పెద్ద విశేషం ఏమీ అనిపించదు కొన్నిసార్లు… టీవీ, సినిమా, మోడల్ రంగుల రంగాలే కాదు… సాధారణంగానే విడాకుల కేసులు పెరిగిపోతున్నయ్… ఏళ్లపాటు కాపురాలు చేసి, పెద్ద పిల్లలు ఉన్న దంపతులు సైతం విడిపోయి, ఎవరి బతుకులు వాళ్లు బతకడానికి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు… అడ్జస్ట్మెంట్ అనేది లేదిప్పుడు… కటీఫ్ అనేస్తున్నారు… అయ్యో, రేపు పిల్లల మెదళ్లపై పడే ప్రభావం ఏమిటి అనే సున్నితమైన భావన కూడా ఎవరినీ ఆపలేకపోతోంది… కానీ కొన్ని విడాకుల వార్తలు వినగానే విభ్రమ, షాక్ కలుగుతుంది… ఎందుకో తెలియదు…
తాజా ఉదాహరణ… హీరో ధనుష్… రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య విడిపోవడం… గాసిప్ ఏమీ కాదు… ధనుష్ నేరుగా తన ట్విట్టర్ ఖాతాలోనే పోస్ట్ చేశాడు… రకరకాల రూమర్లు, ఏవేవో తప్పుడు ప్రచారాలకు చాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే, జరిగింది జనంతో చెప్పుకోవడమే కరెక్టు… ధనుష్ చేసింది అదే… తనే స్వయంగా చెప్పేశాడు… మేం విడిపోతున్నాం, మా డెసిషన్ గౌరవించండి అని విజ్ఞప్తి చేశాడు… నిజమే… అసలే రజినీకాంత్ బిడ్డ ఆమె, ధనుష్ కూడా జాతీయ అవార్డులు గెలుచుకున్న నటుడు, పాపులర్ హీరో… తమిళ ఇండస్ట్రీకే కాదు, ఇండియన్ సినిమా సర్కిళ్లలోనూ ఇది వార్తే…
Ads
ఎందుకు షాక్ అంటే..? వాళ్ల సంబంధం బీటలుబారినట్టు గానీ, ఇబ్బందుల్లో ఉన్నట్టు గానీ రూమర్లు కూడా వినిపించలేదు పెద్దగా… పైగా ధనుష్ నెమ్మదస్తుడు అనే అభిప్రాయం ఉంది ఇండస్ట్రీలో… పెళ్లయి కూడా 18 ఏళ్లు అవుతోంది… ఇద్దరు పిల్లలు, పాత్ర, లింగా… యాత్రకు అప్పుడే పదహారేళ్లు… లింగాకు పన్నెండేళ్లు… కావల్సినంత సంపద… ఆస్తి, ఐశ్వర్యం… తమిళ సొసైటీలో పెద్ద పేరు… ఒకప్పుడు వేరు కావచ్చుగాక, కానీ ధనుష్ ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఎదిగాడు… మామ చాటు అల్లుడేమీ కాదు… భార్య చాటు భర్తేమీ కాదు… నిజానికి తను అనామకుడేమీ కాదు… తన అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా… తను కస్తూరి రాజా అనే దర్శకనిర్మాత కొడుకు.,. బ్రదర్ సెల్వరాఘవన్ కూడా దర్శకుడే… సో, ఆ కపుల్ నడుమ ఆ ఇగో క్లాషెస్ కూడా పెద్దగా వినిపించలేదు…
అలాంటిది హఠాత్తుగా ఈ విడాకుల నిర్ణయం బయటపడటం ఆశ్చర్యాన్ని కలిగించింది… అఫ్ కోర్స్, మొన్నమొన్నటిదాకా చైతూ, సమంత వార్తలెన్ని చదివాం… విన్నాం… చూశాం… వస్తూనే ఉంటయ్, జరుగుతూనే ఉంటయ్… వాళ్ల నిర్ణయం వాళ్లిష్టం… కాకపోతే ఓ చర్చ అయితే సొసైటీలో జరుగుతుంది… 18 ఏళ్లు నిలబడిన బంధం ఇంత అకస్మాత్తుగా ఎందుకు తెగిపోతోంది..? బాధ్యులు ఎవరు..? కారణాలేమిటి..? నిజమైన కాారణాలేమిటో వాళ్లెలాగూ చెప్పరు… కానీ సమాజం రకరకాలుగా చెప్పుకుంటుంది… సహజం… ఇదో కొన్ని రోజులు…!!
Share this Article