WHO… కరోనా భూతం ఇంత చెలరేగి, ప్రపంచమే అల్లకల్లోలం కావడానికి మొదటి నిందితుడు చైనా… రెండో నిందితుడు మొత్తం వ్యవహారాన్ని దారితప్పించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ… అది చేయాల్సింది చేయలేదు సరికదా మొత్తం భ్రష్టుపట్టించింది… అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భోళాగా వెల్లడించాడు… అందరూ చైనా వ్యతిరేకతతో ఏదో కూస్తున్నాడు అనుకున్నారు… కానీ ట్రంప్ చెప్పిందే నిజం… వైరస్ వ్యాప్తి మొదట్లోనే WHO మొత్తం ప్రపంచాన్ని తప్పుడుదోవ వైపు తీసుకెళ్లిందని రకరకాల విశ్లేషణలు వచ్చాయి… తరువాత చికిత్స ప్రోటోకాల్, వేక్సినేషన్ తదితర విషయాల్లోనూ అంతే… మళ్లీ వాటి జోలికి ఎందుకులే గానీ… దాని తాజా ప్రకటన ఒకటి నవ్వును, జాలిని, కోపాన్ని కలిగిస్తున్నయ్ ఒకేసారి…
అసలు వేక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ మీద చర్చ లేదు, పరిశీలన లేదు… గుచ్చండి టీకాలు, పెంచండి ఆ టీకాల కంపెనీల సంపాదనను అన్నట్టుగా ఉంది సదరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం కూడా… ఆ సంస్థ ధోరణి చూస్తే అచ్చంగా ఈనాడు ధోరణే కనిపిస్తోంది… ఇప్పుడు మూడో డోస్‌కు బూస్టర్ డోస్‌కు నడుమ కూడా ఓ టీకా గుచ్చండి అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ… అంటే నాలుగు డోస్‌లు… ఇంతా చేస్తే, మినరల్ వాటర్ ఖరీదు చేసే టీకాను 800 దాకా ఖర్చు పెట్టి వేయించుకుంటే రక్షణ ఉందా..? లేదు…
Ads
కరోనా రావొద్దని ఏమీ లేదు… వీళ్లకు ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో దేవుడు ఓ వేక్సిన్‌ను పంపించాడు అని కూడా తెలియదు… ఒకసారి ఒమిక్రాన్ సోకాక వెంటనే బూస్టర్ డోస్ అక్కర్లేదనే కామన్ సెన్స్ కూడా లేదు… ఒమిక్రాన్ సోకాక యాంటీ బాడీస్ తయారవుతయ్ కదా, మళ్లీ వెంటనే బూస్టర్ దేనికి అనే సైంటిఫిక్ అప్రోచ్ కూడా లేదు… ఆ చైనావాడు ఏం చెబితే అలా ఆడుతుంది సంస్థ… ఒరేయ్, జిన్‌పింగ్, ప్రపంచాన్ని ధ్వంసం చేస్తున్నావు కదరా అని తిట్టాలంటే సంస్కారం ఈ నాలుగో డోస్‌లాగా అడ్డుపడుతోంది…
ట్రంప్ దిగిపోయి, బైడెన్ వచ్చాక చైనావాడికి మరింత ధైర్యం వచ్చింది… (ఆ ఎన్నికలో కూడా చైనా గతంలో రష్యా పాల్పడినట్టు ఏదో ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు సందేహాలు కూడా ఉన్నయ్…) సరే, సరే, హైబ్రిడ్ ఇమ్యూనిటీ వస్తుందంటున్నారు ఈ నాలుగో డోస్‌తో… నమ్ముదాం… మళ్లీ నాలుగు రోజులకు అయిదో డోస్ అవసరం అంటే..? కాదు, కాదు, కొన్నేళ్లపాటు నెలకో టీకా తప్పదు అంటే..? ఎక్కడివరకు..? మనుషుల్లో సహ రోగనిరోధకశక్తిని నాశనం చేసి, పూర్తిగా ఈ డోసుల మీద ఆధారపడే పరిస్థితిని క్రియేట్ చేస్తోందా ఈ WHO… అసలు ఈ వైరస్ వేరియెంట్‌కు విరుగుడు ఏది..?
అన్నట్టు… WHO చీప్ టెడ్రోస్ అనే వ్యక్తిపైనే ఇప్పుడు అందరికీ డౌట్… తన నేపథ్యం, తను ఎవరికోసం పనిచేస్తున్నాడు… ఇది తేలాలి… తేలదు… ఎందుకంటే..? చైనా సపోర్ట్..? అసలు చైనా సపోర్ట్ దేనికి..? మళ్లీ అదో స్కాం అట… ఇప్పుడు అర్థమవుతోందా..? వేక్సిన్లు, కరోనా చికిత్స ప్రోటోకాల్స్‌లో మోడీ ప్రభుత్వపు అడ్డదిడ్డపు విధానాల్లాగే ఉన్నట్టు అనిపిస్తోందా మీకు ఇది కూడా… సత్యం అదే… అది ఇప్పట్లో ఎవరికీ అర్థం కాదు… కుండబద్ధలు కొట్టినట్టు నిజాలు చెప్పే ట్రంప్ మరో అయిదేళ్లు అధికారంలో ఉండి ఉంటే బాగుండు అనిపిస్తోందా…? ఇప్పుడు చేతులు కాలాక ఏం లాభం..?! అవునూ, వాడేదో చెప్పాడు, దాన్ని ప్రచారం చేయడానికి సాక్షి వంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికకు ఎందుకు సిగ్గూశరం లేదు అనే ప్రశ్న తలెత్తుతోందా..? దానికి అసలు పత్రిక లక్షణాలు ఉంటే కదా…!! దానికి ఓ ఎడిటోరియల్ పాలసీ అంటూ ఏడిస్తే కదా..!! యథా జగన్ సర్కార్, తథా సాక్షి పాలసీ…!!!
Share this Article