నవంబరులో వచ్చింది సినిమా… పెద్దన్న… అది రజినీకాంత్ సినిమా… అసలు రజినీకాంత్ సినిమా అంటేనే తన అభిమానులతోపాటు సగటు ప్రేక్షకుల్లో కూడా బాగా ఆసక్తి ఉంటుంది… తన కమర్షియల్ రేంజ్ అది… పైగా అందులో నయనతార, కీర్తిసురేష్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, ఖుష్బూ, మీనా ఎట్సెట్రా ఉండనే ఉన్నారు… కానీ సినిమా ఫట్టుమన్నది… కళానిధిమారన్ నిర్మించిన సినిమా… కానీ అందరూ పెదవి విరిచారు… ఫ్యాన్స్ కూడా అసంతృప్తికి గురయ్యారు…
నిజానికి సినిమా బాగాలేదు… ఐనాసరే, రజినీ బ్రాండ్ చాలు, ఓ రేంజ్ వసూళ్లు రావడానికి… అనుకున్నట్టే మొదటి 3 రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ వసూళ్లు అని సైట్లు, పత్రికలు, మీడియా టాంటాం చేశాయి… మొత్తమ్మీద 240 కోట్లు దాటినట్టు లెక్కలేశారు… నిజానిజాలు పెరుమాళ్లకు ఎరుక… కానీ సినిమాకు మాత్రం తెలుగులో నిర్మొహమాటంగా నెగెటివ్ రివ్యూలు రాసేశారు… పైగా సినిమాకు ప్రమోషన్ యాక్టివిటీ కూడా ఏమీలేదు… కొన్ని సైట్లయితే మరీ ఈ సినిమాకు ఒకటి, ఒకటిన్నర రేటింగ్స్ ఇచ్చినయ్…
‘ముచ్చట’ అయితే రజినీకాంత్ ఇక రిటైర్మెంట్ గురించి సీరియస్‌గా ఆలోచించడం బెటర్, వరుసగా సినిమాలన్నీ ఫ్లాపవుతున్నయ్, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆట విరమించేవాడే అసలైన హీరో అని చెప్పింది… ఆ సినిమా సన్ గ్రూపు తీసింది కదా, ఇక తప్పేదేముంది..? జెమిని టీవీలో వేశారు మొన్నటి 16వ తేదీ, ఆదివారం, కనుమ పండుగ రోజు… అసలే జెమిని టీవీలో సినిమాలకు పెద్ద రీచ్ ఉండటం లేదు, రేటింగ్స్ రావడం లేదు… ఏమో, రజినీకాంత్ సినిమా కదా, జనం పండుగపూట తాపీగా చూస్తారులే అనుకున్నారు చాలామంది… కానీ మరీ దయనీయంగా 5.75 టీఆర్పీలు మాత్రమే దక్కాయి… (హైదరాబాద్ బార్క్ కేటగిరీ)…
Ads
అంటే రజినీ అనే బ్రాండ్ చెలామణీ వేగంగా తగ్గిపోతోంది అని అర్థం… తమిళనాడులో అభిమానం రేంజ్ కాస్త వేరుగా ఉండవచ్చుగాక, కానీ తెలుగులో ఇకపై నాణ్యమైన, భిన్నమైన స్టోరీలు వస్తే తప్ప ఆ ఫార్ములా, బేకార్ సినిమాలకు స్పందన రావడం కష్టమే అని అర్థమైపోతోంది… సూర్య వంటి కమర్షియల్ హీరోలు సైతం జైభీం, ఆకాశం నీ హద్దురా అంటూ కొత్త తరహా కథలు, సినిమాల వైపు వెళ్లిపోతున్నారు, ప్రశంసలు పొందుతున్నారు… రజినీకాంత్ మారడం లేదు, కాస్త మారినట్టు అనిపించిన కాలా, కబాలీలను కూడా జనం ఇష్టపడలేదు పెద్దగా… తనను ఎప్పటిలాగే పాత రజినీలాగే చూడాలని కోరుకుంటున్నారేమో అనుకుని మళ్లీ పాతచింతకాయ పద్ధతిలో పెద్దన్న అన్నాడు… ఐనా జనం తిరస్కరించారు…
సో.., అనారోగ్యం పేరుతో రాజకీయాలకు దూరం అని ప్రకటించినట్టే… ఇక ఈ కెరీర్‌కూ దండం పెట్టడం మేలు… దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది… పద్మవిభూషణ్ దక్కింది… డెబ్భయ్ ఏళ్లు నిండినయ్… బ్రహ్మాండమైన పాపులారిటీని ఎంజాయ్ చేశాడు… ఇక ఎక్కాల్సిన నిచ్చెనలేమున్నయ్..? తన అభిమానగణానికి ఈ ప్రస్తావన చేదుగా అనిపించవచ్చుగాక… కానీ ఓ దశ వచ్చాక తలెత్తుకుని, హుందాగా నిష్క్రమించడమే తన రేంజ్‌కు సూటయ్యే నిర్ణయం… జెమినిలో ఈ పూర్ రేటింగ్స్ చూశాక మరోసారి బలంగా అనిపించింది ఇదే…!!
Share this Article