అందరూ ఆడిపోసుకుంటారు గానీ… సల్మాన్ ఖాన్ కరుణామయుడు, సాహసి… కృష్ణజింకల్ని వేటాడతాడు, మనుషుల మీదకు కార్లను తొక్కించేస్తాడు అని ఇన్నేళ్లూ అనవసరంగా తనను నిందించారు, కేసులు పెట్టారు, వేధించారు, దుష్ప్రచారం చేశారు, తనను ఓ రాక్షసుడిగా, ఉన్మాదిగా చిత్రీకరించారు… కానీ అవేవీ నిజం కాదు… తను అత్యంత దయామయుడు… ఓ నిఖార్సయిన ఉదాహరణ కావాలా..? తన బర్త్‌డే వేడుకల కోసం పన్వెల్‌లోని తన ఫామ్ హౌజుకు నిన్న ఫ్యామిలీతో వెళ్లాడు… భూతదయ ఎక్కువ కదా, మాంసం గట్రా పెద్దగా ఇష్టపడడు… హఠాత్తుగా ఒక పాము ప్రవేశించింది ఇంట్లోకి… అనేకానేక జీవులు వస్తుంటయ్, పోతుంటయ్ కాబట్టి సల్మాన్ దాన్ని స్నేక్ ప్రూఫ్ కూడా చేయించలేదు… పామును చూడగానే ఫామ్ హౌజు సిబ్బంది భయపడిపోయారు, కేకలేశారు…
(ఇది సల్మాన్ ఖాన్‌ను కాటేశాక పాము ఇలా అయిపోయిందనే ఓ ఫన్నీ మీమ్)….
సల్మాన్ ఎవరినీ కంగారుపడొద్దని చెప్పి, పాము వైపే తదేకంగా చూస్తూ ఓ కర్ర తీసుకురమ్మని పురమాయించాడు… వాళ్లేమో మొదట ఓ చిన్న కర్రను పట్టుకొచ్చారు… ప్చ్, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంతకుముందు సల్మాన్ వాళ్లకు చెప్పి ఉండలేదు మరి… తరువాత కర్రతో పామును పైకి లేపాడు, దాన్నలాగే ఆప్యాయంగా బయటికి తీసుకెళ్లి వదిలేయాలి అనుకున్నాడు… కానీ అయ్యో, అయ్యో, అది రక్తపింజెర, విషం అని సిబ్బంది అరవసాగారు… ఆ అరుపులతో భయపడిన పాము వెంటనే తన సహజలక్షణంతో ఓసారి కాటు వేసింది… అయ్యో, అయ్యో, కాటేసింది అని మరింతగా అరుపులు, మరో కాటు వేసింది… దేవుడా, వెంటనే హాస్పిటల్ పోవాలి అంటూ మళ్లీ అరుపులు… పాము ఇంకో కాటు వేసింది… సల్మాన్ గతంలో వేటాడిన ఆ కృష్ణజింకే పాముగా పుట్టి, ఎన్నాళ్లుగానో కసితో ఆ చుట్టుపక్కలే తిరుగుతోంది, అందుకే దొరకగానే మూడుసార్లు కాటేసింది అని చాలామంది మీమ్స్, పోస్టులు పెట్టారు కానీ… అబద్ధం…
https://twitter.com/news24tvchannel/status/1475310957249265669?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1475310957249265669%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.opindia.com%2F2021%2F12%2Fsalman-khan-narrates-how-snake-bit-him-at-farmhouse%2F
Ads
దాన్నక్కడే కింద పడేసి, హాస్పిటల్ వెళ్లాడు… అన్నిరకాల పాముల విషానికీ విరుగుడుగా పనిచేసే ఓ యాంటీ వీనమ్ సూడి పొడిచారు… ఈలోపు లోకం బెంబేలెత్తిపోయింది… పోలీస్ కమిషనర్, లోకల్ ఎమ్మెల్యే పరుగుపరుగున వచ్చేశారు… అక్కడికీ తనకేమీ కాదని సల్మాన్ చెబుతున్నా సరే ఆ డాక్టర్లు వినలేదు, అయిదారు గంటలు అబ్జర్వేషన్లో పెట్టుకుని, సల్మాన్‌కు ఇలాంటి విషాలు ఏవీ ఎక్కవు అని తేల్చేసుకుని, ఇక వెళ్లండి సార్ అన్నారు… తనకు కూడా లోలోపల ఆందోళనగా ఉంది, అయ్యో పాపం, ఆ పామును మావాళ్లు ఏం చేశారో అని… వెంటనే మళ్లీ ఫామ్ హౌజుకు వెళ్లాడు హుటాహుటిన… తను వెళ్లేటప్పటికీ పాము అక్కడే ఉంది… మళ్లీ చాన్స్ దొరుకుతుందేమో, వదలొద్దు అనుకుందేమో అంటారా..? నో, సల్మాన్ భూతదయ తీరుకు దిగ్భ్రాంతికి గురై అక్కడే ఉండిపోయింది… సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము ఇదే,..
జాగ్రత్తగా ఆ పామును పట్టుకుని, సజీవంగా బయట వదిలేశారు… చూశారా, టైగర్ జిందా హై, సాంప్ బీ జిందా హై… నన్నే కాటేస్తావా అని కక్ష తీర్చుకునే ప్రయత్నమే చేయలేదు పాపం, పాముకు కాటేయడం సహజలక్షణం కదా, భయంతో అలా వ్యవహరించింది అంటున్నాడు సల్మాన్… కళ్లు చెమరుస్తున్నాయి కదా… ఎలా ఓ దయామయుడిని పట్టుకుని ఇన్నేళ్లూ ఎంత విలన్‌గా ఈ దుర్మార్గలోకం చిత్రీకరించింది తనను… అవునండీ, అవును… ఈ పాపిష్టి లోకం ఎవరిని సరిగ్గా అర్థం చేసుకుంది గనుక…!! సల్మాన్ వంటి భూతదయామయుల్ని అయితే (భూత అంటే ఇక్కడ నెగెటివ్ మీనింగులో తీసుకోకూడదండోయ్…) అస్సలు అర్థం చేసుకోదు…!! అసలు విషపు పాములు ఈ లోకులేనండీ…!!
Share this Article