Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ తప్పుటడుగులు కొనసాగితే… మహానటి అనే కీర్తి తెరమరుగు గ్యారంటీ…

January 28, 2022 by M S R

నగేష్ కుకునూర్… అప్పుడెప్పుడో హైదరాబాద్ బ్లూస్ తీశాడు… చాన్నాళ్లు ముంబైలోనే సెటిలైపోయాడు, అనగా బాలీవుడ్‌లో… చేయితిరిగిన, పెద్ద పేరున్న దర్శకుడే… కథారచయితే… మరో కురువ‌ృద్ధుడు వంటి దర్శకుడు, పెద్ద పేరున్న హృషీకేష్ ముఖర్జీ కోసం పదిహేనేళ్ల క్రితం ఓ కథ రాశాడు… కానీ కుదరలేదు… ఇక తనే బరిలోకి దిగాడు… మరి స్పోర్ట్స్ డ్రామా సినిమా కదా… జాతీయ అవార్డు గ్రహీత, మహానటి, పెద్ద పేరున్న కీర్తి సురేష్‌ను ప్రధాన పాత్రకు తీసుకున్నాడు… ఇలాగే పెద్ద పెద్ద పేర్లున్న వాళ్లను సంగీతానికి, సినిమాటోగ్రఫీకి, ఎడిటింగ్‌కు తీసుకున్నాడు… ఫాఫం, ఎక్కడా ఆ ‘‘పెద్దరికాలు’’ పనిచేయలేదు…

అంతటి కీర్తికైనా సరే సహాయపాత్రలు కావాలి కదా… ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణను కూడా తీసుకున్నారు… అసలు ఆ కథ ఏమిటంటే..? ఓ గ్రామీణ యువతి… ఎక్కడ అడుగుపెడితే అక్కడ దురదృష్టం… బ్యాడ్ లక్ గరల్ అన్నమాట… నల్లపిల్లి… ఆమెను జగపతిబాబు అనబడే ఓ రిటైర్డ్ కల్నల్ షూటింగులో తీర్చిదిద్దుతాడు… ఆమెకు ఆది అనబడే ఓ లవర్… అడ్డుపడే రాహుల్… నిజానికి ఓ బ్యాడ్ లక్ కేరక్టర్ అనేది సరిగ్గా తీయగలిగితే ఇంట్రస్టింగు పాత్రే… కానీ అచ్చం ఆ పాత్రలాగే మొదటి నుంచీ ఈ సినిమాకు కూడా అన్నీ అపశకునాలు, అవాంతరాలు, అడ్డంకులు… సరే, ఎలాగోలా రెండేళ్లుగా ఆ బ్యారియర్లను దాటుతూ దాటుతూ షూటింగ్ ముగించారు…

sakhi

Ads

ఈ సినిమా కూడా ఆ పాత్రలాంటిదే అని చెప్పడానికి మరో ఉదాహరణ చిరంజీవి… ప్రిరిలీజ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా రావాలి… ప్చ్, ఇన్నాళ్లుగా కరోనా జాగ్రత్తల మీద కొన్నివేలసార్లు టీవీల్లో కనిపించి హెచ్చరించాడు… తనే కరోనా బారిన పడ్డాడు… మరి సినిమాలోని ప్రధానపాత్రలాగే ఈ సినిమా కూడా ఐరన్ లెగ్గు… రాంచరణ్ హాజరై, మా అభిమానులు కూడా ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చాడు, వేదిక మీద కీర్తితో రెండు స్టెప్పులు వేసి, వెళ్లిపోయాడు…

