నిజం చెప్పాలి… ఎవరేం అనుకున్నా సరే… పాత్రికేయం ఏ ఉన్నత విలువలకు చేరుకుందో చూస్తుంటే ఒడలు గగుర్పొడుస్తోంది… పులకరించిపోతోంది… పరవశించిపోతోంది… అసలు ఆంధ్రప్రభ అనే పత్రికే లేకుండా పోతే తెలుగు జర్నలిజం మనుగడ, ప్రతిష్ట ఏమైపోయేవో అని ఆలోచిస్తేనే గుండె జల్లుమంటోంది… థాంక్ గాడ్… ఆ పత్రిక ఒకటి ఉంది కాబట్టి ఇంకా సగటు తెలుగు జర్నలిస్టు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు నేనూ జర్నలిస్టునే అని..! అ పత్రిక పాటించే ప్రమాణాలు, పాత్రికేయ విలువలు సరిగ్గా అర్థం చేసుకోవాలే తప్ప మాటల్లో పెద్దగా వ్యక్తీకరించలేం… తాజా ఉదాహరణ, ఆర్ఆర్ఆర్ అనబడే ఓ దిక్కుమాలిన చరిత్ర వక్రీకరణకు ప్రశంసలు, బ్యానర్ స్టోరీ… వారెవ్వా… గ్రేటాంధ్రప్రభ… స్వర్ణాంధ్రప్రభ… నవ్యాంధ్రప్రభ… నవనవోన్మేషప్రభ… వెలిగిపోతోంది…
అరెరె, ఏం రాశాడు బ్రదరూ… ఏ ఇతర ఎడ్డెదవలకైనా సాధ్యమైందా ఈ ఫీట్..? ఏదో పిచ్చి సినిమాకు ట్రెయిలర్ అట… కోట్లల్లో వ్యూస్ అట, ప్రపంచమంతా ఊగిపోతోందట… అరె, హాలీవుడ్ ఘన దర్శకులందరూ ఉచ్చ పోసుకుంటున్నారట.., “ఈ రాజమౌళి మన సామ్రాజ్యాల్ని హస్తగతం చేసుకుంటున్నాడు, వీడిని ఎలా అడ్డుకోవడం” అని మొత్తం అగ్రదేశాల మహోగ్ర దర్శకరత్నాలు తల్లడిల్లిపోతున్నారట… తొక్కలో అవతార్, టైటానిక్… ఆఫ్టరాల్… ఇన్నేళ్లూ మనల్ని మాయచేసిన ఆ తలతిక్క క్రియేటివ్ సినిమాల ఆధిపత్యాన్ని మన రాజమౌళి ధ్వంసం చేసి, ఆ కోటల్ని హస్తగతం చేసుకుని, ఓ కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించేశాడుట… జేమ్స్ బాండా, వాడి బొందా… రాజమౌళికన్నా ఎక్కువా..? అరె, బాహుబలిలోని ఆ స్ప్రింగ్ తాడిచెట్లు ప్రపంచ సృజనాత్మక చరిత్రలో ఒక్కడికైనా సాధ్యమయ్యాయా..?
Ads
ఒక తెలుగు సినిమా టీజర్‌కు ప్రపంచం దాసోహం అనడం ఎప్పుడైనా చూశారా…? పోనీ, చూడలేని అజ్ఞానం మీది… కనీసం ఆ జ్ఞానం బోధించే ఆంధ్రప్రభ బ్యానర్ కథనమైనా చదివారా..? మన నరాలు ఉప్పొంగి, సునామీలా పట్టలేని ఆనందం వెల్లువెత్తిన తీరును అనుభవించారా..? ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు… మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ఒక్కడైనా గుర్తించాడా ఈ ఘనతను..? సిగ్గులేని బతుకులు, ఎందుకురా మీ పత్రికలు, మీ టీవీలు… అరె, నేర్చుకొండిరా, వార్తలు అంటే ఏమిటో… బ్యానర్లు అంటే ఏమిటో… అందరికన్నా ముందు రామోజీరావు, రాధాకృష్ణ, జగన్ ఎట్సెట్రా పెద్ద పత్రికల యజమానులందరూ లెంపలేసుకుని, తక్షణం తమ మీడియా సంస్థల్ని మూసేస్తే కాస్త ఇజ్జత్ దక్కుతుంది… లేకపోతే ఆంధ్రప్రభ ధాటికి మూసుకుని పోవాల్సి ఉంటుంది… ఏం బుర్రలురా భయ్ మీవి..?
కనీసం ఆ పత్రికలు… పోనీ, సోకాల్డ్ ది గ్రేట్ తెలుగు టీవీ చానెళ్ల ఎడిటర్లు, సీఈవోలు సిగ్గుతో తలదించుకుని, రాజీనామాలు చేసి, ఏ నల్లమల అడవుల్లోకో వెళ్లిపోయి, ఆశ్రమాలు కట్టుకుని, పశ్చాత్తాప వైరాగ్యంలో బతకొచ్చు కదా… ఎందుకొచ్చిన బతుకులురా భయ్…? అసలు ఓ సినిమా ట్రెయిలర్ వ్యూస్ (యూట్యూబ్ వ్యూస్ ఓ భ్రమపదార్థం, అవెలా ట్యాంపరవుతాయో ఈ రచయితకు పూర్తి జ్ఙానం ఉంది) మీద ఇంత పెద్ద బ్యానర్ స్టోరీ రాయడం అనేది నభూతో నభవిష్యతి… ఇప్పటికైనా మన హిందూ జర్నలిజం అకాడమీ దగ్గర్నుంచి, వాషింగ్టన్ టైమ్స్, గ్లోబల్ టైమ్స్ తక్షణం కొత్త జర్నలిజం సిలబస్, కరిక్యులం రూపొందించుకోవాలని సవినయ ప్రార్థన…!! ఇంకా సమగ్రంగా ఆ స్టోరీని విశ్లేషించడం నాలాంటి అల్పజ్ఞానులకు చేతకాదు, కాబట్టి ఆ లోతుల్లోకి వెళ్లడం లేదు, క్షమించగలరు…!! అన్నట్టూ… ఓ చేదునిజం… రాజమౌళి అనే కేరక్టర్ ఎవడికీ ఒక్క యాడ్ కూడా ఇవ్వడు… ఇంటర్వ్యూలు, దిక్కుమాలిన స్టోరీలతో తనకు కావల్సిన ప్రమోషన్ మీడియాలో చేయించుకుంటాడు… ఫాఫం, ఆంధ్రప్రభ వాడికి తెలియదు కాబోలు…!!!
Share this Article