ఇప్పటికే ఓమిక్రాన్ విస్తరించింది అనిపించినా, గణాంకాల ప్రకారం చూస్తే … 1 . ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది . 2 . తెలంగాణలో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది . ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు రెట్టింపు అవుతూ , జనవరి చివరికల్లా లక్షల్లోకి చేరవచ్చు . ఓమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది . ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే .. 1 . ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్ . 2 . ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్ రోగులకు కేవలం విటమిన్ మాత్రలు అంటే బి , సి , డి విటమిన్ మాత్రలు మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు .
౩. జలుబు , గొంతులో గరగర , కొద్దిపాటి ఒంటి నలత దీని లక్షణాలు . కొంతమందికి ఒకటి రెండు రోజులు జ్వరం ఉండవచ్చు . రెండు మూడు రోజుల పాటు వేడి నీళ్లు తాగడం , గొంతులో గరగర ఆంటే సోర్ త్రోట్ తగ్గించడం కోసం వేడి నీళ్లలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని తల పైకెత్తి గార్గిల్ చేయడం , వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగడం , లేదా అల్లం పసుపు కొద్దిపాటి సుగంధ ద్రవ్యాలతో చేసిన కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు టీ లాగా తాగడం చెయ్యాలి . సాధారణంగా లక్షణాలు రెండు రోజుల్లో తగ్గిపోతాయి . జ్వరం ఉంటే డోలో 650 ఒకటి రెండు రోజులు వాడొచ్చు . తగ్గని పక్షంలో డాక్టర్ ను సంప్రదించవచ్చు . ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు . ఆక్సిజన్ అవసరం ఏర్పడదు . రుచి వాసన పోదు .
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది జలుబు లాంటిది . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి . ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు . దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం ఓమిక్రాన్ సోకినవారు ఇంట్లోనే ఉండాలి అనే రూల్ తీసేసింది . సోకినా బయటకు వెళ్లొచ్చు . అందరికీ టెస్ట్ లు చేయడం, ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే అతని కుటుంబ సబ్యులకు కూడా టెస్ట్ లు చేయడం లాంటివి అవసరం లేదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది . ఇక్కడ మన ప్రభుత్వాలు ఎలాంటి నియమాలను తెస్తాయో చూడాలి . భాద్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వ నియమాలను పాటిద్దాము . ఇలాంటివి మార్చ్ తరువాత ఇక ఉండవు.
Ads
వేవ్ అనొచ్చా ?
కేసులు పెరగడాన్నే వేవ్ అని చెప్పాలి అంటే వేవ్ అనుకోవచ్చు . కేసులైతే రోజుకు లక్షల్లో ఉంటాయి . కానీ ఆసుపత్రికి వెళ్ళడాలు, అంబులెన్సు లు ఇలాంటివి కనబడవు . టెస్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు . చేసుకోకపోయినా నష్టం లేదు . రెండు మూడు రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి . ఓమిక్రాన్ వేవ్ చాలా ఉదృతంగా ఉంటుంది . అంటే కేసుల సంఖ్య బట్టి ఉదృతం . అంతే కానీ డేంజర్ కాదు . ఓమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం ఉండదు . కేసులు పెరుగుతున్నప్పుడు భయపెట్టే ప్రచారానికి దూరంగా ఉండాలి . భయం పెరిగితే స్ట్రెస్ వస్తుంది . అది గుండెపోటుకు దారి తీయొచ్చు .
ఓమిక్రాన్ కరోనా యొక్క శాంత స్వరూపం . ఓమిక్రాన్ దేవుడు లేదా ప్రకృతి ఇచ్చిన అద్భుత వాక్సిన్ . ప్రాణాలు తీయదు. పైగా ఆంటీ బాడీలు, టి సెల్స్ రక్షణనిస్తుంది . అంటే కరోనా వేవ్ కు ఇది చివరి దశ . ఫిబ్రవరికల్లా ఓమిక్రాన్ వేవ్ ముగుస్తుంది . మార్చ్ నుండి ఇక మన జీవితంలో లాక్ డౌన్ లు, కట్టడి లాంటివి ఏమీ వుండవు . 2020 లో ప్రారంభం అయిన { చైనా లో 2019 లోనే } కోవిద్ ముగింపు దశలో మనం ఉన్నాము. అంటే ఇది కరోనా పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు మారే సందర్భం . పండెమిక్ అంటే వ్యాధి వేగంగా విస్తరిస్తూ ప్రాణహాని కలిగించే దశ . ఎండెమిక్ అంటే ప్రాణాలు హరించదు. మన చుట్టూరా ఎప్పటికీ ఉంటుంది .
మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు కాలంలో, ఆంటే 1918 లో స్పానిష్ ఫ్లూ మొదలయ్యింది . ఆ పాండెమిక్ లో అనేక మంది చనిపోయారు . కానీ రెండేళ్లకు అది ఎండెమిక్ గా మారిపోయింది . ఆ వైరస్ పోలేదు . H1N1 ఇన్ఫ్లుఎంజా- A వైరస్ ఇంకా మన చుట్టూరా వుంది . అది జలుబు కలుగ చేస్తుంది . మనం ఇన్నాళ్లు, అంటే కరోనా రాక ముందు జలుబుకు భయపడ్డామా ? లేదు కదా . ఇప్పుడు కరోనా కూడా అలాగే అయిపొయింది . ఓమిక్రాన్ ఇక ఎప్పటికీ పోదు . మనకు సోకుతూనే ఉంటుంది . సోకినా భయపడాల్సింది ఏమీ లేదు .
జనవరి ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు రావొచ్చు . ఆ నంబర్స్ చూసి భయపడొద్దు .
లక్షలాది ఓమిక్రాన్ కేసులు ఉన్నా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పాఠశాలలు, కళాశాలలు నడుస్తూనే వున్నాయి . కానీ మన దేశంలో పరిస్థితి వేరు . ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు మూసెయ్యాలని ఆదేశం జారీ చేసింది . దీని దారిలో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నడవొచ్చు . ఏదైనా ప్రభుత్వం ధైర్యంగా విద్యా సంస్థలను నడపాలి అని భావిస్తే వాటిపై ఒత్తిడి పెరుగుతుంది . పాఠశాలలు , కళాశాలలు క్లోజ్ చేసే దాకా ఊరుకోరు . ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి .
సంక్రాంతి సెలవుల తరువాత కొన్ని రోజులు కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం . తెలంగాణలో సంక్రాంతి తరువాత కొద్ది రోజుల పాటు విద్యాసంస్థలు మూసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది . ఆ ప్రభుత్వం విద్యా సంస్థలను నడపాలి అని పట్టుదలతో వ్యవహరించడం వల్ల మొదటి రెండు వేవ్ ల మధ్య సుమారుగా నాలుగు నెలలు ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా సంస్థలు నడిచాయి . మన దేశంలో ఇలా బోల్డ్ గా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం ఏపీ. దాని వల్లే ఆంధ్ర ప్రదేశ్ పిల్లలపై కోవిద్ ప్రభావం తక్కువ . ఢిల్లీ లాంటి రాష్ట్రాలు సుమారుగా రెండుళ్లుగా బడులని మూసేసాయి . దీని వల్ల పిల్లలకు అపార నష్టం జరిగింది .
ఏది ఏమైనా మార్చ్ కి తిరిగి బడులు తెరుచుకొంటాయి . పరీక్షలు రద్దు అయిపోతాయి అనే మూడ్ లో పిల్లలు వున్నారు . ఈసారి పదవ తరగతి , ఇంటర్ లాంటి పరీక్షలు తప్పక జరుగుతాయి . పిలల్లకు చెప్పండి . చదువు గాడి తప్పితే తీవ్ర నష్టం . మిగతా క్లాసులకు కూడా పరీక్షలు జరుగుతాయి . ఓమిక్రాన్ వేవ్ ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతుంది . మార్చ్ తరువాత ఇక పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు . 2022 అందరి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది . కేసులు , కట్టడి లాంటి మాటలు మార్చ్ తరువాత మనకు వినబడవు . అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరంలో మీకు అన్నీ శుభాలే జరగాలి . జరుగుతాయి .
— వాసిరెడ్డి అమర్నాథ్ . (విద్యావేత్త . మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు { ప్రపంచ వ్యాప్తంగా ఆదిమ సమాజాలు మొదలుకొని ఆధునిక సమాజాల దాక వ్యాధి , జబ్బు భావనలను సంపూర్ణంగా అధ్యయనం చేసేదే వైద్య మానవ శాస్త్రం . }
Share this Article