Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పటి నిర్మాతలకు ‘‘అన్ని విద్యలూ తెలుసు’’… ఒకప్పటి నిర్మాతలు వేరు ఫాఫం…

January 16, 2022 by M S R

Bharadwaja Rangavajhala…………  

పాపం నిర్మాత‌లు …

ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయ‌నా …

మ‌రి ఆ యొక్క 1975 మార్చి ప‌ద‌హారో తారీఖున మ‌ద్రాసు పాండీబ‌జార్ లో ఉండిన‌టువంటి రాజ‌కుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు క‌దా … ద‌రిమిలా నిర్మాతా … అంత‌కు ముందు డిటెక్టివ్ న‌వ‌ల‌ల ప‌త్రిక న‌డిపేవాడూ అత‌నూ …

Ads

రోటీ అని మ‌న్మోహ‌న్ దేశాయ్ తీసిన‌ .. రాజేశ్ ఖ‌న్నా మ‌రియూ ముంతాజూ న‌టించిన హిందీ సినిమా లేదూ దాన్ని ప్ర‌త్యేక ఆట వేసి చూపించాడు …

ఆ ఏమిటో చూపిస్తున్నాడూ చూసేద్దాం … త‌ర్వాత ఎటూ ఏదో చెప్తాడు క‌దా అనుకున్నాం … వెళ్లాం … జ‌ర్న‌లిస్టులం అంద‌రమూనూ …

సినిమా బాగానే ఉంది… అందులో చాలా మంది అంతకు ముందే ఆ సినిమా చూశారు… డెబ్బై నాలుగులోనే వ‌చ్చిందిగా అదీ … ఆ విష‌యం ప‌క్క‌న ప‌డేస్తే …

ఇంట‌ర్వెల్లులో … పాప్ కార‌న్లూ … స‌మోసాలూ … కూల్ డ్రింకులూ అన్నీ ఫ్రీయేగా … మ‌రి అవ‌న్నీ కూడానూ తాగేసీ పుచ్చేసుకునీ …

మ‌ళ్లీ హాల్లోకి వెళ్లేప్పుడు చెప్పారు ..

బాబూ సినిమా అయ్యాక … ర‌వి చిత్రా కార్యాల‌యంలో మ‌రి భోజ‌నం ఏర్పాట్లు కూడా ఉన్నాయావ‌టా అని…

స‌ర్లే ఎన్నో చేశాం అది మాత్రం చేయ‌లేమా ఏమిటీ అనుకుని సినిమా చూసేసి అక్క‌డ భోజనం కూడా కానిచ్చేశాం..

అయిపోయిన త‌ర్వాత … వైవి రావ్ వ‌చ్చి కూర్చున్నాడు … తాంబూలాలు బిగిస్తున్నారు మ‌న మిత్రులు …

ఎలా ఉంది సినిమా అని అడిగాడు … అంద‌రినీ ఉద్దేశించి.

ఓ ప‌దిప‌దిహేను మందిమి ఉంటాం … అన్ని ప‌త్రిక‌ల‌కు సంబంధించిన రిపోర్డ‌ర్ల‌మూ క‌లిపి …

అంటే అందులో తెలుగు త‌మిళం ఇంగ్లీషుల‌తో పాటు డైలీ పేప‌ర్లూ సినిమా మంథ్లీలు వీక్లీల‌వాళ్లూ కూడానూ క‌ల్పి ఉన్నారులెండి …

అయ్యింది క‌దా … అంద‌రూ కూడానూ సినిమా బాగానే ఉంద‌న్న‌ట్టుగా అభిప్రాయం ప‌డ్డారు.

దీన్ని నేను తెలుగులో రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను …

హీరో మ‌రి మ‌న ఎన్టీఆరే … డైరెక్ట‌ర్ లాల్ గారే అన్నారు.

విష‌యం ఏమిటంటే … ఆయ‌న అంత‌కు ముందే నిప్పులాంటి మ‌నిషి అనే పేరుతో హిందీ జంజీరుకి తెలుగుపూత పూసి విజ‌యం సాదించిన ఉత్సాహంతో ఉన్నారన్న‌మాట‌.

అదేదో సామెత చెప్పిన‌ట్టు ఫ‌లానా హిందీ సినిమా రీమేకు చేస్తున్నానూ అని త‌గుదున‌మ్మా అని ట‌ముకేసి చెప్పుకోవ‌డం ఎందుకూ వీరి ఒఘాయిత్యం కూలా … పైగా ఇంతోసిదానికి ఆ సినిమా మాకు చూపించి భోజ‌నాలు కూడా పెట్ట‌డం ఎందుకు బొత్తిగా లౌక్యం లేదు డిటెక్టివ్ న‌వ‌ల‌ల వాడైన‌ప్ప‌టికిన్నీ అని వైవి రావును చూసి తెగ జాలిప‌డిపోయేసి అడిగేశాను కూడా ….

అప్పుడు ఆయ‌న న‌వ్వి …

ఈ సినిమాను తెలుగులో చేసేప్పుడు ఏఏ మార్పులు చేస్తే బాగుంటుందో సూచిస్తార‌ని మీకు చూపించాను అందుకే భోజ‌నాలు త‌దిత‌రాలూ … అలాగే ఎవ‌రేనా మార్పులు ప్ర‌తిపాదిస్తే … అవి మాకు స‌బ‌బు అనిపిస్తే త‌గిన పారితోషికం కూడా ఉంటుందీ అన్నాడు.

ఇంత వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్ప‌టికిన్నీ … నాకెందుకో వైవిరావ్ అమాయ‌క‌త్వ‌మే క‌నిపించింది సుమీ …

అట్టా ఉండేవారారోజుల్లో నిర్మాత‌లు … పాపం నిజంగానే నిర్ మాత‌ల్లానే … అంటే అర్ద‌మైంది క‌దా …

త‌ల్లిలేని పిల్ల‌ల్లా అనిపించేవారు పాపం …

ఏమిటో ఆ రోజులే వేరూ …

అని ముగించారో మ‌ద్రాసు కాలం నాటి జ‌ర్నలిస్టొకాయ‌న ఆ మ‌ధ్య క‌ల్సిన‌ప్పుడు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions