సాధారణంగా ఈటీవీ జబర్దస్త్ అంటేనే బూతు… ఆ షో కేరక్టరే అది… కామెడీ పేరిట కాస్త డర్టీనెస్ దట్టించి వదులుతుంటారు… వాటిల్లో జోకులు వినీ వినీ యాంకర్లకు, జడ్జిలకు కూడా ఇమ్యూనిటీ వచ్చేసింది ఎప్పుడో… సో, అలాంటి చెణుకులు, డైలాగులు వినీ విననట్టుగా విని, తమ పేమెంట్స్ దృష్టిలో పెట్టుకుని, పకపకా నవ్వేస్తారు… డ్యూటీ మరి…! అంతగా ఇమ్యూనిటీ వచ్చేసిన రోజా కూడా సుడిగాలి సుధీర్ వదిలిన ఓ డైలాగ్ విని సిగ్గుతో తలదించుకుని, తలపట్టుకుంది… మనో మాత్రం ఇలాంటి సున్నితమైన ఉద్వేగాలు తనకేమీ అంటవు అన్నట్టుగా హహహ అని నవ్వేశాడు… నవ్వితేనే కొనసాగుతాడు, కొనసాగితేనే డబ్బులు కదా మరి… నవ్వకపోతే మరో జడ్జి వచ్చి కూర్చుంటాడు ఆ కుర్చీలో…
తాజాగా ఈటీవీ, మల్లెమాల వదిలిన ప్రోమో… వచ్చే ఆరో తారీఖున ప్రసారం కాబోయే ఎపిసోడ్ అది… అందులో ఆచార్య సినిమా సీన్‌కు ఓ పేరడీ చేయబోయారు… ఓ ప్రవాహం వద్ద ఓ పులి చూస్తూ ఉంటుంది, మరో పులి నీళ్లు తాగుతూ ఉంటుంది… సినిమాలో చిరంజీవి, రాంచరణ్ ఉన్న సీన్ అన్నమాట… నిజానికి జబర్దస్త్ ఆ కామెడీ స్కిట్లో అది అనవసరంగా ఇరికించినట్టుగా ఉంది… ఆ స్కిట్ కంటెంట్‌కు అది సూట్ కాలేదు… సరే, సుధీర్ అటు వైపు పోదాం పద అంటాడు…
హైపర్ ఆది ‘వద్దురా, అటు వైపు మనుషుల్ని పీక్కుతీనేవాళ్లున్నారు… అందరూ ఆకులు కట్టుకుని తిరుగుతుంటారట’ అంటాడు… దానికి సుధీర్ ‘అయితే వెళ్దాం పదరా, ఫస్టయితే ఆ ఆకులు తినేద్దాం’ అంటూ ‘‘మహా కరువులో’’ ఉన్నవాడిలా డైలాగ్ విసురుతాడు… ఆ తరువాత డ్యాష్ డ్యాష్… అక్కడ చెప్పకుండానే ఏ డైలాగ్ పడాలో ప్రేక్షకుడే ఊహించుకోవాలి… ఆది సుధీర్‌ను కొట్టేస్తాడు నవ్వుతూ… అలాగే ‘వచ్చే జన్మంటూ ఉంటే చెదపురుగులా పుట్టాలని ఉందిరా’ అంటాడు సుధీర్… ఆ ఆకులు ఎప్పుడూ తింటూ ఉండటానికి అన్నమాట… (ఇన్‌డైరెక్ట్ మీనింగ్ అర్థమైంది కదా)… దీనికి అనసూయ పడీ పడీ నవ్విపోయింది, ఆ డైలాగ్ తనే ఊహించి చెప్పేసింది కూడా…
Ads
నిజానికి సుధీర్ చాన్నాళ్లుగా ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్… ఏ షో అయినా సరే, ప్లేబాయ్ కేరక్టర్ అన్నమాట… కానీ సరదాగా ఎంజాయ్ చేసేలాగే ఉంటయ్ తన చుట్టూ అల్లబడే సీన్లు, రాయబడే డైలాగులు… అంటే వెగటు స్థాయికి పోకుండా జాగ్రత్తపడుతుంటారు… కాకపోతే ఇదుగో కొన్నిసార్లు ఇలా శృతి తప్పుతయ్… ఇక్కడ ఓ ప్రశ్న… రోజా కూడా తలపట్టుకుందంటే ఆ డైలాగ్ గలీజ్నెస్ అర్థమవుతోంది కదా… మరి అది ప్రోమోలో ఎలా ఉండిపోయింది, రేప్పొద్దున ప్రసారం ఎందుకు కావాలి..? ఎందుకంటే..? ఆ షో కేరక్టరే అది కాబట్టి… వాళ్లకు కావల్సిన స్కిట్ క్వాలిటీ కూడా అదే కాబట్టి..!!
Share this Article