……… By….. పార్ధసారధి పోట్లూరి……… ఒక పెద్ద వార్త భారతదేశానికి ! ఫ్రాన్స్ తన న్యూక్లియర్ ఎటాక్ సబ్మెరైన్ అయిన బర్రాకుడా [SSBN] ని భారత్ కి అమ్మడానికి ప్రతిపాదనల్ని టేబుల్ మీద ఉంచింది! ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ [Florence Parly] గారు మొన్న [17-12-2021] భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశం అయిన తరువాత నిన్న 18-12-2021 న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయినప్పుడు ఈ ప్రతిపాదన చేశారు. ఇది అనుకోని సంఘటన! అసలు ఫ్రాన్స్ నుండి ఇలాంటి ప్రతిపాదన వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ అనూహ్యంగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ చేసిన ప్రతిపాదన మాత్రం సామాన్యమైంది కాదు. ఇక ఆ ప్రతిపాదనలోని అంశాలు ఏమిటో చూద్దాం .
1. ఫ్రాన్స్ తన అధునాతన న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ [SSBN] ని భారత్ కి అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు డిజిల్ ఎలెక్ట్రిక్ ఎటాక్ సబ్ లని మాత్రమే అమ్మడానికి సుముఖుత చూపింది.
Ads
2. తన అధునాతన న్యూక్లియర్ ఎటాక్ సబ్మెరైన్ బర్రకుడాలని అమ్మడానికి సుముఖత చూపించడమే కాదు వాటిని భారత్ లోనే Make-in India లో భాగంగా మన దేశంలోనే నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. సాధారణంగా న్యూక్లియర్ సబ్మెరైన్ లని ఎ దేశం కూడా ఇతర దేశాలలో నిర్మించడానికి ఒప్పుకోవు… అలాంటిది ఫ్రాన్స్ మన దేశంలోనే తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదించింది. ఇదీ అసలు బిగ్ న్యూస్.
౩. ఇది భారత నేవీకి అదనపు శక్తి ని ఇచ్చే అంశం. భారత నేవీని ఎప్పటి నుండో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు మన నాయకులు. నిజానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లకి ఇచ్చినంత ప్రాముఖ్యత గత దశాబ్దాలుగా మన నౌకా దళాలకి ఇవ్వలేదు అన్నది నిష్టుర సత్యం. దీని మీద నావీ ఉన్నతాధికార్లు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. మనకి అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రంతో పాటు బంగాళాఖాతంతో సుదీర్ఘ తీరం ఉంది. కానీ మనకి ఉన్న సముద్ర తీరాన్ని కాపలా కాయడానికి అవసరం అయినన్ని యుద్ధ నౌకలు కానీ, జలాంతర్గాములు కానీ లేవు. ఇది చాలా ప్రమాదకరం.
4. ఇప్పటికిప్పుడు ఇవి తయారుచేయలేరు కానీ రాబోయే సంవత్సరాలలో ఇండో – పసిఫిక్ రీజియన్ లో భారత్ నౌకా శక్తిని విస్మరించలేదు యే దేశం కూడా! అయితే ఫ్రాన్స్ ఇవ్వచూపుతున్న బర్రాకుడ సబ్ లు న్యూక్లియర్ పవర్ తో పనిచేసే సబ్ మెరైన్ లు. అంటే ఇవి సుదూరం ప్రయాణించి దాడి చేయగల బాలిస్టిక్ మిసైల్ లని ప్రయోగించగలవు. న్యూక్లియర్ మిసైల్ లని ప్రయోగించలేవు. ఒకసారి సముద్రంలోకి వెళ్ళిన తరువాత కేవలం ఆహారం, మందులు లాంటి వాటి కోసమే సముద్ర ఉపరితలం మీద వస్తాయి తప్పితే సంప్రదాయ డీజిల్ ఎలెక్ట్రిక్ సబ్మేరైన్ ల లాగా చార్జింగ్ కోసం వారానికో పది రోజులకో సముద్ర ఉపరితలం మీదకి రావాల్సిన అవసరం ఉండదు.
5. ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి… రాఫెల్ జెట్ ఫైటర్స్ డీల్ విషయంలో ప్రధాని మోడీ జీ చూపిన చొరవ ఫ్రాన్స్ కి చాలా నచ్చింది. మనకి ఏం కావాలో అడిగి ఫ్రాన్స్ ని ఒప్పించి రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం చేసుకోవడం, వెంటనే నిధులు విడుదల చేయడం జరిగింది. 2022 మొదటి క్వార్టర్ లోపే చివరి రాఫెల్ భారత్ కి చేరుకోనుంది. ఇదంతా చాలా వేగంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా జరిగిపోయింది. ప్రస్తుత భారత రాజకీయ నాయకత్వం మీద ఫ్రాన్స్ కి గురి కుదిరింది. రెండు… 15 డీజిల్ ఎలెక్ట్రిక్ సబ్మెరైన్ ల కోసం ఆస్ట్రేలియా ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకొని, అవి డిజైన్ దశలో ఉండగా, హఠాత్తుగా జో బిడెన్ కాన్సిల్ చేయించి అమెరికన్ న్యూక్లియర్ ఎటాక్ సబ్మెరైన్ లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకోవడం మీద, ఫ్రాన్స్ అమెరికాలోని తన రాయబారిని వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే ! ఒకసారి ఒప్పందం చేసుకున్న తరువాత ఆస్ట్రేలియా కాన్సిల్ చేసుకోవడం ఫ్రాన్స్ కి తీవ్ర నష్టాన్ని కలుగచేసింది. ఒకసారి ఒప్పందం జరిగాక ఫ్రాన్స్ నావల్ గ్రూప్ సంస్థ వివిధ ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకొని, తన ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ లు చెల్లించింది. కానీ ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ లు కలిసి ఆడిన నాటకం వల్ల ఫ్రాన్స్ నష్టపోయింది. తన దేశ కంపనీలకి ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి తీసుకునే అవకాశం లేదు. ఈ రెండు కారణాల వల్ల ఫ్రాన్స్ భారత్ ని తన వ్యూహాత్మక డిఫెన్స్ భాగస్వామిగా గుర్తించింది. ఇప్పటికే సింహభాగం మిలటరీ ఎక్విప్మెంట్ పూర్వపు సోవియట్ , రష్యా లకి చెందినవే భారత్ వద్ద ఉన్నాయి. క్రమంగా ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆయుధాలు కూడా భారత అమ్ములపొదిలో చేరుతున్నాయి. ఫ్రాన్స్ రష్యాని వెనక్కి నెట్టి తను భారత్ కి ప్రధాన రక్షణ భాగస్వామి కావాలని కోరుకుంటున్నది.
