అప్పట్లో మహాభారత్ దూరదర్శన్ సీరియల్ ఓ సంచలనం… ఆమధ్య కరోనా ఫస్ట్ వేవ్, లాక్ డౌన్ సందర్భంగా మళ్లీ ప్రసారం చేస్తే మళ్లీ టీఆర్పీల్లో రికార్డ్ క్రియేట్ చేసింది… అందులో శ్రీకృష్ణ పాత్రధారి పేరు నితిశ్ భరధ్వాజ్… దాంతో బాగా పాపులర్ అయిపోయాడు… ఇప్పుడు ఆయన ప్రసక్తి ఎందుకంటారా..? 59 ఏళ్ల వయస్సులో పెళ్లానికి విడాకులు ఇచ్చాడు… ఇప్పుడు అంతా సెలబ్రిటీల పెటాకుల వార్తలే కదా ట్రెండింగ్… ఆ జాబితాలోకి ఆయన కూడా చేరిపోయాడు… పన్నెండేళ్ల బంధానికి స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించాడు… రెండేళ్ల క్రితమే మ్యుచువల్ డైవోర్స్‌కు అప్లయ్ చేసుకున్నారు, విడిపోయారు ఇప్పుడు అధికారికంగా… దాదాపు అరవై ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల బంధానికి తెగదెంపులు ఏమిటీ అంటారా..? చదవండి…
ఆయన తల్లి సాధన ఉపాధ్యాయ్… ముంబై విల్సన్ కాలేజీలో మరాఠీ డిపార్ట్‌మెంట్‌కు హెడ్ ఆమె… తండ్రి జనార్దన్ సి.ఉపాధ్యాయ్… ముంబై హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్… అదీ ఆయన కుటుంబం… నితిశ్‌కు అంతకుముందే పెళ్లయింది… 1991లోనే మోనిష పాటిల్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆమె ఎవరంటే..? అప్పటి ఫెమినా ఎడిటర్ విమలా పాటిల్ బిడ్డ… కానీ ఆ పెళ్లి 2005లో బ్రేకయింది… వాళ్లకు అప్పటికే ఒక కొడుకు, ఒక బిడ్డ… ప్రస్తుతం వాళ్లు తల్లితో కలిసి లండన్‌లో ఉంటున్నారు… ఇక్కడ సీన్ కట్ చేస్తే…
నితిశ్ 2009లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు… ఆమె ఎవరంటే..? స్మిత గటే… ఓ ఐఏఎస్ అధికారిణి… మధ్యప్రదేశ్ కేడర్… ఆమె కెరీర్‌లో కూడా బోలెడు వివాదాలున్నయ్, అది ఇక్కడ అప్రస్తుతం… ఇప్పుడు ఆ పెళ్లి బ్రేయింది… ఈ స్మిత ద్వారా నితిశ్‌కు ఇద్దరు పిల్లలు… కవలలు… దేవయాని, శివరంజని… అంటే ఇక్కడ చెప్పబోయేది, రెండు పెళ్లిళ్ల ద్వారా నలుగురు పిల్లలు… దాదాపు అరవయ్యేళ్ల వయస్సులో ఆయన గారు పెళ్లి బంధానికి స్వస్తి చెప్పాడు… మరోసారి సీన్ కట్ చేస్తే…
Ads
ఈ స్మితకు కూడా ఇది రెండో పెళ్లి… అంతకుముందే ఆమెకు పెళ్లయి, విడాకులు కూడా తీసుకుని ఒంటరిగా ఉండేది… ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమై స్మిత, నితిశ్ ప్రేమబంధంలో పడిపోయి, పెళ్లి చేసుకున్నారు… 12 ఏళ్లకు ఇప్పుడు విడిపోయారు… ఇక్కడ మరో సంగతి కూడా చెప్పుకోవాలి… నితిశ్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు, బీజేపీ లీడర్… 1996లో జంషెడ్‌పూర్, రాజ్‌గఢ్ స్థానాల నుంచి పోటీచేశాడు… జంషెడ్‌పూర్ గెలిచాడు, రాజ్‌గఢ్ ఓడిపోయాడు… తరువాత ఎన్నికల్లో రాజ్‌గఢ్ నుంచి పోటీచేసి, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ బ్రదర్ లక్ష్మణ్ సింగ్ చేతిలో ఓడిపోయాడు… చెప్పుకునేది ఏమిటంటే… తను రాజకీయ నేపథ్యం, తన సినిమా నేపథ్యం, తన పాపులారిటీ కాదు… పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు… విద్యావంతులు, పెద్ద పోస్టులు, సొసైటీలో సెలబ్రిటీతనం… మరి ఆ పిల్లల మానసిక స్థితి..?! తోటి పిల్లల ఎదుట వాళ్లు ఎదుర్కొనే వివక్ష..? అవున్లెండి, తల్లిదండ్రులు కలిసి ఉండాలనే హక్కు పిల్లలకు లేదుగా… కానివ్వండి…!!
Share this Article