మొన్న రెండుమూడురోజులపాటు సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ న్యూస్‌సైట్లలో ఓ పోస్ట్ బాగా సర్క్యులేటైంది… ఇండియాలో తయారైన వేక్సిన్ల పాత నిల్వల షెల్ఫ్ లైఫ్ పెంచేశారని, వాటిని పిల్లలకు వేస్తున్నారనీ ఆ పోస్ట్ సారాంశం… నో, నో, ఇదంతా మిస్‌లీడింగ్, ఫాల్స్ అని కేంద్ర ప్రభుత్వం అర్జెంటుగా ఖండించింది… నిజానికి షెల్ఫ్ లైఫ్ పెంచిన మాట నిజం… కాకపోతే రెండు నెలల క్రితమే పెంచేశారు… అలా ఎందుకు పెంచారయ్యా అంటే, పెంచవచ్చు, ప్రమాదం ఏమీలేదు అని ఆయా కంపెనీలే సమగ్ర నివేదికలు ఇచ్చాయట, వీళ్లు పెంచేశారట… రేట్లూ వాళ్లే పెట్టేసుకుని, రిపోర్టులూ వాళ్లే ఇచ్చేసుకుని, రోజుకో అబద్ధం వాళ్లే చెబుతుంటే ప్రభుత్వం ఏం చేయాలి..? ఏమీ చేయదు… అసలు వేక్సిన్ల మీద ఎవరు మాట్లాడినా ఏదో జాతిద్రోహం చేస్తున్నవాళ్లలాగా చూస్తోంది…
రెండు డోసులతో టీసెల్స్ రక్షణ లభిస్తుందని చెప్పింది వాళ్లే గదా… మంచినీళ్ల సీసా ధరకు అందిస్తామని చెప్పింది వాళ్లే గదా… మళ్లీ ఇప్పుడు బూస్టర్ డోసులు మస్ట్, వీలయితే ఆరునెలలకు ఓ బూస్టర్ వేసుకోవాలి అనే దిశగా ప్రచారాన్ని తీసుకుపోతున్నదెవరు..? ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న మోల్నుపిరవిర్ ధరల్ని కూడా ఆయా కంపెనీలే ఖరారు చేసుకుంటున్నయ్… అసలు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ పాలసీ ఎత్తేశారా దేశంలో..? అది సరే, పిల్లలకు వేక్సినేషన్ అవసరమా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నయ్… కానీ ఎంతసేపూ మీడియా, ఫార్మా కంపెనీలు, హాస్పిటళ్లు ‘‘భయాన్ని పెంచి,.. కొత్త కొత్త వేరియెంట్లను అర్జెంటుగా సృష్టించి’’… బూస్టర్ డోసుల్లేకపోతే చస్తార్రోయ్ అన్నట్టుగా వాతావరణాన్ని రూపొందిస్తున్నారు…
గతంలో ప్రజల మీద కన్సర్న్ ఉన్న మేధావులు, గ్రూపులు కొంత వర్క్ చేసేవి, వాటి పరిశీలనల్ని ప్రజల్లోకి వదిలేవి… చర్చ జరిగితే తప్పేముంది..? ప్రజల ప్రాణాలను పూర్తిగా ఫార్మాసురుల కత్తులకు అప్పగించలేం కదా… వోకే, నిజంగానే ఇకపై రెగ్యులర్‌గా డోసులు తీసుకోకతప్పదు అని తేలితే, తీసుకుందాం… మన తెలుగు మీడియాను తీసుకుంటే ‘‘భయాన్ని మార్కెటింగ్’’ చేయడం తప్ప మరోపని లేదు… వాటికి అంతకుమించిన సోయి, బుర్ర కూడా లేదు… బంధువు కాబట్టి భారత్ బయోటెక్ వాడి కోసం ఈనాడు గుడ్డి కథనాలు రాస్తే, దానికో అర్థం ఉందనుకుందాం… అదెప్పుడూ అంతే కాబట్టి… మరి మిగతా పత్రికల బుర్రలు ఏ కోల్డ్ స్టోరేజీలో పెట్టబడ్డయ్… ఆంధ్రజ్యోతి నయం…
