Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జ్యోతే అనుకుంటే ఈనాడు దాని తాత… నమస్తే ఈనాడుకే దగ్గులు నేర్పే ముత్తాత…

January 5, 2022 by M S R

రాజకీయ పార్టీలు అంటేనే నోటికొచ్చినట్టు ఏదో కూస్తాయి… ఆ పార్టీల కొమ్ముకాసే పత్రికలు అవే రెచ్చిపోయి రాస్తాయి… మన దేశమే కాదు, మొత్తం ప్రపంచమంగా మీడియా అంటేనే అంత..! ఆఫ్టరాల్ తెలుగు పత్రికలదేముంది..? ఎలాగూ ప్రతి పత్రిక పాలకుడు లేదా తమ పోషకుడి పాదతీర్థ సేవనమే కదా… మళ్లీ అందులో కులగజ్జి గట్రా అదనం… కానీ కనీసం ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఒకటికి నాలుగుసార్లు చూసుకోవడం అవసరం కదా… జనం దేనితోపడితే దానితో నవ్వుతారనే సోయి కూడా అవసరం కదా…

జాతీయ రాజకీయాల్లో చక్రాలు గిరగిరా తిప్పిన ‘అఖండ’ చంద్రబాబు, జాతీయ స్థాయిలో టాప్ టెన్ పత్రికల్లో ఒకటైన ఈనాడు అక్రమ సంబంధాలు అందరికీ తెలిసినవే… కానీ చంద్రబాబు ఆర్ తెలుగుదేశం ఏది చెబితే అది కళ్లుమూసుకుని అచ్చేయడమేనా..? కనీసం తమ పాఠకులు నవ్వుతారనే స్పృహ కూడా ఉండదా..? ఒక ఉదాహరణ చూస్తే నిండా రంగుపూసుకుని ఎగిరే ఆంధ్రజ్యోతే కాస్త నయం అనిపిస్తుంది… జనం నవ్వుతారనే సందేహం ఉన్నచోట పబ్లిష్ చేయకుండా తమాయించుకుంటోంది… ఈనాడుకు ఆ తెలివి కూడా లేదు…

eenadu

Ads

పైన రెండు క్లిప్పింగులను కాస్త జూమ్ చేసుకుని, జాగ్రత్తగా పరిశీలించండి… రెండూ ఈనాడులో వచ్చినవే… రెండూ తెలుగుదేశం విడుదల చేసిన వివరాలే… చంద్రబాబు కాలంలో ఏపీ స్వర్గం అనిపించుకునేది, జనానికి డబ్బు ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా తెలియకపోయేది, అంత చీప్ ధరలు, కానీ ఈ దుర్మార్గుడు జగన్‌రెడ్డి వచ్చాక మొత్తం అరాచకం, అడ్డగోలుగా రేట్లు అగ్గి మండుతున్నాయి అని చెప్పడం ఈ వివరాల ప్రచురణలో అసలు ఉద్దేశం… రెండు రోజుల్లోనూ ఒకే రేట్లు ఇస్తే సరిపోయేది కదా… వాళ్ల ఇష్టం… ప్రజల ఖర్మ… ఈనాడు బుర్రరాహిత్యం, పాఠకుల ఖర్మ… పెసరపప్పు ధర ఏపీలో నిన్న 144, ఈరోజు 110… కందిపప్పు మాత్రం నిన్న 147, ఈరోజు 118… జస్ట్, అలా చంద్రబాబు ఫైర్ అయిపోయేసరికి, ఎక్కడ తన కుర్చీ కూలిపోతుందోనని భయపడిపోయి, ఢిల్లీలో బిజీగా ఉండి కూడా జగన్ అర్జెంటుగా ధరలు తగ్గించాడా..?

