సోషల్ మీడియాలో చాలా పోస్టులు కనిపించినయ్… Srini Journalist రాసిన ఈ పోస్ట్ ఆలోచనాత్మకంగా ఉంది… సోకాల్డ్, మన కుహనా మేధావుల్లోని పక్షపాతాన్ని, వెన్నులేనితనాన్ని బజారులో నిలబెడుతున్నట్టుగా ఉంది… ఉద్దేశపూర్వక మౌనాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది… ఈ వాదనతో అందరూ ఏకీభవించకపోవచ్చుగాక… కానీ మెజారిటీ మతమే కొన్నిసార్లు బాధిత మతంగా, మైనారిటీ మతాలే ఆధిపత్య మతాలుగా చెలామణీ అయ్యే ఏకైక దేశం బహుశా ఇండియాయేనేమో అనిపిస్తుంటుంది… ఈ పోస్టు ఓసారి చదవండి… (మీకు మెయిన్ స్ట్రీమ్‌లో అసలు వార్తే కనిపించకపోవచ్చు కూడా…)
.
.
Ads
చెప్పాను కదా… దీనిపై ఇంతకంటే ఏం మాట్లాడుతాం. స్కూల్ లో, గుడి దగ్గరో, ఏదైనా ఊరిలోనే ఇలాంటి మాత మార్పిడి అంశంపై ఆందోళన చేస్తే కొన్ని సందర్భాల్లో ఉల్టా ఆందోళనకారులపైనే కేసులు… ఏమంటే శాంతి భద్రతలకు విఘాతంగా RSS VHP ముసుగులో సంఘవిద్రోహ శక్తులు పనిచేస్తున్నాయని దబాయింపు… అందుకే అనాలి అనిపించింది… ఎక్కువ మాట్లాడకండి… కేవలం ఒక కన్నీటి చుక్క విడవండి ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని…!!
Share this Article