‘‘మేం ఈ స్థాయికి వచ్చామంటే..?’’ ఈ డైలాగ్ చాలాసార్లు టీవీల్లో, ప్రెస్మీట్లలో వింటూ ఉంటాం… స్థాయి అంటే..? ఈ ప్రశ్న పదే పదే మనల్ని తొలుస్తూ ఉంటుంది… ఒక టీవీ సీరియల్లో ఓ పాత్ర, ఓ టీవీలో ఓ యాంకర్, ఓ టీవీ షోలో ఓ పార్టిపిసెంట్… ఇలాంటివి కూడా గొప్ప విజయాలు అని పరిగణించాలా..? కావచ్చు, ఎందుకంటే, మన టీవీ షోలు వాళ్లను అలాగే ప్రొజెక్ట్ చేస్తాయి… జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే సోయి కూడా ఉండవు చానెళ్లకు… అవి ఆ చట్రాలు దాటి బయటికి వచ్చి ఆలోచించలేవు… భిన్నరంగాల్లో అద్భుత విజయాలు సాధించినవాళ్లు ఎలాగూ వాటికి కనిపించరు… వాళ్లను చానెళ్ల దాకా రప్పించి, జనానికి పరిచయం చేసేంత సీన్ వాటికి లేదు కాబట్టి..! ఏదో కిట్టీ పార్టీల్లా ఓ రియాలిటీ షో నడిపించేస్తే సరి, మన ప్రేక్షకులకు ఇదే ఎక్కువ అనుకుంటాయి… ఉదాహరణకు… జీతెలుగులో వచ్చే సూపర్ క్వీన్…
ఈ పార్టిసిపెంట్లు తక్కువ అని కాదు, కానీ వాళ్ల రేంజ్ దాటి జీతెలుగు కూడా ఎప్పుడూ ఎదగలేకపోతోంది… యాంకర్ ప్రదీప్ ఉంటే ఏవో నాలుగు స్పాటేనియస్ జోకులేస్తాడు, షో నడిచిపోతుంది… ఇదీ వాళ్ల ఆలోచన… నిజానికి జనం దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారా అనే డౌటుండేది… ఇప్పుడు క్లారిటీ వచ్చింది… గత వారం రేటింగ్స్ చూస్తే జస్ట్ 3.26 దీని రేటింగ్… (ఫాఫం, ప్రదీప్ ఈటీవీలో చేసే డాన్స్ ఢీ షో తప్ప ఇంకేమీ పెద్దగా క్లిక్ కావడం లేదు… సుమ రేంజ్ యాంకర్, మెరిట్ బోలెడు… కానీ ప్చ్…) ఇదే కాదు, జీతెలుగు, స్టార్‌మా చానెళ్లు ఆలోచిస్తున్న, అమలు చేస్తున్న చాలా రియాలిటీ షోలు ఫ్లాప్, ఫ్లాపున్నర… స్టార్ మ్యూజిక్ 3.53 మాత్రమే… ఇక కామెడీ స్టార్స్ అట్టర్ ఫ్లాప్… బోలెడంత హైప్ అనుభవించే ఓంకార్ స్వయంగా చేస్తున్న మాయాద్వీపం మరీ ఘోరం… 1.55… టీవీ రేటింగ్స్‌లో అది చాలా దారుణమైన రేంజ్…
Ads
మొత్తానికి జెమిని వాడు ఈ మాయ బంధనాల నుంచి తప్పించుకున్నాడు… ఇక రియాలిటీ షోలు నావల్ల కాదు అని చెప్పేసుకున్నాడు… ఉదాహరణలు తెలుసు కదా… జూనియర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’… ప్లస్ తమన్నా హోస్ట్ చేసిన మాస్టర్ చెఫ్… పైగా తమన్నా బదులు అనసూయను తీసుకుని, అదో పిచ్చి ప్రయోగం చేశారు… రెండూ ఫ్లాప్ అయిపోయి, అవి ఆగిపోయి, జెమిని వాళ్లు తలస్నానం చేశారు… ప్రస్తుతం ఆ టీవీలో రియాలిటీ షో అనేదే లేదు…
ఇప్పుడు చార్టులో నాన్-ఫిక్షన్, అనగా రియాలిటీ షోల కోణంలో చూస్తే, మాటీవీకి కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నయ్… కానీ బిగ్‌బాస్ ముగిసింది కదా… ఇక అదీ దిగజారిపోయినట్టే… జీతెలుగు ఈ కేటగిరీలో చాలా పూర్… వెరసి ఈటీవీదే ఈ కేటగిరీలో అగ్రస్థానం… అఫ్కోర్స్, ఆ జబర్దస్త్, న్యూస్ తీసేస్తే ఆ టీవీ కూడా తీసికట్టే… మూవీస్ విభాగంలో ఈటీవీ, జీతెలుగు వెరీ పూర్… వాళ్లకు కొత్త సినిమాలు కొని ప్రసారం చేయడం మీద అస్సలు టేస్టు లేదు, ఆ దూకుడు కూడా లేదు…
మిగతా కొన్ని అంశాలు పరిశీలిస్తే… లవ్ స్టోరీ సినిమా ఓమోస్తరుగా క్లిక్ అయినట్టే… జెమినిలో ప్రసారం చేసిన పాగల్ రేటింగ్స్ పర్లేదు… కానీ జీతెలుగులో ప్రసారమైన శ్రీదేవి సోడా సెంటర్ మరీ 3.50 రేటింగ్స్‌తో బాగా నిరాశపరిచింది… ఏం సుధీర్ బాబూ, ఇలా దెబ్బతినేసిందేటీ..? జనం ఇప్పటికీ, ఎంత దరిద్రంగా ఉన్నాసరే, ఆ సీరియళ్లు చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు… మాటీవీని టాప్ ప్లేసులో ఉంచుతున్నదీ అవే… ఈ కేటగిరీలో జెమిని గురించి చెప్పడానికి ఏమీలేదు… ఈటీవీకి కూడా పెద్ద స్కోప్ లేదు… వెరసి ఏతావాతా చెప్పేదేమిటయ్యా అంటే… జనాన్ని ఆకట్టుకునేలా రియాలిటీ షోలు ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు… ఓ సుమ, ఓ ఓంకార్ లేదా ఓ ప్రదీప్ ఉండగానే సరిపోదు అని…! అంతెందుకు, జనం జూనియర్ ఎన్టీయార్, తమన్నాలనే పట్టించుకోలేదు కదా…!!
Share this Article