అబ్బే… ఇంత పెద్ద స్టార్లు, పాన్ ఇండియా స్టార్లు, ఫుల్ డిమాండ్‌లో ఉన్న స్టార్లు ఉండగా… వరుస ఫ్లాపులకుతోడు వయస్సయిపోతున్న నాగార్జునకు అకస్మాత్తుగా బ్రాండ్ వాల్యూ పెరగడం ఏమిటని అనుకుంటున్నారా..? తప్పు..! నిజంగానే నాగార్జునకు ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్లకు సంబంధించి మస్త్ డిమాండ్ పెరిగింది… చాలా కంపెనీలు నాగార్జునతో యాడ్స్ చేయడానికి ముందుకొస్తున్నయ్… ఒక్కో దానికి రెండున్నర నుంచి మూడు కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడు తను ఇప్పుడు… కొన్ని యాడ్ ఏజెన్సీలకు ఇప్పుడు నాగార్జున ఓ హాట్ ప్రాపర్టీ… అడ్వర్టయిజ్ సర్కిళ్లలో ఓ టాపిక్… తాజాగా ఉదయం దుస్తుల కంపెనీ యాడ్ ఫైనల్ అయిపోయింది… మరో మూడునాలుగు సంతకాల కోసం ఎదురుచూస్తున్నయ్… అరె, తనకెందుకు ఇంతగా డిమాండ్ అంటారా..?
ప్రతి కంపెనీ తమ టార్గెట్ గ్రూపు ముందుగా సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ గ్రూపుకి రీచయ్యే సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తుంది… 40-60 ఏజ్ గ్రూపు కూడా వ్యాపారానికి కీలకమైన గ్రూపే… వాళ్లను కనెక్ట్ కావడానికి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కాస్త ఏజ్ బార్ హీరోలు ఎవరున్నారు..? చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రాజశేఖర్, నాగార్జున తదితరులు…
నాగ్ మినహా మిగతా వాళ్లెవరూ పెద్దగా యాడ్స్ మీద కాన్సంట్రేట్ చేయరు… పైగా పొలిటికల్ అఫిలియేషన్స్, జనంలోకి రీచ్, అప్పియరెన్స్ గట్రా చూస్తాయి కంపెనీలు… నాగార్జునకు ఏ పార్టీ వాసనా లేదు… ఒక్క మాట కూడా తూలడు… ఆచితూచి మాట్లాడతాడు… స్టూడియో యజమాని కదా, వ్యాపారి… తన డీలింగ్ వేరేగా ఉంటుంది… వరుస ఫ్లాపులతో సినిమాలు ఎక్కువగా చేస్తున్నడా లేదానేది కాదు ఇక్కడ… బిగ్‌బాస్ వంటి షోలతో, టీవీ, ఓటీటీ ప్రేక్షకుల్లోకి, అంటే ఇంటింటికీ రీచవుతున్నాడు… మహిళలు, యువకుల్లోకి కూడా వెళ్తున్నాడు రెగ్యులర్‌గా… ఈ స్థిరమైన ‘పబ్లిక్ కనెక్షన్’ నాగార్జునకు ప్లస్ పాయింట్ అవుతోంది…
Ads
బ్రాండ్ ప్రమోషన్లకు సంబంధించి మహేశ్ బాబు అందరికన్నా టాప్ రేటెడ్… (గుట్కా ఉత్పత్తులను, అనారోగ్యకరమైన కూల్ డ్రింక్స్‌ను కూడా ప్రమోట్ చేయడం వివాదాస్పదం అనేది వేరే సంగతి) ఈమధ్య బైక్ టాక్సీ రేపిడోకు బన్నీ చేసిన యాడ్ కూడా వివాదాస్పదం అయ్యింది… కానీ తెలుగు హీరోలు బ్రాండ్ ప్రమోషన్ యాడ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారనేది నిజం… నాగార్జున కుర్ర హీరోలకు దీటుగా యాడ్స్ డిమాండ్‌లో ఉన్నాడనేదీ నిజం…
నాగార్జునకు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే… తను బాగా ఫిజిక్ మెయింటెయిన్ చేస్తాడు… హెల్త్ కాన్షియస్… పెద్దల్లో పెద్దగా కనిపిస్తాడు, యంగ్ పీపుల్‌లో యంగ్‌గా కనిపిస్తాడు… స్టయిల్స్‌లో వెనక్కి తగ్గడు… వివాదాల్లోకి వెళ్లడు… అంత పెద్ద స్టూడియో ఓనర్ అయి ఉండీ, మరీ గడీ డిటర్జెంట్, కల్యాణ్ జువెల్లర్స్ యాడ్స్ ఎందుకు చేస్తాడనే ప్రశ్న చాలామందిలో ఉన్నదే… కానీ ప్రతి దానికీ నాగార్జున దగ్గర ఓ లెక్క ఉంటుంది… ఆ లెక్కలు ఇప్పుడు మంచి బ్రాండ్ వాల్యూను, డిమాండ్‌ను తీసుకొస్తున్నయ్…!!
Share this Article