Srini Journalist……….. సందు దొరికితే చాలు ఒకటే రాళ్లు విసరడం, తరువాత బోర్లా పడటం.. పశ్చిమ బెంగాల్ దీదీకి ఎవడో చెవిలో ఊదాడట… మదర్ థెరిసా ట్రస్ట్ కి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ని మోదీ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది అని. ఇక మన మేడం ఆగదు కదా.. ‘ క్రిస్మస్ రోజున ట్రస్ట్ కు చెందిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ ని కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసింది, దీనితో 22 వేల మంది పిల్లలు ఉద్యోగులు పస్తులు ఉంటున్నారు. మెడిసిన్స్ కూడా లేవు. చట్టం ఉన్నతమైందే కానీ మానవత్వం మరవొద్దు’ మమత బెనర్జీ ఈ మాటలు వింటే మోదీ పైన ఎవరికైనా రక్తం మరగదా? ఇంత కక్ష పూరితంగా ఉంటారా అంటూ… అదే జరిగింది. కానీ కేంద్రం వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ‘ఏ అకౌంట్ ని కూడా మేము ఫ్రీజ్ చేయలేదు. మదర్ తెరీసా ట్రస్టే SBI కి ఉత్తరం రాసి, అకౌంట్ ను ఆపరేట్ చేయొద్దు అని కోరింది’ అని…
అంతెందుకు, మదర్ తెరెసా ట్రస్ట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అవును నిజమే, మా అకౌంట్స్ ని ఎవరూ ఫ్రీజ్ చేయలేదు. విదేశాల నుంచి విరాళాలు అందుకునే బ్యాంక్ ఖాతాలను మాత్రమే ఆపరేట్ చేయొద్దు అని తెలిపాము’ అని. సోషల్ మీడియాలో దేభ్యం మొహాలు చాలా ఉన్నాయి తప్పుడు ప్రచారాలు చేసి సమాజంలో అశాంతిని క్రియేట్ చేసేవి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మమతాకి ఏమొచ్చింది ఇంత దరిద్రమైన అబద్ధం చెప్పడానికి..? అంతెందుకు, ఆ ట్రస్ట్ ప్రధాన కార్యలయం కోల్‌కతాలోనే ఉంది కదా. ఒక ఫోన్ కాల్ తో నిజం తెలుస్తుంది కూడా… అబ్బే, అలాంటి పని చేయకుండా పని కట్టుకొని తప్పుడు సమాచారం ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇదే పని ఎవరైనా చేస్తే సెక్షన్ 505 కింద బొక్కలో తోయరా?
మదర్ తెరెసా మిషనరీ ఆఫ్ చారిటీకి ఫారిన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ రెగ్యులేటరీ ఆక్ట్ (FCRA) కింద విదేశీ నిధులు అందుకోవడానికి లైసెన్స్ ని రెన్యూవల్ చేసుకోమంది ప్రభుత్వం. ఈ ఏడాది అక్టోబర్ 31కే ట్రస్ట్ లైసెన్స్ గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఈ గడువు పొడిగించింది. కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయమని అడిగింది. అంతలోనే ఏమైందో తెలియదు కానీ ట్రస్ట్ ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వలేదు సరికదా, ఆ ట్రస్టే బ్యాంక్ కి ఉత్తరం రాసింది, విదేశాల నుంచి డొనేషన్ లు అందుకునే బ్యాంక్ ఖాతాలను కొన్ని రోజులు ఆపరేట్ చేయొద్దు అని.
ఇక కుహనా మేధావులు మళ్ళీ మొదలు పెట్టారు ఈ వార్తను అడ్డం పెట్టి, క్రైస్తవులపై దాడుల చరిత్ర అంతా ఏకరువు పెడుతున్నారు… మత మార్పిడి అంశాన్ని ఎగదోస్తున్నారు. సరే, ఒక క్షణానికి అవి నిజమే అనుకుందాం. కానీ మదర్ తెరెసా ట్రస్ట్ కి క్రిస్టియానిటీకి ఏం సంబంధం? ఆ ట్రస్ట్ మతపరంగా కాకుండా కేవలం పేదలకు సహాయం అందించే సంస్థ కదా? అలా అని ఈ మేధావులే కదా టన్నుల కొద్దీ వ్యాసాలు రాసింది. మరి క్రైస్తవుల ప్రస్తావన ఎందుకు వస్తోంది ఇక్కడ? మదర్ సంస్థకు మత మార్పిడికి ఏం సంబంధం? అయినా విదేశీ డొనేషన్ లేకుంటే ఒక్క రోజు కూడా ఆ ట్రస్ట్ నడవదా? 22 వేల మంది ఆకలి చావుల ముంగిట ఉంటారా? పదుల సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా ఈ దేశం నుంచి విరాళం ఇవ్వలేదా? మేధావులు అనుకున్నాం, ప్రగతిశీలురు అనుకున్నాం. కానీ నిలువెల్లా విషం ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం…
Share this Article
Ads