ఒక వార్త బాగా నచ్చింది… మన గవర్నర్ తమిళిసై హీరోయిన్ సాయిపల్లవికి సపోర్ట్‌గా నిలిచింది… ఆమెపై జరిగే బాడీ షేమింగ్‌ను ఖండించింది… ట్రోలర్లకు క్లాస్ తీసుకుంది… విషయం ఏమిటంటే… సహజంగానే సమాజంలో ఓ వివక్షాపూరిత ధోరణి కొనసాగుతూనే ఉంటోంది కదా… కను ముక్కు తీరు, సౌష్టవం, కలర్… మహిళల్ని ఈ ప్రమాణాల్లోనే కొలుస్తుంటారు కదా… ఆయా రంగాల్లో వాళ్లు ఎన్ని సక్సెసులు సాధించినా, ఎంత మెరిట్ ప్రదర్శించినా సరే మెచ్చుకోళ్లు దక్కవు… ప్రత్యేకించి గ్లామర్ ఫీల్డులో అందం చందమే ప్రధానం… అది కాపాడుకున్నన్ని రోజులే మనుగడ… ఏమాత్రం తేడా వచ్చినా బాడీ షేమింగ్, వెటకారాలు ఎట్సెట్రా… చివరకు తొక్కేస్తారు…
ఇప్పుడేం జరిగిందంటే… శ్యామ్‌సింగరాయ్ సినిమాలో సాయిపల్లవి నటించింది… సినిమాలో కృతిశెట్టి, మడోనా కూడా ఉన్నా సరే, సాయిపల్లవి పాత్ర ఫుల్లు డామినేట్ చేసింది… ఈ రంగుల ప్రపంచంలో మేకప్ లేకుండా నటించడానికి ధైర్యం కావాలి… మొహంపై మొటిమల ఛాయలున్నా సరే, ఈ సినిమాలో సాయిపల్లవి అక్కడక్కడా వితవుట్ మేకప్ కనిపించింది… నాట్యం సరేసరి… ప్రత్యేకించి ఒక పాట గురించి మనం మొన్న చెప్పుకున్నాం కూడా… ఆమె ఎంచుకున్న పాత్ర కూడా బాగుంది… దేవదాసి… నటనకు స్కోపుంది, ఆమె సద్వినియోగం చేసుకుంది… సినిమా సక్సెస్‌లో ఆమెదీ ప్రధానపాత్రే…
కాకపోతే ఇప్పుడు ఓటీటీల్లో వచ్చేసింది కదా సినిమా… ఎవరో తమిళ సోషల్ మీడియాలో, మీడియాలో సినిమాలో సాయిపల్లవి ఏమాత్రం అందంగా లేదనీ, ఇంకా ఏదేదో రాసేశారు… దాని మీద చర్చోపచర్చలు… ట్రోలింగ్… నిజానికి ‘‘తెర మీద హీరోయిన్లు అందంగా చూపించబడతారు తప్ప, ఆ మేకప్ కడిగేస్తే కదా అసలు రూపాలు తెలిసేది’’… ఇప్పటికీ ఇండస్ట్రీ, సగటు ప్రేక్షకుడికి ఒకే అలవాటు… హీరోయిన్ పాత్ర ఎలా ఉన్నా పర్లేదు, హీరోల పక్కన దేభ్యం మొహాలేసుకుని నిలబడి, అప్పుడప్పుడూ నాలుగు పిచ్చి గెంతులు వేస్తే చాలు… పిసరంత డీగ్లామరైజ్డ్‌గా కనిపించినా సరే, ఇదుగో ఇలా ట్రోలింగ్…
Ads
గవర్నర్ తమిళిసై స్పందించి ఓ టీవీ చానెల్ లైవ్‌లో మాట్లాడింది… నాలుగు మంచి మాటలు చెప్పింది… ‘‘నేను కూడా ఈ బాడీ షేమింగ్ దశల్ని దాటివచ్చాను… ధైర్యంగా నిలబడ్డాను, ఐనా ఎగతాళి చేసేవాడికి తెలియదుగా ఆ మాటలు ఎదుటోళ్లను ఎంత బాధపెడతాయో… మహిళలకే ఈ బాడీ షేమింగ్ బాధలు, మగాళ్లు యాభై దాటినా యువకులే… నిజానికి ఇలా మహిళల్ని బాధించడం ద్వారానే వాళ్ల ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు… అందుకే పట్టించుకోవద్దు, మానసికంగా బలంగా ఉండాలి… పొట్టిగా పుడితే, దేహం రంగు తక్కువైతే, నాలాంటి జుట్టుంటే నిజానికి అది మన తప్పా..? ఏం..? వాటిల్లో అందం లేదా..? కాకిపిల్లకాకికిముద్దు… సో, సూటిపోటీమాటల్ని పట్టించుకునే పనిలేదు…’’
ఆమె గతంలో కూడా పలు సందర్భాల్లో బాడీ షేమింగ్ కు వ్యతిరేకంగా బలంగా నిలబడింది… అంతెందుకు, రెండుమూడేళ్ల క్రితం దినమలర్ పత్రికలో ఆమెను వికటంగా చూపిస్తూ ఏదో కార్టూన్ పబ్లిష్ చేస్తే విరుచుకుపడింది… ఆమె సాయిపల్లవికి సపోర్టుగా నిలబడి, చానెల్ లైవ్‌లో బాడీషేమింగ్ మీద మాట్లాడిన తీరుకు కూడా సోషల్ మీడియాలో అప్లాజ్ వచ్చింది… గవర్నరమ్మా… మీకు అభినందనలు…
In a live TV interview today, highlighted on Body-Shaming & its impact on women.
No woman should be discriminated on basis of their appearances/looks, color complexion & other physical characteristics.@PMOIndia @HMOIndia @MoHFW_INDIA @PTTVOnlineNews @pibchennai @ANI pic.twitter.com/rsPMLKKc7Z
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) January 27, 2022
Share this Article