మోహన్‌లాల్… ఓ గుండు, బవిరిగడ్డం… పురాతనకాలం నాటి వస్త్రధారణ… అదోరకం లుక్కుతో తన కొత్త సినిమా బరోజ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు… ఎంత సూపర్ స్టార్లు అయినాసరే మలయాళ హీరోలు కొత్త వేషాలకు, ప్రయోగాలకు సై అంటారు… కథ హీరోయిజాన్ని ప్రమోట్ చేయాలే తప్ప కావాలని హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లను ప్రేక్షకులకు రుద్దరు… కథ ఎంతమేరకు పర్మిట్ చేస్తే అంతే బడ్జెట్… నేలవిడిచి సాము ఉండదు, మన తెలుగు హీరోల్లా సుప్రీం, సూపర్ నేచురల్, ఓవర్ హీరోయిజాన్ని ఉద్దేశపూర్వకంగా జొప్పించరు… మనం దృశ్యం సినిమా చూశాం కదా… అవసరమైతే పరభాషల్లో నాన్-హీరో పాత్రలకూ సై… జనతా గ్యారేజీ చూశాం కదా… మనమంతా అనే ఓ చిన్న సినిమాలో చిన్న పాత్ర… లూసిఫర్ సినిమాలో కూడా ఓ హీరోయేతర పాత్రే అనిపిస్తుంది… మొన్నటి మరక్కర్ భారీ బడ్జెట్ సినిమా, ఇప్పుడిక బరోజ్… ఓ ఫాంటసీ…
తను నిర్మాత, నటుడు, స్టంట్స్ కొరియోగ్రాఫర్, ప్లే బ్యాక్ సింగర్, మూడుసార్లు బిగ్‌బాస్ హోస్ట్, డిస్ట్రిబ్యూటర్… బరోజ్ సినిమాతో ఇక దర్శకుడు… నిజానికి ఇది కొత్త సినిమా ఏమీ కాదు… అప్పుడెప్పుడో మార్చిలోనే స్టార్ట్ చేశారు… కథ కోసం పలువురు విదేశీ నటుల్ని (సేమ్ మరక్కర్) కూడా ఎంచుకున్నారు… పలుచోట్ల కొంత షూటింగ్ కూడా జరిగింది… అప్పట్లో ఓ ట్రెయిలర్ కూడా రిలీజ్ చేశారు.. కొచ్చి, డెహ్రాడూన్, గోవాలతోపాటు పోర్చుగల్, గినియాల్లో కూడా షూట్ చేయాలని ప్లాన్… కథ ప్రకారం పోర్చుగల్, స్పెయిన్, ఆఫ్రికా, ఇండియా సముద్రయానాల గత చరిత్ర ఆవిష్కరించాలి…
Ads
https://www.youtube.com/watch?v=cJAj7eeaYrk
మొన్నటి డిసెంబరులో కూడా ఓ చిన్న టీజర్ వదిలారు… బరోజ్, ఓ నిధి రక్షకుడు… అంటేనే అర్థమైంది కదా కథ ఏమిటో… సేమ్, మరక్కర్ కథలాగే సముద్రాలు, ఓడలు, నిధి కోసం వేట… నిజానికి మొదట్లో త్రీడీలో తీద్దామనేదే ప్లాన్… తరువాత ఎందుకో చాలా గ్యాప్ వచ్చేసింది… ఇప్పుడు తాజాగా మళ్లీ కదలిక… మొదట్లో టీజర్ వదిలాక నెలరోజులకే మరో టీజర్ వదిలారు…
గత ఏప్రిల్‌లో రిలీజ్ చేసిన టీజర్‌లో కొన్ని షాట్స్ అద్భుతంగా కనిపిస్తున్నయ్… రాజమౌళి తాతలు కనిపిస్తున్నారు… ఫైనల్ ఔట్‌పుట్ ఎలా వస్తుందో చెప్పలేం గానీ… సినిమా పట్ల ఓ ప్యాషన్ కనిపిస్తోంది… రెండేళ్ల క్రితం నుంచీ నలుగుతున్న ప్రాజెక్ట్ ఇది… 2019 ఏప్రిల్‌లోనే మోహన్‌లాల్ తను మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నానని, సినిమా పేరు అనౌన్స్ చేశాడు…
ఈ సినిమా మాత్రమే కాదు… 61 ఏళ్ల వయస్సులో కూడా ఇప్పుడు మలయాళంలో సుప్రీంస్టార్ తను… తన చేతిలో దీంతోపాటు ఆరాత్తు, బ్రోడాడీ, రామ్, 12th Man, అలోన్, మాన్‌స్టర్, వచ్చే ఏడాదికి సంబంధించిన ఎంపురాన్ వంటి ఎన్నో ప్రాజెక్టులు… నలభై ఏళ్లుగా మోహన్‌లాల్ నడిచే మాలీవుడ్ చరిత్ర…
Share this Article