ఏబీఎన్ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు – విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్ఐఆర్ – కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు బదిలీ చేయనున్న సీఐడీ – ఐపీసీ 353, 341, 186, 120 (బి) సెక్షన్ల కింద ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు…… ఇదీ వాట్సప్పు గ్రూపుల్లో కనిపించిన ఓ వార్త… అరెరె, అదేమిటి మరి..? ‘‘‘నేను అక్కడికి వెళ్లాకే అందరికీ నచ్చజెప్పాను, పయ్యావుల కేశవ్‌ను అక్కడి నుంచి పంపించేశాను, లక్ష్మినారాయణ కుటుంబసభ్యులు కూడా సీఐడీ అధికారులకు సహకరించారు… మీరు ఇంకాసేపు ఉండండి సార్, మా పని సులువవుతుంది అని సీఐడీ అధికారులు రిక్వెస్టు చేశారు కూడా’’’ అని కదా రాధాకృష్ణ నిన్న రాశాడు, ఈరోజు ఇంకో వార్త రాశాడు, తన కొత్త పలుకు కాలమ్‌లోనూ ఏకరువు పెట్టాడు, ఏబీఎన్ చానెల్‌లోనూ చెప్పుకున్నారు… మరి అకస్మాత్తుగా సీఐడీ వాళ్లకు రాధాకృష్ణ మీద కోపం ఎందుకొచ్చింది..?
నిజమే, రాధాకృష్ణ సీఐడీ తనిఖీలు జరుగుతున్న చోటకు వెళ్లడం తప్పేమీ కాదు, ఒక దోస్త్‌కు ఇబ్బంది ఎదురైనప్పుడు కాస్త భరోసా ఇవ్వడానికో, సాయంగా నిలబడటానికో వెళ్తే తప్పేముంది..? సాక్షి వాళ్లే రాశారు, ఆయన చాలాసేపు అక్కడే ఉన్నాడు, వీడియోలు తీయించాడు అని… సీఐడీ వాళ్లు ఏమీ అనలేదుగా, వెళ్లిపొండి అని కూడా అనలేదుగా, నిజంగా ఆర్కే వైఖరి ఇబ్బందికరం అనుకుంటే సీఐడీ అధికారులు అక్కడ ఉండనిచ్చేవాళ్లు కాదుగా…. కానీ సాక్షి వాళ్లకు చిర్రెత్తింది… ఆర్కే హల్‌చల్, బెదిరిస్తున్నాడు అధికారులను అంటూ ప్రచారం, ప్రసారానికి దిగింది… సరే, ఏదో జాతివైరం, రాజకీయవైరం ఎట్సెట్రా… సాక్షి పత్రికలో కూడా ఏదో రాశారు, రాధాకృష్ణ దానికి కౌంటర్ రాశాడు, అయిపోయింది, తెల్లారి మళ్లీ ఇంకో వార్త దేనికి..? కొత్తపలుకులో ఓ శోకాలు దేనికి..? వదిలేసి ఉండాల్సింది…
Ads
నేను తప్పు చేస్తే సీఐడీ వాళ్లు నామీద కేసు పెట్టేవారు కదా అని కూడా రాసుకున్నాడు… అదుగో అక్కడ తాడేపల్లి పెద్దలకు ఏదో హింట్ దొరికింది… ఏదో కర్తవ్యబోధ వినిపించింది… అది కూడా రాధాకృష్ణే స్వయంగా చెప్పినట్టయింది… గుర్తుచేసినట్టయింది… మరి రాధాకృష్ణే హింట్ ఇస్తుంటే, దొరుకుతుంటే ఊరుకుంటారా..? మొన్న చాలా పాజిటివ్‌గా, మర్యాదగా ఉన్న సీఐడీ వాళ్లకు ఆగ్రహం వచ్చింది… కేసులు పెట్టేశారు… అసలే సాక్షి వాళ్లు రాశారు కదా… సీఐడీ వాళ్లు కోపంగా ఉన్నారని… మరి వాళ్లు రాశాక కూడా సీఐడీ వాళ్లకు కోపం రాకపోతే ఎలా..? కోపం తెచ్చుకోవాలని ఆదేశిస్తున్నట్టే కదా… సో, కోపగించారు, ఏవో సెక్షన్లు పెట్టేశారు… తెలంగాణకు బదిలీ చేస్తారట కేసును…. హమ్మయ్య, పోనీలెండి, తెలంగాణ పెద్ద సారుకు రాధాకృష్ణ దోస్తే… పైగా తెలంగాణ సీఐడీకి పెద్ద సారు ఎప్పుడూ పెద్దగా పనిచెప్పడు, ప్రయాసపెట్టడు… ఆమేరకు ఆర్కేకు రిలీఫ్… సో, రిలాక్స్ సారూ…!! కానీ ఇకపై మీ జుత్తు దొరకబుచ్చుకునేలా మీరే రాతల్లో హింట్స్ ఇవ్వకండి…!! అఫ్‌కోర్స్, రేపు సాక్షిలో ఒక వార్త, ఆంధ్రజ్యోతిలో మరో వార్త పాఠకబాధితులు చదవక తప్పదన్నమాట… కానివ్వండి…
Share this Article