బహుశా 12 కోట్లు అనుకుంటా… నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం అని ముందుకొచ్చారట ఎవరో ఓటీటీ కంపెనీవాళ్లు… కానీ థియేటర్లలోనే రిలీజ్ చేశారు… పుష్ప, అఖండ, లవ్ స్టోరీ, శ్యామ్‌సింగరాయ్ సక్సెసులు చూసి, ఆ ఓటీటీవాడు ఇచ్చే డబ్బు థియేటర్‌లో రాదా, రిస్క్ తీసుకుందాం అనుకుని టాకీసుల్లోకి వచ్చేసింది సఖి… మొదటి ఆటకే తుస్సు… బ్యాడ్ టాక్ భీకరంగా వ్యాపించేసింది… లెగ్గు… బ్యాడ్ లక్కే కదా ఆది నుంచీ…

sakhi

కొందరు బొద్దుగా ఉంటేనే బాగుంటారు… కొందరు స్లిమ్‌గా ఉంటే బాగుంటారు… కీర్తి ఇంతకుముందు బాగుండేది… ఈ సినిమాలో మరీ ఎండుకుపోయినట్టు కనిపించింది… జీరో సైజుకన్నా, మైనస్‌లోకి వెళ్లిపోయినట్టుగా ఉంది… కాకపోతే ఈ సినిమాలో ఆమె కనిపిస్తున్నంతసేపు మాత్రమే చూడబుద్దయింది… ఇక మిగతాదంతా ఉత్త ట్రాష్… ప్రధానమైన లోపం స్క్రీన్ ప్లే… దానికి బాధ్యుడు కుకునూర్ నగేషే… అసలు ఆ కథలో, కథనంలో ఓ జోష్ లేదు… పేలవంగా సాగుతుంది…

మామూలు కథనాలతో పోలిస్తే ఓ అనామకురాలు ఓ చాలెంజ్‌లో గెలిచే కథ అంటే… ఆ జస్టిఫికేషన్, ఓ మంచి స్పూర్తిదాయక కథ చూస్తున్నాం అనిపించే స్క్రీన్ ప్లే ఉండాలి… పాటలు, బీజీఎం బాగుండాలి.., కథానుసార ఛాలెంజులు ఉండాలి… నిజానికి ఇలాంటి పాత్రలు, బయోపిక్స్ కొన్ని వచ్చినయ్ ఇండియన్ తెర మీద… వస్తూనే ఉన్నయ్… ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల క్రితం ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు అశ్విని అనే సినిమా తీశారు, ఆమెనే హీరోయిన్‌గా పెట్టి… బాగా వచ్చింది సినిమా… సో, రాసుకున్న కథను బట్టి ఉంటుంది సినిమా విజయం…

sakhi

ఎప్పుడైతే కథననాణ్యత లోపించిందో ఇక సంగీతం, కెమెరా, డైలాగులు, ఎడిటింగ్ వంటివీ చల్లబడతయ్, చప్పబడతయ్… ఎవరూ మనస్పూర్తిగా పనిచేయరు… ఇక్కడా అంతే… కీర్తిసురేష్ మహానటి తరువాత ఒక్కటంటే ఒక్క మంచి పాత్రను ఎంపిక చేసుకోలేదు… పూర్ ప్లానింగ్, పైగా సిస్టర్ పాత్రలు కూడా… దానికితోడు ఇలాంటి సినిమాలు… 2019 నుంచి మంచి హిట్ లేదు… ఫాఫం, ఇదిలాగే కొనసాగితే తెరమరుగు అయిపోతావ్, పాత కీర్తి కాస్తా పోతుంది మరి..! జాగ్రత్త… పాపం శమించుగాక… దేవుడిచ్చిన టాలెంట్ ఉంది… దాన్ని వినియోగించుకోడంలో మెళకువ అవసరం… (కెరీర్ మొదట్లో ఈమె కూడా ఐరన్ లెగ్ అనే విమర్శల్ని ఎదుర్కొంది)…

జగపతిబాబును వదిలేస్తే ఆది పినిశెట్టి కూడా ఈ పాత్ర అంగీకరించడం స్వయంకృతమే… ఇంకా ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పుకోవడం వేస్టే… నిజానికి రొటీన్‌ ఫార్ములా సినిమాలకు భిన్నంగా వచ్చే ఇన్‌స్పిరేషనల్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఏమాత్రం సరుకున్నా మెచ్చుకోవాలి, చప్పట్లు కొట్టాలి, ఎంకరేజ్ చేయాలి… అలాంటివి అవసరం కూడా… కానీ కుకునూర్ నగేష్ ఏ దశలోనూ దానికి చాన్సివ్వలేదు… బ్యాడ్ లక్ కీర్తీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions