తప్పేమీ కాదు, తప్పేదేమీ లేదు… తప్పదు… బీజేపీ తమ అనుకూల మీడియా కోసం బాగా తాపత్రయపడుతోంది… పాన్ ఇండియా సినిమాల్లాగే, పాన్ ఇండియా మీడియా ఇప్పుడు ట్రెండ్… పాన్ ఇండియా మీడియా అనగానే హిందీ, ఇంగ్లిష్ మాత్రమే అనుకోకండి… ఆ కాలం పోయింది… పాన్ ఇండియా సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు… సేమ్, మీడియా కూడా… పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఇన్నాళ్లూ ఈ భాషల్లో మీడియాను లోకల్ శక్తులకే వదిలేశాయి… అవేమో లోకల్ పార్టీలకు డప్పు కొడుతున్నయ్, ఈ నష్టనివారణకు, తన ప్రచారానికి తనకూ అనుకూల మీడియా వ్యాప్తి జరగాలనేది బీజేపీ ఆకాంక్ష…
ప్రత్యేకించి ప్రింట్ మీడియా దెబ్బతిన్నది… డిజిటల్ మీడియా యాడ్స్ డబ్బు బాగా కనిపిస్తోంది… జనం ప్రింట్ పత్రికలను చదవడం మానేస్తున్నారు… టీవీల క్రెడిబులిటీ దెబ్బతినిపోయింది… అందుకే పెద్ద పెద్ద మీడియా సంస్థలు డబ్బు, మార్కెట్ కనిపిస్తున్న సౌత్ ఇండియన్ భాషలపై పడుతున్నయ్… అలాగని పత్రికలో, టీవీలో పెట్టడం లేదు… జస్ట్, డిజిటల్ మీడియా అంటూ సైట్లు, డిజిటల్ చానెళ్లు ఓపెన్ చేస్తున్నాయి…
తాజాగా జీ మీడియా నాలుగు దక్షిణ భాషల్లో డిజిటల్ మీడియా రూపంలో విస్తరించింది… మొత్తం ఏడెనిమిది భాషల్లోకి జీ మీడియా ప్రవేశించినట్టుంది… బీజేపీకి ఇది ఆహ్వానించదగిన అంశమే… జీ మీడియా ఓనర్ సుభాష్ చంద్ర బీజేపీ మనిషే కదా… ఆమధ్య ఆర్థికంగా ఒడిదొడుకుల్లో ఉన్నట్టు వినిపించినా సరే, సోనీతో కలిశాక దేశంలో రెండో అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించారు… (వినోదం ప్లస్ న్యూస్ ఎట్సెట్రా)… వర్చువల్ పద్ధతిలో ఒకేసారి నాలుగు భాషల్లో జీ మీడియా న్యూస్ దుకాణాలు స్టార్ట్ చేశారు కదా, తెలుగు షట్టర్ ఓపెనింగుకు బండి సంజయ్ హాజరయ్యాడు…
Ads
మొన్న బెంగాల్ ఎన్నికలప్పుడు బీజేపీ అర్జెంటుగా చానెళ్లు స్టార్ట్ చేయాలంటూ తమ కాషాయ చానెల్ రిపబ్లిక్ టీవీ మీద ఒత్తిడి తెచ్చింది… నేను పలు భాషల్లోకి విస్తరిస్తున్నానహో అని ఎప్పుడూ చెప్పడమే తప్ప అర్నబ్ గోస్వామికి కనీసం డిజిటల్ ప్రసారాల్లోకి విస్తరించడం కూడా చేతకావడం లేదు… బెంగాలీ చానెల్ కోసం టీవీ9 గ్రూపు మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చింది బీజేపీ… కానీ దానికీ చేతకాలేదు… (లేదా, ఇష్టం లేక సాకులు చెప్పిందో)… సో, బీజేపీకి దేశవ్యాప్తంగా తమ మీడియా వ్యాప్తి జరగాలనేది ఆకాంక్ష… అయితే ప్రాంతీయ పార్టీల్లాగా తను నేరుగా ఇన్వాల్వ్ కాదు… వెనుక ఉండి సపోర్ట్ చేస్తుంది… అంతే… మీడియాలో కమ్యూనిస్టుల పట్టు ఎక్కువగా ఉందనేది బీజేపీ భావన… దాన్ని బద్ధలు కొట్టాలనేది కోరిక… తప్పుపట్టాల్సింది ఏమీలేదు… పార్టీ రాజకీయ కోణంలో తప్పుగా అనిపించదు… ఎందుకంటే… ఏ మీడియా సంస్థయినా ఏదో ఒక పార్టీకి డప్పు కొట్టేదే కదా ఇప్పుడు, నిష్పాక్షిక మీడియా అనేది లేదు కదా…!!
Share this Article