కానీ చింతపండు మాత్రం 275 నుంచి 354కు పెరిగిపోయిందట… వేరుసెనగనూనె కూడా పెరిగిందట… సరే, సరే, కర్నాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీలో ధరలు ఎందుకు ఎక్కువున్నయ్..? దేశమంతటా ఒకటే జీఎస్టీ కదా… ఈ నిత్యావసరాల్ని జగన్ ప్రభుత్వం కోసం ప్రత్యేకంగా జీఎస్టీ కౌన్సిల్ డీనోటిఫై చేసేసి, మద్యం, పొగాకు, పెట్రో ఉత్పత్తుల్లాగా ప్రత్యేక పన్నులు వేసుకోవచ్చునని చెప్పిందా..? పోనీ, ఏపీలో పంటలు పండటం లేదా..? మహా అయితే కాస్త రవాణా ఛార్జీల్లో తేడా ఉంటుంది తప్ప, ఇంతగా తేడా ఉంటాయా రేట్లు..? కూసినవాడికి లేదు సరే, రాసినవాడికి ఏం పుట్టింది..? డీజిల్, పెట్రోల్ రేట్లు ఎక్కువే, వోకే, కానీ వంట గ్యాస్ ధర పెరిగితే జగన్ తప్పేముంది..? ఏపీలో ఇసుక, మద్యం రేట్లు ఓ అరాచకం… పెద్ద దందా… అది వోకే, మరి ఈ ఉప్పు, పప్పు, నూనె, చింతపండు ధరలకు కూడా జగన్ దుర్మార్గపాలనే కారణమనే ముద్రలు దేనికి..? జనం ఏం చెప్పినా నమ్మేస్తారు అనే పాత కాలపు ఛాందస టెక్నిక్కులా ఇవి..?!

nt

ఆగండాగండి… నమస్తే తెలంగాణ మరీ ఎక్స్‌ట్రీమ్… అది ఈనాడుకే దగ్గులు నేర్పించగలదు… ధాన్యం విషయంలో ఇష్టారాజ్యం వండేసిన తీరు గుర్తుంది కదా… మొన్న ఓ స్టోరీ రాసింది… తనకే నచ్చినట్టు లేదు, అందుకని కాస్త చిన్నగా వేసి, మమ అనిపించేసింది… అత్యంత గందరగోళం, ఇలాంటి వార్తలు నమస్తేలోనే సాధ్యం… మద్యం అమ్మకాలు తెలంగాణలో ‘ఎక్కువ అని బీజేపీ సోషల్ మీడియా తిట్టిపోసిందట, దానికి కౌంటర్ రాసింది ఇలా… అదైనా సరిగ్గా రాయొచ్చు కదా… బీజేపీ రాష్ట్రాల్లోనే కిక్కు ఎక్కువ అంటూ టాప్ ఆరు రాష్ట్రాలు బీజేపీవే అని ఓ చార్ట్ గీకింది… తీరా చూస్తే ఆ టాప్ సిక్స్‌లో రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే… అంటే అచ్చేసేటప్పుడు కూడా చెక్ చేసుకునే సోయి లేదా..? లేక ఏదో ఒకటి రాశామా, అచ్చేశామా, జనంలోకి వదిలామా అనే ధోరణా..?

మద్యం అమ్మకాలు వేరు, ఎక్సయిజు డ్యూటీ వేరు… ఉత్తరాఖండ్ ఎక్సయిజు డ్యూటీ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న రాష్ట్రం అని రాశారు… సరే, కానీ తెలంగాణలో వార్షిక మద్యం ఆదాయం ఎంత..? (ఎక్సయిజు, పన్నులు ప్లస్ కార్పొరేషన్ మార్జిన్లు, లైసెన్సు ఫీజులు గట్రా) చత్తీస్‌గఢ్‌లో ఎంత..? రాజస్థాన్‌లో ఎంత..? అది కదా చెప్పాల్సింది…! ఎక్సయిజు డ్యూటీ ఎక్కువ ఉంటే, మద్యం ఆదాయం, మద్యం అమ్మకాలు ఎక్కువ అన్నట్టుగా ముద్రేసి, రాసేసి, మస్తు కిక్కు ఫీలయితే ఇక చెప్పేదేముంది..?! డ్యూటీ రేటు వేరు, లిక్కర్ రెవిన్యూ, టోటల్ క్వాంటిటీ వేరు అనే బేసిక్స్ కూడా లేవు వార్తలో… ఖర్మ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions