అప్పట్లో సమైక్యవాదానికి యాంటీ-తెలంగాణ పత్రికల మద్దతు… తెలంగాణ మీద ఎవడు ఏం కూసినా ఈ మీడియా అచ్చేసేది… వాడెవడో, వాడి రేంజ్ ఏమిటో ఈ మీడియాకు అక్కరలేదు… తెలంగాణను తిట్టాడా లేదా..? అంతే..! అలాగే జగన్‌ను తిడితే చాలు, మంచి ప్రయారిటీతో వార్త వేసేవాళ్లు… ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు… చంద్రబాబును మెచ్చుకోవాలి… పత్రిక అడుగులు, ఆలోచనలకు తగ్గట్టు ఎవడేం మాట్లాడినా కళ్లకద్దుకుని అచ్చేసి సంబరపడిపోతాయి ఇవి… ఈరోజు ఈనాడు తెలంగాణ ఎడిషన్‌లో ఫస్ట్ పేజీ ఫస్ట్ లీడ్ ఇంటర్వ్యూ, అదీ బైలైన్‌తో… నిజంగా దరిద్రం అనిపించింది… ఎందుకంటే..?
ప్రపంచాన్ని పీడిస్తున్న కోవిడ్ లేదా ప్రజెంట్ వేరియంట్ ఒమిక్రాన్ మీద ఇంటర్వ్యూ అంటే ఏవైనా కొత్త విషయాలు ఉండాలి… జనానికి ఉపయుక్తమై ఉండాలి… లేదా ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ కీలక పోస్టులో ఉండి ఉండాలి, ఆ నిర్ణయాల ప్రభావం జనం మీద ఉంటుంది కాబట్టి… అదేమీ లేదు, అక్కడెక్కడో వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఓ ప్రొఫెసర్ ఆమె… అంతే… అలాంటి ప్రొఫెసర్లు దేశంలో బొచ్చెడు మంది ఉన్నారు, పైగా ఈమె అంటువ్యాధులు, ఎపిడెమిక్ నిపుణురాలు కూడా కాదు… మరి ఈమె ఈనాడు ఫస్ట్ పేజీకి ఎందుకు ఎక్కింది..? ఏమో, అది అచ్చేసిన పెద్ద తలకాయలకు కూడా తెలుసో లేదో…
Ads
జనానికి ఉపయోగకర వార్తలు అనేది ఈనాడుకు ఎప్పుడూ అలవాటు లేదు… తనకు పనికొచ్చేవే వార్తలు… అవి రాసేవాడే రిపోర్టర్… అవి అచ్చేసేవాడే సబ్ ఎడిటర్… ఈ ఇంటర్వ్యూలో కూడా ఆమె బూస్టర్ డోస్‌తో 85 శాతం ఒమిక్రాన్ నుంచి రక్షణ ఉంటుందని చెప్పింది కదా… అంతే ఇక ఇంటర్వ్యూ కుమ్మేశారు… ఎందుకంటే… ఇలా అరకొర పాండిత్యంతో ప్రజల్ని భయపెట్టేవాళ్లుంటేనే కదా… 20 మినరల్ వాటర్ సీసా ధర వేక్సిన్‌ను 7- 800 రూపాయలకు అమ్ముతోంది భారత్ బయోటెక్… రామోజీరావు వియ్యంకుడు కదా… ఆ కంపెనీ పచ్చగా లక్షల కోట్లకు ఎదగాలి కదా… సో, ఇలాంటి ఇంటర్వ్యూలను గగన్‌దీప్ కాంగ్ ఇచ్చినా సరే, ఆ మెడికల్ కాలేజీలో మొన్న ఫస్టియర్‌లో జాయినైన పిల్లగాడు ఇచ్చినా అచ్చేస్తారు… జస్ట్, బూస్టర్ డోసులే కాదు, ఆరు నెలలకో డోస్ కంపల్సరీ, లేకపోతే చస్తార్రోయ్ అని భయపెట్టాలి… అంతే…
అసలు ఈ వేక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ మీద పరిశోధనలే లేవు… పైగా షెల్ఫ్ లైఫ్ పెంచేశారు… ధర వాళ్లే పెట్టేసుకున్నారు… గుర్రం గుడ్డిదయితే అన్నట్టు మోడీ ప్రభుత్వానికి ఎలాగూ వైద్యం, చికిత్స రంగాలపై బుర్ర, సోయి, దశ, దిశ లేవు కాబట్టి ఎవడు ఎలాగైనా ఆడుకుంటారు… అసలు ఒమిక్రాన్ ఓ రేంజ్ జలుబుతో సమానం, అది దేవుడిచ్చిన వేక్సిన్, ఈ దెబ్బకు కరోనా కథ ఖతం అని ప్రపంచమంతా పత్రికలు రాస్తుంటయ్… అసలు పదే పదే వేక్సిన్లు వేస్తే రోగనిరోధకశక్తి నాశనమైపోయి మరిన్ని దుష్పరిణామాలు ఖాయం అనే ఆందోళన వ్యక్తమవుతోంది… కానీ ఇదుగో ఇలాంటి పత్రికలు ఈ రాతలతో తమ ప్రజావ్యతిరేకతను ప్రదర్శించుకుంటూనే ఉంటయ్… ఉంటున్నయ్… రాయండి బ్రదర్స్, రాయండి… అసలే జగమెరిగిన జర్నలిజం కదా తమరిది…. అన్నట్టు… ఆ మెడికల్ కాలేజీలో అటెండర్ ఏదో రాసి పంపించాడట… రేపు ఫస్ట్ పేజీలో వీలైతే వేసేయండి బ్రదర్స్… రెండు నెలలకు ఓ బూస్టర్ డోస్ మస్ట్ అని రాశాడట… ఇంకేం..? కుమ్మేయండి బ్రదర్స్…!!
Share this Article