ఫాఫం… కమ్ముల శేఖర్ తనకు చేతకాని ఏదో సబ్జెక్టు డీల్ చేసినట్టనిపించింది… ఫలితం లవ్‌స్టోరీ సినిమా అంత పెద్ద ఇంప్రెసివ్‌గా రాలేదు… నెగెటివ్ మౌత్ పబ్లిసిటీ కారణంగా, ఈమాత్రం సినిమాకు థియేటర్ల దాకా ఏం వెళ్తాములే అనుకుని జనం కూడా పెద్దగా పట్టించుకోలేదు.., అంటే శేఖర్ కమ్ముల ఇన్నిరోజులు ఆగీఆగీ, విడుదల వాయిదా వేసీవేసీ, తన రేంజ్లో మంచి కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయాడు… మరి కనీసం టీవీల్లో రేటింగ్స్ సంగతేమిటి..? కాస్త బెటర్… కాస్త కాదు, బెటరే… స్థూలంగా 18.01 రేటింగ్స్ వచ్చాయి… నిజానికి చాలాకాలంగా టీవీల్లో కొత్త తెలుగు సినిమాలకు పెద్దగా రేటింగ్స్ రావడం లేదు… వెరీ పూర్ రేటింగ్స్ నమోదు అవుతున్నయ్… ఈ కోణంలో ఈ రేంజ్ రేటింగ్స్ చూడటం చాలారోజుల తరువాత ఇప్పుడే… సో, నాగచైతన్యకు, కమ్ముల శేఖర్‌కు కాస్త తృప్తి… హైదరాబాద్ కేటగిరీ రేటింగ్స్ చూస్తే 13.44 కూడా బెటర్ రేటింగ్సే… ఒకసారి టీవీ రైట్స్ అమ్మేశాక ఏ రేటింగ్స్ వచ్చినా వాళ్లకు అదనంగా వచ్చే ఫాయిదా ఏమీ ఉండదు కానీ, ప్రేక్షకాదరణ గనుక బాగుంటే, తరువాత తీసే కొత్త సినిమాలకు ఈ రీచ్, ఈ పాపులారిటీ కాస్త ఎంకరేజ్మెంట్…
1 | 12/15/2021 | Wednesday | 07:30:22 PM | 08:00:12 PM | KARTHIKA DEEPAM | 17.39 | STAR Maa | ||
2 | 12/16/2021 | Thursday | 07:30:37 PM | 08:00:46 PM | KARTHIKA DEEPAM | 16.14 | STAR Maa | ||
3 | 12/17/2021 | Friday | 07:30:26 PM | 08:00:03 PM | KARTHIKA DEEPAM | 15.70 | STAR Maa | ||
4 | 12/13/2021 | Monday | 07:30:27 PM | 07:59:57 PM | KARTHIKA DEEPAM | 15.61 | STAR Maa | ||
5 | 12/11/2021 | Saturday | 07:31:18 PM | 08:01:06 PM | KARTHIKA DEEPAM | 15.47 | STAR Maa | ||
6 | 12/14/2021 | Tuesday | 07:30:17 PM | 07:59:41 PM | KARTHIKA DEEPAM | 15.27 | STAR Maa | ||
7 | 12/15/2021 | Wednesday | 07:00:14 PM | 07:30:22 PM | GUPPEDANTHA MANASU | 14.34 | STAR Maa | ||
8 | 12/16/2021 | Thursday | 07:00:31 PM | 07:30:37 PM | GUPPEDANTHA MANASU | 14.30 | STAR Maa | ||
9 | 12/17/2021 | Friday | 06:59:50 PM | 07:30:26 PM | GUPPEDANTHA MANASU | 13.81 | STAR Maa | ||
10 | 12/12/2021 | Sunday | 05:57:24 PM | 08:59:56 PM | WTP-TEFF-LOVE STORY | 13.44 | STAR Maa |
వాస్తవానికి సినిమా ఇంకాస్త హిట్ కావల్సింది… మంచి పాటలు పడ్డయ్, సాయిపల్లవి సూపర్ డాన్సులు, ఓ లవ్ స్టోరీ, చైతూ కూడా కాస్త చూడబుల్ అనిపించాడు… తన ఇతర కమర్షియల్, సోది సినిమాలకన్నా బెటరే… పైగా సెన్సిటివ్‌గా సబ్జెక్టు డీల్ చేస్తాడని కమ్ముల శేఖర్‌కు ఉన్న పేరు… అసభ్యత, అశ్లీలాలకు దూరం… ఈ స్థితిలో థియేటర్లలో అనుకున్నంతగా పెద్ద హిట్ కాకపోవడం ఒకింత ఆశ్చర్యమే… కానీ అవే కులాలు, అవే కులాంతర లవ్ స్టోరీలు… తెలుగు సినిమాలు ఇంకా ఈ ‘రొటీన్ కథాచట్రం’ నుంచి బయటికి రాలేకపోతున్నాయా..? ప్రేక్షకుడు ఇంకేవో కొత్త కథల్ని ఆశిస్తున్నాడా..? కొత్త ట్రీట్మెంట్ కోరుకుంటున్నాడా..? మరి టీవీల్లో బెటర్ రేటింగ్సే వచ్చాయి కదా… ఏమిటీ వైరుధ్యం..?
Ads
మరొక కోణం చూద్దాం… ఈ రేటింగ్స్ కాస్త బెటర్ అనిపించినా సరే, సగటు తెలుగు టీవీ సీరియల్ రేంజ్ మాత్రం దాటలేకపోయింది సినిమా రేటింగ్స్పరంగా… అదే కార్తీకదీపం, అదే గుప్పెడంత మనసు… అవే రేటింగ్స్‌లో టాపర్స్… పైన చార్ట్ చూడండి ఓసారి… నిజానికి టీవీ సీరియళ్లు ఏవీ లాజికల్ కథతో ఉండవ్.., పరమ భీకరమైన కథనం, మలుపులు, ద్వేషం, పరమ నాసిరకం… ఐనా వాటి పట్ల ప్రేక్షకుల్లో ఓ అడిక్షన్… ఏ సీరియల్, ఏ చానెల్ మినహాయింపు కాదు, ఒకడినిచూసి మరొకడు, అందరూ ఇలాంటి సీరియల్సే రుద్దుతున్నారు… ఈ స్థితిలో కొత్త సినిమాలకు, పెద్ద సినిమాలకు ఇంకాస్త బెటర్ రేటింగ్స్ ఆశించడంలో అనౌచిత్యం ఏమీ లేదు… ఏమో, అఖండ, పుష్ప సినిమాలకు వచ్చే రేటింగ్స్‌ను బట్టి కాస్త బెటర్ విశ్లేషణ చేసుకోవచ్చునేమో…!! చివరగా :: లవ్ స్టోరీ సినిమా స్టార్‌మాటీవీలో వచ్చింది కాబట్టి, దాని రీచ్ చాలా ఎక్కువ కాబట్టి, ఈ బెటర్ రేటింగ్స్ వచ్చినట్టున్నయ్, జీవాడో, జెమినివాడో వేసి ఉంటే రేటింగ్స్ బాగా తగ్గి ఉండేవి…!!
Share this Article