Ads
నిన్న డాక్టర్స్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ డాక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి, వేక్సిన్లు వేసేముందు పిల్లలకు యాంటీ బాడీ పరీక్షలు నిర్వర్తించాలని, నిజానికి పిల్లల్లో రోగనిరోధకశక్తి ఎక్కువ కాబట్టి, ఈ వేక్సిన్లలో యాంటీబాడీలు ఎక్కువైనా నష్టమేనని వెల్లడించారు… అసలు కరోనా వేక్సిన్ల ఇంగ్రెడియెంట్స్ కూడా బహిర్గతం చేయడం లేదు, ఇతర టీకాలతో పోలిస్తే ఈ వేక్సిన్ల దుష్ప్రభావాలు అధికం… వేక్సిన్ల వల్ల స్పైక్ ప్రొటీన్ విపరీతంగా విడుదల అవుతోందని చెప్పారు… వీటికి వేక్సిన్ల కంపెనీల నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఏ వివరణ లేదు… ఎంతసేపూ అదుగో థర్డ్ వేవ్ వచ్చె, వచ్చె అనే ప్రచారం తప్ప… నిజానికి ఎక్కువ డోసులతో మనిషిలోని సహజ రోగనిరోధక వ్యవస్థ పనిచేయడం మానేసి, ఇక పూర్తిగా వేక్సిన్ల మీద ఆధారపడే సిట్యుయేషన్ వస్తుందనే ఆందోళన కూడా ఉంది… వేక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ మీద కన్సర్న్‌డ్ గ్రూపుల నుంచి ఆల్టర్నేట్ పరిశోధనలు కూడా ఏమీలేవు…
ఈరోజు మరో నిపుణుడి ఇంటర్వ్యూ పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి… బూస్టర్ డోసుల వల్ల ఇజ్రాయిల్ వంటి దేశాల్లోనే పెద్ద ఉపయోగం కనిపించలేదని కుండబద్ధలు కొట్టేశాడు ఆయన… కాకపోతే థర్డ్ వేవ్ మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు… రీజనబుల్ వాదన… చిన్నారులకు టీకాలు అవసరం లేదంటున్నాడు ఈయన కూడా… మాస్కులు, జనం గుమిగూడకుండా ఆంక్షలు అవసరం అంటాడు… రాజకీయ సభలు, ఊరేగింపులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లతోనే ఎక్కువ ప్రమాదం… కానీ వినేవారెవ్వరు..? వద్దనేవారెవ్వరు..? పైగా మన మీడియా అదుగదుగో ఫ్రాన్స్‌లో మరో వేరియెంట్ అని ప్రచారం మొదలుపెట్టింది… రోజుకో కొత్త వైరస్‌ను పుట్టిస్తూ భయపెడుతూనే ఉంది… వైరస్ వందల మ్యుటేషన్లకు గురవుతూ ఉంటుంది… ఒక మ్యుటేషన్‌కు మరో వేరియెంట్, ప్రమాదకరం అని అచ్చేసే ముద్రారాక్షసులు కూడా సొసైటీకి ప్రమాదకరమే… కాదు… వీళ్లే ఎక్కువ ప్రమాదకరం…!! అవునూ, ఓ అమాయకపు ప్రశ్న… రకరకాల సీరం సర్వేల్లో 80, 90 శాతం మందికి ఆల్‌రెడీ కోవిడ్ వచ్చిపోయినట్టే అని చెబుతున్నారు కదా, టీసెల్స్ రక్షణ సమకూరి ఉండాలి కదా… మరి బూస్టర్‌తో ఉపయోగం ఏమిటి సార్..?!
Share this Article