అందరూ తప్పక చదవాల్సిన కరోనా కథ అని ఎందుకంటున్నాను అంటే… బహుశా ఇంత ఖరీదైన చికిత్స, కరోనా మరణం మరొకటి గుర్తుకురావడం లేదు… ఆమధ్య పాత ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యాపారి కుటుంబం కోట్లు ఖర్చు చేసిందని చదివాను, అది ఎంతో గుర్తులేదు… అసలు ఎస్పీ బాలును పీల్చి పిప్పిచేసి, ఆస్తిని అరగదీసి, చివరకు తనను గాకుండా చేసింది ఓ చెన్నై హాస్పిటల్… అసలు మనకు ఓ అపోహ ఉంది గానీ, హైదరాబాద్ హాస్పిటల్స్ చాలానయం… ఆఫ్టరాల్ చిల్లర దొంగలు, కానీ చెన్నై హాస్పిటల్స్ ఉన్నదంతా నాకేసి, చివరకు ప్రాణాలు కూడా ఆర్పేసే బాపతు… మన కళ్లెదుటే కదా జయలలిత, బాలసుబ్రహ్మణ్యం…
సరే, ఈ కథేమిటంటే..? మధ్యప్రదేశ్‌లో రేవా జిల్లా… అక్కడ రాకారి అనే ఓ ఊరు… ధర్మజయ్ సింగ్ అనే ఓ బడా రైతు… కోవిడ్ కాలంలో చాలామందికి సేవలు కూడా అందించాడు… మంచి ఆదర్శరైతు… స్ట్రాబెర్రీలు, గులాబీలు సాగు చేస్తాడు… అంతకుముందు జనవరిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ ఆయన్ని సన్మానించాడు… విదర్భ రీజియన్‌లో ఆ రైతుకు మంచి పేరుంది… కానీ ఏప్రిల్‌లో అకస్మాత్తుగా నీరసం ఆవరించింది… టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ అని తేలింది…
వెంటనే అక్కడే ఉన్న సంజయ్ గాంధీ హాస్పిటల్‌లో చేర్చారు… పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు… ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరింది… 18 రోజుల తరువాత 100 శాతం ఇన్‌ఫెక్షన్ అని తేల్చారు… ఐనా డబ్బులున్న రోగిని ఏ హాస్పిటల్ వదిలిపెడుతుంది… చెన్నైకి ఎయిర్ లిఫ్ట్ చేశారు… చెన్నై, అపోలో హాస్పిటల్, ఊపిరితిత్తులు, డబ్బులున్నరోగి… ఇంకేముంది..? ఆల్మోస్ట్ మరణం అంచుల మీద ఉన్న ఆ రోగిని ఐసీయూ నుంచి అంటే ఆక్సిజెన్ సపోర్ట్ మీద నుంచి ఎక్మా మీదకు మార్చారు… అలా 8 నెలలు ‘‘చికిత్స చేశాం’’ అనిపించారు… రోగి కుటుంబం డబ్బు కడుతూనే ఉంది… హాస్పిటల్ గుంజుతూనే ఉంది…
Ads
అసలు ఎక్మాకే రోజుకు రెండు, రెండున్నర లక్షలు చార్జి చేస్తుంటారు… మొత్తం 50 ఎకరాల ఆస్తిని అమ్మేసింది ఆ కుటుంబం… అక్షరాలా 8 కోట్లను హాస్పిటల్‌కు కట్టారు… ఇక చేతులెత్తేశారు… ఒకసారి చేతులెత్తేశాక రోగిని రెండు నిమిషాలు కూడా హాస్పిటల్‌లో ఉంచుకోరు తెలుసు కదా… ‘చచ్చిపోయాడు’ అంటూ మొన్న మంగళవారం పీనుగను అప్పగించారు… 100 శాతం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ అని చెప్పీ 8 నెలలు ‘ఎక్మా’ మీద ఉంచి, 50 ఎకరాలు అమ్మించి, 8 కోట్లు మింగారు… లండన్ నుంచి వైద్యులను రప్పించామన్నారు…
(గుర్తుందా..? సేమ్, ఎస్పీ బాలు ప్రాణాల్ని కూడా ఇలాగే తోడేశారు…)… అంతా బాగానే ఉంది, కోలుకుంటున్నాడు అన్నారు, మరేమైంది అకస్మాత్తుగా అనడిగితే బ్రెయిన్ హేమరేజ్ అని చెప్పారట డాక్టర్లు… ఫాఫం… ఏ కార్పొరేట్ మాఫియా అయినా సరే, డబ్బులైపోయాయ్, శవాన్ని మేమేం చేసుకోను అని ఉల్టా అడుగుతుందా..? మరో 50 ఎకరాల భూమి ఉంటే ఏమయ్యేది..? చాలా సింపుల్ ప్రశ్న… కామన్ సెన్స్ ఏమిటంటే..? మరో 8 నెలలు ఆ శరీరం ఎక్మా మీదే ఉండేది…!!
Share this Article