6. ఈ సంవత్సరం మొదట్లో ప్రధాని మోదీ ప్రాజెక్ట్ 75 [Project 75 (I)] పేరుతో Make in India లో భాగంగా 6 డీజిల్ ఎలెక్ట్రిక్ ఎటాక్ సబ్మేరిన్ల కోసం, వ్యూహాత్మక భాగస్వాముల కోసం అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. జెర్మనీ, రష్యా, ఫ్రాన్స్ లు ఆసక్తి చూపాయి. కానీ ఇప్పటికే ఫ్రాన్స్ తన స్కార్పీన్ క్లాస్ డిజిల్ ఎలెక్ట్రిక్ ఎటాక్ సబ్మేరైన్లని [6] ముంబై లోని మజ్గావ్ డాక్ యార్డ్ లో నిర్మిస్తున్నది. కొత్తగా ప్రాజెక్ట్ 75 పేరుతొ పిలిచిన టెండర్ల వల్ల జర్మనీకి చెందిన German TKMS సంస్థ మొదట్లో ఆసక్తి చూపింది. ఆ తరువాత కొరియన్ దిగ్గజం దేవూ KSSIII [Daewoo KSS-III of South Korea] సంస్థ కూడా పోటీలో ఉంది. అయితే ఫ్రాన్స్ దూకుడిని చూసిన జర్మనీ నేరుగా పోటీలో ఉండకుండా తప్పుకుంది . భారత్ కి చెందిన L&T సంస్థ మజ్గావ్ డాక్ యార్డ్ తో భాగస్వామ్య ఒప్పందం చేసుకొని బరిలో నిలిచింది. ఇది షార్ట్ లిస్టు అయ్యింది కూడా. అయితే ప్రాజెక్ట్ 75 కోసం భారత్ అడిగింది ఫ్యూయెల్ సెల్ ఎయిర్ ఇండిపెండెంట్ డీజిల్ ఎలెక్ట్రిక్ ఎటాక్ సబ్మరైన్ ల కోసం మాత్రమే.
7. ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇంకో కారణం కూడా ఉండి ఉండవచ్చు . అదేమిటంటే భారత్ ఎయిర్ ఫోర్స్ కోసం త్వరలో పిలవబోతున్న 114 MRFA [Multi Role Faighter Aircraft ] టెండర్లలో పాల్గొని తన కొత్త వెర్షన్ రాఫెల్ –F4 ని పోటీలో ఉంచి ఎలాగయినా మళ్ళీ తానే 114 ఫైటర్ జెట్ల కాంట్రాక్ట్ ని స్వంతం చేసుకొనే అవకాశాన్ని నిలబెట్టుకుంది ఫ్రాన్స్. ఇప్పుడు మనం కొన్న రాఫెల్ మోడల్ F-3 అయితే కాంగ్రెస్ హయాంలో బేరం ఆడిన మోడల్ F-2… So! ఫ్రాన్స్ తన కొత్త తరం రాఫెల్ –F4 మోడల్ ని మొదటగా మనకే అమ్మాలనే పట్టుదలతో ఉంది. అందుకోసమే న్యూక్లియర్ ఎటాక్ సబ్మెరైన్ టెక్నాలజీని భారత్ ఇవ్వడానికి సిద్ధపడ్డది. కుచ్ పానేకేలియే కుచ్ ఖొనా హై నా ?
8. గత అక్టోబర్ నెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో సమావేశం అయినపుడు సబ్మెరైన్ ల గురించి చర్చలు జరిగాయి. మళ్ళీ గత నవంబర్ నెలలో భారత్ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ రక్షణ సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోన్నేతో సమావేశం అయినపుడు కూడా సబ్మెరైన్ ల మీద చర్చలు జరిగాయి. కానీ అనూహ్యంగా ఏకంగా న్యూక్లియర్ ఎటాక్ సబ్ ల టెక్నాలజీ ని ఇవ్వడానికి ప్రతిపాదించింది ఫ్రాన్స్.
9.ఆస్ట్రేలియా ఫ్రాన్స్ తో చేసుకున్న సబ్ ల ఒప్పందాన్ని కాన్సిల్ చేయడంతో ఫ్రాన్స్ చాలా కసిగా ఉంది. ఇంతకీ అమెరికా ఆస్ట్రేలియా కి ఇవ్వజూపిన న్యూక్లియర్ ఎటాక్ సబ్ లు ఎప్పుడు పూర్తి అవుతాయి ? జస్ట్ 2040 కి అన్నమాట ! ఫ్రాన్స్ మాత్రం మొదటి బర్రాకుడా న్యూక్లియర్ సబ్ ని 2030 కల్లా భారత్ లోనే తయారుచేసి ఇవ్వబోతున్నది. ఒకవేళ ఒప్పందం ఖరారు అయితే Win Win సిచ్యుయేషన్ రెండు దేశాలకి ఇది….
Share this Article