కరోనా వేక్సిన్ ఓపెన్ మార్కెట్ కోసం కమర్షియల్‌గా ఒక డోస్ 275 రూపాయలట… 150 సర్వీస్ ఛార్జి అట… గుడ్… ఈ సర్వీస్ చార్జి మీద మళ్లీ జీఎస్టీ ఉండవచ్చుగాక…. కానీ ఇష్యూ అది కాదు… ఇక్కడ కొన్ని ప్రశ్నలు… సమాధానం మోడీ ప్రభుత్వానికి చేతకాదు… వేక్సినేషన్ స్టార్టయి 150 కోట్ల మందికి పూర్తయిపోయినా సరే, ఈ దేశప్రజల ప్రశ్నలకు జవాబులు మాత్రం మోడీకి చేతకావు… చెప్పడు… అసలు పాలన తెలిస్తే కదా… హార్ష్‌గా ఉన్నట్టు అనిపిస్తోందా..? సగటు మనిషికి కరోనా విషయంలో ఏ భరోసా ఇవ్వలేని ప్రభుత్వం ఇది… వేక్సినేషన్ పాలసీలో అసలు నిందితురాలు కేంద్రమే కాబట్టి ఇది హార్ష్ కామెంట్ కాదు…! కానే కాదు…!!
- కోవాగ్జిన్ వేక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ కంపెనీ ఓనర్ ఏమన్నాడు..? తెలంగాణ యాక్టింగ్ సీఎం కేటీయారే సాక్షి… మినరల్ వాటర్ ఖరీదుకు టీకా ఇస్తానన్నాడు… తరువాత ఏమైంది… కేంద్రానికి ఒక ధర, రాష్ట్రానికి ఒక ధర, హాస్పిటల్స్‌కు ఒక ధర… ఒక దశలో 1250 దాటి… మినరల్ వాటర్ ఖరీదు 1250…. ఏం చేస్తం..? మన ప్రభుత్వాల దిక్కుమాలినతనం…
Ads
- ఇప్పుడు 275 ఖరారు చేస్తారట… మరి ఇప్పటిదాకా వసూలు చేసిన సగటు ధర దాదాపు ఏడెనిమిది వందలు… అంటే… 275 ప్రాఫిటబుల్ రేట్ అనుకుంటే… ఇప్పటిదాకా వసూలు చేసిన ఈ ధరను ఏమనాలి..? (పేరుకు ఓపెన్ మార్కెట్… ఏ హాస్పిటలైనా సరే సర్వీస్ ఛార్జీ, అసలు రేటు, జీఎస్టీ కలిపి జస్ట్, 500 వసూలు చేస్తారు… ప్రజల మీద మోడీ సారు గారికి ఎంత ప్రేమ…? ఎంత దయ..? నువ్వు కారణజన్ముడివి, సార్థకజన్ముడివి జహాపనా..?)
- వేర్వేరు ధరలు ఖరారు చేశాక మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రాలు బూతులు తిట్టినయ్… టీకాలు ఎవరి బాధ్యత అని అడిగినయ్… తరువాత బుద్ది తెచ్చుకుని ఫ్రీ వేక్సినేషన్ వైపు మళ్లింది మోడీ ప్రభుత్వం… మరి అది ఈ రెండు కంపెనీలకు ఏ ధర చెల్లించింది..? వీటి లాభాల కోసం విదేశీ టీకాలకు ఎందుకు అడ్డం పడింది చాన్నాళ్లు..?
- సపోజ్, ఏ 500 లేదా 600 ఇచ్చారని అనుకుందాం… అంటే ప్రభుత్వం వేసిన 150 కోట్ల డోసుల పేరిట ఈ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించింది ఎంత..? పోనీ, ఈ 275తో పోల్చండి… ఈ వేలు, లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? ఎవరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు..? ఇదేనా దేశప్రజల మీద బాధ్యత..? ప్రేమ..?
