినా సరే అధికారులు రంగంలోకి దిగేవాళ్లు… కత్తి కట్టేవాళ్లు, సెన్సార్ అనేవాళ్లు, కొరడా పట్టుకునేవాళ్లు, ఒరేయ్, నీ పత్రిక రావాలని లేదా అని బెదిరించేవాళ్లు, జైళ్లోకి వెళ్లాలని ఉందా అని కూడా మెడ మీద కత్తి పెట్టేవాళ్లు… దేవుడా అనుకుంటూ సదరు పత్రికలు వాటికి బ్లాక్ చేసి, పత్రికల్ని రిలీజ్ చేసేవి… అంతే… పత్రికలపై సెన్సార్ అంటే అలాగే ఉండేది… తెలంగాణలో ఒకరకం ఎమర్జెన్సీ… ఆంధ్రజ్యోతి తప్ప ఇంకెవరికీ దాన్ని సవాల్ చేసి, మొండిగా నిలబడే ధైర్యం లేదు… అందరూ ఉత్తపోషిగాళ్లే… ఏపీలో మరోరకం… అక్కడా ఆంధ్రజ్యోతి మినహా మరో పత్రిక లేదు, టీవీలు ఎలాగూ పాలకుల పాదాల ఎదుట డీజే సౌండ్‌తో కీర్తనలు ఆలపిస్తున్నయ్… అరెరె, బెంగాల్ మరో తరహా… అక్కడ మరో లేడీ హిట్లర్… లేడీ ముసోలినీ…
అసలు సర్క్యులేషన్ ఫిగర్స్ ఓ దందా… ప్రత్యేకించి ప్రభుత్వ సమాచార శాఖ దగ్గర రికార్డయ్యే ఫిగర్స్ ఓ స్కామ్… ఏవేవో పిచ్చి ఆడిటింగుల పేరిట అడ్డగోలు కాపీలను చూపించి, అడ్డగోలెస్ట్ రేట్లతో ప్రభుత్వ ప్రకటనలు తీసుకోవడం, యాడ్ ఏజెన్సీల కమీషన్లు, డబ్బులు ఇవ్వడానికి అధికారుల కమీషన్లు అదొక దందా… అవన్నీ వదిలేస్తే… అసలు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుకూల, భజన స్టోరీలు పబ్లిష్ చేయాల్సిందే అనే మమత అనే నియంత రూల్స్ వేరు… ఆమె అంతే… కాబోయే ప్రధాని కదా… కాస్త పొగరు ఆల్‌రెడీ తలకెక్కినట్టుంది… అసలు బెంగాల్ మీడియా ఎప్పుడో ఆమె పాదాల మీద పడిపోయింది… ఇప్పుడు కొత్తగా అవి పీకేదేమీ లేదు… ఐనా సరే, భజన వార్తలేవీ అని కొరడా పట్టుకుంది ఆమె…
Ads
https://twitter.com/meghbulletin/status/1467825270748958721?s=24
వీలైతే అపర దుర్గమాతలా ఆమె బొమ్మల్ని ముద్రించాలి… మరీ అమ్మవారి కరుణ కావాలంటే మాస్ట్ హెడ్ పక్కనే మమతను కలకత్తా కాళి తరహాలో మార్ఫింగ్ ఫోటో ఒకటి ప్రచురించినా సరే…. అసలు ఈ హోల్ మొత్తం ప్రపంచంలో మమత వంటి పాలకురాలు లేదు, రాలేదు, రాబోదు అనేట్టు కీర్తనలు రావాలి… రాకపోతే నథింగ్ డూయింగ్, ఒక్క ప్రభుత్వ ప్రకటన కూడా ఇవ్వదట… అరెరె, ఇవ్వకపోతే పోనీ, తరువాత ఇక ఆ మీడియా మీద కనబరిచే కక్షసాధింపు ఎలా ఉంటుందనేదే భయాందోళన కారకం… అసలు ఎన్నికల్లో టీఎంసీ మినహా ఎవడూ పోటీచేయవద్దు అనే తరహాలో వేటకత్తి పట్టుకుని బీజేపీ, సీపీఎం మీద విరుచుకుపడ్డ వార్తలు బోలెడు చదివాం కదా… ఆఫ్టరాల్ మీడియా ఎంత..? సర్జికల్ స్ట్రయిక్స్ చేసే అంతటి మోడీయే ఆమెను ఏమీ చేయలేక, చేష్టలుడిగి దిక్కులు చూస్తున్న తీరు కూడా చూశాం కదా… సో, బెంగాల్ మీడియా అర్జెంటుగా సాక్షి, నమస్తే వంటి ఆఫీసులను సందర్శించి, నాలుగు మెళకువలు నేర్చుకుంటే మనుగడ… లేకపోతే ఆమె ఊరుకోదు… భావప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ వంటి పదాలు ఆమె వినదు, వినలేదు, వినడానికి ఇష్టపడదు… తరువాత మీ ఇష్టం… ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈనాడు, ఈటీవీ, టీవీ5 ఇలాంటి పచ్చటి మీడియానే జగన్ ఏమీ చేయలేకపోయాడు… కొత్త జీవోలు తీసుకొచ్చినా వాళ్ల మీద ఈగ వాలలేదు… మమత దగ్గర పీకే ఉన్నాడు, జగన్ దగ్గర కూడా పీకే ఉన్నాడు… ఏ సలహాలూ ఇవ్వడం లేదా..?!
Share this Article