ఇప్పుడు తెలంగాణలోనే ఎవరి స్థానికత ఏమిటో అర్థం గాక ఉద్యోగులు జుత్తు పీక్కుంటున్నారు… కానీ గతంలో కేసీయార్ చాలా సింపుల్‌గా తేల్చేశాడు గుర్తుంది కదా… అన్యపుకాయ అన్నవాడు తెలంగాణ, సొరకాయ అన్నవాడు ఆంధ్రా… అప్పట్లో తనకు గుర్తుకురానట్టుంది… ఇలాంటి స్థానికత ప్రశ్నలు కూడా ఓ రేంజులో ఉండాలి… ఉదాహరణకు ఒడిబియ్యం గురించి అడగాలి… ఏ సత్యవాణో బెబ్బెబ్బె అంటుంది… అరె, ఒడిబియ్యం అనగానే గరిజెలు (గర్జెలు, గర్జలు) గుర్తొస్తయ్… (గరిజెలు అన్నవాడు తెలంగాణ, కజ్జికాయలు అన్నవాడు ఆంధ్రా)… గరిజెలు అనగానే మొహాలు వింతగా పెట్టేయకండి… మీకు నెట్లో ఆ పదంతో ఏమీ దొరకవు… కజ్జికాయలు అని కొట్టి చూడండి… వందల స్టోరీలు, వీడియోలు కనిపిస్తయ్…
మనం ముందే చెప్పుకున్నాం కదా, సంక్రాంతి వంటలు అంటే సరిగ్గా అదేరోజు చేసుకునేవి కావని, ముందే చేసుకోవాలి, నాలుగు రోజులు నిల్వ ఉండాలి… అలాంటివాటిల్లో గరిజెలు కూడా… అనగా కజ్జికాయలు కూడా… గతంలో అయితే ఆడపిల్లకు సారె పెడితే ఒడిబియ్యంతోపాటు సకినాలు, గరిజెలు కూడా పెట్టేవాళ్లు… దూరాభారం అయినా సరే, ఆకలి తీరుస్తయ్, నిల్వ ఉంటయ్… బంధుగణానికీ పెట్టడానికి బాగుంటయ్… కాకపోతే అవి బియ్యపుపిండి, చక్కెర లేదా బెల్లం కలిపి కూరతారు… నిజానికి ఇప్పుడెవరూ చేయడం లేదు అలా, ఇక షాపుల్లో దొరికేవి చిత్రవిచిత్రంగా ఉంటయ్, చాలాచోట్ల అసలు గరిజెలు అనే ఫ్లేవర్, లుక్కు కూడా ఉండదు…
మీకు యూట్యూబ్ వీడియోల్లో కూడా రకరకాల కజ్జికాయలు చేసే విధానాలు చెబుతారు గానీ… అవేవీ పెద్దగా తినబుల్గా ఉండవు… ఏదో దిక్కులేదు కాబట్టి వాటిని చూస్తుంటారు… చేస్తుంటారు… నాలుక కాల్చుకుని ఇక మళ్లీ వాటి జోలికి వెళ్లరు… వేయించిన పల్లీలు, నువ్వులు, కొబ్బరికోరు మిక్సీలో కలిపేసి, కాస్త యాలకుల పొడి చల్లేసి, చిన్న చపాతీల్లా చేసుకున్న వాటి మధ్య ఈ ముద్దలు పెట్టేసి, కజ్జికాయల్లా ఒత్తేసి, నూనెలో కాల్చితే అవే సూపర్ కజ్జికాయలు అన్నంత కలరింగ్ ఇస్తున్నారు… అబ్బే… ఇవి మరీ ఉప్మా టైపు…
Ads
నిజానికి మైదా పిండిలో నెయ్యి కలిపి చపాతీ పిండిలా చేసుకోవడం ఫస్ట్ చిట్కా… నెయ్యితోనే వాటికి ఆ టేస్ట్… వాటిల్లో కూరడానికి పాలకోవా ప్లస్ కాస్త యాలకులపొడి… లేదంటే నువ్వుల పొడి ప్లస్ బెల్లం… చక్కెర, కొబ్బరి కోరు… పల్లీల పొడి ప్లస్ బెల్లం… ఇలా రకరకాల కాంబినేషన్లు… అయితే వాటిని నూనెలో వేయించేసి, డబ్బాలో పడేసి, మూత పెట్టేయడం కాదు… ఎప్పుడంటే అప్పుడు మూత తీసి లాగించడం కాదు… అసలు కోవా గరిజెల అసలు టేస్ట్ ఎప్పుడు ఘుమఘుమలాడుతుందీ అంటే… వేయించిన తరువాత వాటిని చక్కెర పాకంలో వేయాలి… వేడితోనే దాన్ని కాస్త పీల్చుకోనివ్వాలి… ఆ తరువాత ఓ సాసర్లోకి లేదా చిన్న ప్లేటులోకి తీసుకుని, స్పూన్‌తో ఒక్కో ముక్క కట్ చేసుకుని తింటూ ఉంటే… అవీ గరిజెలు అంటే…! వాటి తరువాత మురుకులు, అప్పాలు గట్రా… మీ ఇష్టం..!! చాలామందికి తయారీ విధానం అర్థం గాక కష్టం అనుకుంటారు గానీ… పూరీలు, పూర్ణాలు, బొబ్బట్లలాగే…!!
Share this Article