- పద్మ అవార్డులు కాకపోతే ఈ బేహారులకు భారతరత్నాలు ఇవ్వండి, అభ్యంతరం లేదు… మీ ప్రేమ మీ ఇష్టం… కానీ ఆత్మనిర్భర అనే డ్రామాల నుంచి ఏమీ చేయలేని అసమర్థత దాకా ఎలాగూ వైఫల్యాలు బోలెడు… పైగా ఈ వేక్సిన్ దందాకు సపోర్ట్..!!
- ఈ 275 రూపాయలే బోలెడు ప్రాఫిటబుల్… పైగా ఓపెన్ మార్కెట్ అట… అంటే ఇన్నాళ్లు అమ్మిన వేక్సిన్ సేవ అనుకోవాలా..? ప్రజల్ని ఎంత అజ్ఞానంలో ముంచేస్తున్నారు మహాప్రభూ..?
- హమ్మయ్య… నేషనల్ ఫార్మస్యూటిక్ ప్రైసింగ్ అథారిటీ ఉందట… హహహ… ప్రజారోగ్యం మీద భలే జోకులు వేస్తారు మోడీ జహాపనా…?! ఇదొక దిక్కుమాలిన సంస్థ ఉందని చెబుతున్నారు… గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్….
అసలు డ్రగ్ పాలసీయే ఓ పెద్ద ఫెయిల్యూర్… ఎవడి ఇష్టారాజ్యంగా వాడు పెంచేసుకున్నాడు… ఆన్‌లైన్‌లో ప్రస్తుతం 30 శాతం దాకా రిబేట్ ఇస్తున్నారు మందుల మీద… అంటే ఎమ్మార్పీ అనేదే ఓ పెద్ద బోగస్ విధానం, ప్రజల ఆరోగ్య అవసరాల మీద ప్రభుత్వ నియంత్రణ ఏమీ లేదా..? తప్పించేశారా..? వదిలేశారా..? మాట్లాడితే ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి అనే మోసపు ప్రకటనలు… (కేటీయార్ కూడా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరాడు… ఎందుకు..? ఎవరి లాభం కోసం..?)
సరే, ఉత్పత్తి ఖర్చు పెరిగాయి… ఉత్పత్తి మీద తయారీదారు లాభం ప్లస్ హోల్‌సేల్ వ్యాపారి మార్జిన్, రిటెయిలర్ లాభం… ఐనా 30 శాతం దాకా రిబేట్ ఇస్తున్నారంటే ప్రజల అత్యవసర ఆరోగ్య అవసరాల మీద కూడా కనబడుతున్న పాలసీ ఫెయిల్యూర్స్ మాటేమిటి..? అసలు కేంద్రంలో ఎవరైనా ప్రజల కోణంలో ఆలోచిస్తున్నారా..? ఆ సోయి ఉందా..? ఈ విషమ సంక్షోభకాలంలో కూడా వ్యాపారం తప్ప ఇంకేం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వ వైఖరిలో…. నిష్ఠురంగా ఉన్నా నిజంగా కలిచివేసే ప్రశ్న ఇదే…
ఇప్పుడు బూస్టర్ డోస్ అనేదే అనవసరం అని నిపుణులు చెబుతున్నారు… వాటి సైడ్ ఎఫెక్ట్స్ మీద పరిశోధన లేదు, పరిశీలన లేదు… ఆ కంపెనీలు ఏది చెబితే అదే చెలామణీ… అదెలా సమంజసం..? కరోనా సంక్షోభకాలంలో అత్యవసరంగా అనుమతులు ఇచ్చారు సరే, కానీ ఒమిక్రాన్ అనే గాడ్ గివెన్ వేక్సిన్ వచ్చాక కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ మీద దృష్టి అక్కర్లేదా..? ఇదేం బాధ్యతారాహిత్యం..? అసలు మోడీకి ప్రజల మీద, పాలన మీద ఏదైనా దశ, దిశ ఉన్నాయా..? నోట్ల రద్దు నుంచి ఇక్కడి దాకా… అసలు జనమే అక్కర్లేదా ప్రభూ..!!!
Share this Article