మూవీ క్రిటిక్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి డౌటనుమానం ఏమిటంటే…? ‘‘అసలు బిగ్‌బాస్ నుంచి అరియానాను ఎలిమినేట్ చేసినట్టు సమాచారం ఉంది… మరి అందరూ మోనాల్‌ను బయటికి పంపించేసినట్టు రాస్తున్నారేం..? నాకొచ్చిన సమాచారం తప్పా..? అందరూ రాసేది తప్పా..?’’ నిజంగా కాస్త థింకాల్సిన విషయమే… ఎందుకంటే..? నిన్నటి ఎపిసోడ్ చూస్తున్నంతసేపూ… నాగార్జున సొహెల్‌ను సపోర్ట్ చేస్తూ, అరియానాకు అడ్డగోలుగా క్లాస్ పీకుతున్నప్పుడే చాలామందికి డౌటొచ్చింది అలా…
నిజమే, కుక్కపిల్ల బొమ్మ విషయంలో మరీ ఓవర్ చేసింది… మొదట్లో రెండు టాస్కులు తను గెలిచిన అతి విశ్వాసమో, లేక తన గేమ్ ప్లాన్ల భలే వర్కవుట్ అవుతుందిలే అనే ఫీలింగో… డాన్స్ టాస్కు సమయంలో ఒక్కసారిగా సొహెల్ మీద ఫ్లేరప్ అయ్యింది… ఎస్, సొహెల్ ఆమెపై అరిచిన తీరు, మీదిమీదికి వెళ్లిన తీరు బాగోలేదు గానీ… ఎక్కడా ఒక్క తప్పుడు మాట జారలేదు…
Ads
అభిజిత్ చెప్పినట్టు… సొహెల్ ప్రవర్తనతో ఒక్కసారిగా షాక్ తిన్న అరియానా కిందపడిపోవడం, ఏడవడం వరకూ కాస్త అర్థం చేసుకోవచ్చు.,. కానీ మళ్లీ సొహెల్ కన్ఫెషన్ రూపంలోకి వెళ్లగానే, బాత్రూం దగ్గర కిందపడిపోయి, ఏడుపులంకించుకోవడం మటుకు ఓవరాక్షనే… ఇంటెన్షనలే… ఒక ఇన్సిడెంట్ జరిగాక మూడు గంటలపైగా కాలం గడిచాక… అరియానా మళ్లీ ఇష్యూ చేయడం కావాలనే సొహెల్‌ను బ్యాడ్ చేసే ఉద్దేశమే… డాన్స్ స్టేజీ మీద మొండిగా, రీజనింగు లేకుండా తలతిక్కగా వాదించడం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు… దాంతో అందరూ ఆమెకు ‘అతి’యానా అని పేరు పెట్టారు…
సరిగ్గా నాగార్జున కూడా ఇదే పట్టుకున్నాడు… కావాలని వుమెన్ కార్డ్ బయటికి తీశావ్… ఫస్ట్ సొహెల్ మీద అరిచింది నువ్వు… మళ్లీ బదనాం చేయాలని చూసిందీ నువ్వే అని తోటి కంటెస్టెంట్లతో కూడా అదే అనిపించడంతో… అరియానా మొహం మాడిపోయింది… తన గేమ్ ఎదురు తన్నిందని అర్థమైంది… కిక్కుమనలేదు… చూస్తున్న ప్రేక్షకులకు అనిపించింది కూడా అదే…
నాగార్జున కూడా అంతసేపు అరియానాకు క్లాస్ పీకడం నిజానికి అవసరం లేదు… సాగదీస్తూ సాగదీస్తూ అరియానా నోరుమూస్తూ… బ్యాటింగ్ చేశాడు… ఏమో, అరియానాను బయటికి పంపిస్తున్నారా..? ఇదేదో దానికి జస్టిఫికేషన్ ప్రయత్నంలా ఉంది అనుకున్నారు చాలామంది ప్రేక్షకులు… బయటికి వచ్చిన సమాచారమేమో మోనాల్ ఔట్ అని… కానీ అరియానా ఔట్ అని భిన్న సమాచారం కూడా వస్తోంది…
రెండుమూడు వారాల నుంచి గమనిస్తే బిగ్‌బాస్ టీమే కావాలని సైట్లను, యూట్యూబర్లను, మీడియాను లీకుల నుంచి తప్పుదోవ పట్టించడానికి… తనే ఓ ఫేక్ న్యూస్ లీక్ చేస్తోంది… ప్రతిసారీ మోనాల్ ఔట్ అయినట్టుగా లీకులు… తీరా ఆమెను ఎప్పటిలాగే సేవ్ చేసి, ఎవరో ఫైటర్‌ను బయటికి పంపించి చేతులు దులుపుకోవడం…! ఏమో… ఈసారీ అదే చేసి ఉంటాడు… చేయొద్దని ఏమీలేదు… అలాగని ఆమె ఔట్ కాలేదనీ చెప్పలేం… ఎందుకంటే..? ఈ దశలో నిజానికి ఆమె మీద బిగ్‌బాస్ టీంకు ఇంకా లవ్వు కొనసాగాల్సిన అవసరం లేదు… కంటెస్టెంట్లు బయటికి రాగానే ఇంటర్వ్యూలు చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ కూడా ‘ఖతం హోగయా’ అని పోస్టడం మోనాల్ బయటికి వచ్చేసిందని పరోక్షంగా చెప్పడమే… ఇప్పటికీ లోపల నుంచి కన్ఫరమ్ అవుతున్న న్యూస్… మోనాల్ ఔట్ అనే…
ష్.., నిజానికి ఎలిమినేట్ అయ్యింది మోనాల్ కావచ్చు లేదా అరియానా కావచ్చు… ఏమో, వోట్లలో నిజంగానే తేడా కొట్టేసి హారిక కూడా కావచ్చు… ఈ సస్పెన్స్ లైవ్‌గా ఉంచడం కోసమే బిగ్‌బాస్ టీం ఈ ఫేక్ లీక్ డ్రామాకు పూనుకుందేమో… హహహ… ఈ తెలివి కంటెంటు మీద చూపిస్తే షో సక్సెస్ అయ్యేదిగా బాసూ… ఈసారి కంటెస్టెంట్ల తీరు చూస్తే, ఇప్పటికిప్పుడు అందరినీ ఎలిమినేట్ చేసేసి, హౌస్‌కు తాళాలు వేసినా ఎవరూ బాధపడరు… ఈసారి షో రేంజ్ అదీ…
Share this Article