నిజానికి ఇది ఓ ఇంట్రస్టింగ్ వార్తే… అంటే సినిమాలు, వెబ్ సీరిస్, నవలలకు సంబంధించి సుమా… మొన్న మనం చెప్పుకున్నాం కదా, అదేదో ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోతే గ్రాఫిక్స్‌తోనే సాంగ్ లాగించేశారని… రాబోయే రోజుల్లో సెలబ్రిటీల మొహాలతోనే యానిమేటెడ్ గ్రాఫిక్స్‌తో సీరిస్ లేదా సినిమాలు వచ్చే చాన్స్ ఉందని..! ఇదీ అలాంటిదే…
గతంలో పత్రికల్లో చిత్ర కథలు వచ్చేవి… అంటే బొమ్మలతో కథ చెప్పడం… మరి ఈ డిజిటల్ యుగంలో వాటినే యానిమేషన్ ఫార్మాట్‌లోకి మారిస్తే..? ఎస్, ఆ ఆలోచనతోనే ఇప్పుడు అథర్వ అనే ఓ వెబ్ సీరిస్ వస్తోంది… అందులో ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద సినిమా హీరోలు కాదు, క్రికెట్ హీరో ఎంఎస్ ధోని మొహాన్ని వాడుకున్నారు నిర్మాతలు… దాని ఫస్ట్ లుక్ కూడా ధోనితోనే సోషల్ మీడియాలో రిలీజ్ చేయించేశారు…
ధోని భార్య సాక్షి చెబుతోంది… అది పౌరాణిక సైన్స్ ఫిక్షన్ అని… ఈ అఘోరీ వెల్లడించిన రహస్యాలు ప్రాచీన కాలపు పురాణాలను మార్చగలవు అంటోంది… చాలా పెద్ద డైలాగ్… కథ ఎలా ఉంటుందో ఇక చూడాల్సిందే… అంతేలెండి, రకరకాల జానర్లు కలిపి కొట్టేయడమే కదా ఇప్పుడు ట్రెండ్… అఖండ, అవతార్ తరహాలో..! ఐనా వెబ్ సీరిస్‌కు జానర్లు ఏమిటి..? కలగూరగంపలే కదా… అయితే పూర్తిగా గ్రాఫిక్స్‌తోనే కదా, కథను కూడా మనమిష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చు… ఫస్ట్ లుక్‌లో కూడా అదే కనిపిస్తోంది… భూతాలు, రాక్షసులు, వారితో పోరాడే ధోని… అఫ్ కోర్స్, ధోని ఫిజికల్‌గా నటించడం అంటూ ఏమీ ఉండదు… తను నటనలో వెరీ వెరీ పూర్, జీరో ఎమోషన్స్ మనిషి…
Ads
ఐనా రాను రాను ఈ యానిమేటెడ్ చిత్రాలే బెటరేమో… కాల్ షీట్ల గొడవలుండవ్, సెట్లు, షూటింగుల తల్నొప్పులుండవ్, ఇగోలతో కబడ్డీ ఉండదు, ఎంచక్కా కావల్సిన సెట్టు కూడా గ్రాఫిక్స్‌తో గీసేసుకోవడమే… పైగా ఇప్పటి నటులకు ఆంగికం, వాచికం, సాత్వికం వంటి బేసిక్స్ కూడా ఎలాగూ తెలియవు, దర్శకుడు ఘడియకోసారి తలబద్ధలు కొట్టేసుకోనక్కర్లేదు… వెబ్ సీరిస్ కాబట్టి రెండు గంటల్లోనే అన్ని కమర్షియల్ వాల్యూస్ గుదిగుచ్చాలనే కక్కుర్తి యవ్వారాలూ అక్కర్లేదు…
అంతా బాగానే ఉంది గానీ, ప్రస్తుతం ధోని ఇమేజీ మరీ దిగువన కొట్టుకుంటోంది… ఒకప్పుడు క్రికెట్‌లో టాప్ స్టార్, కానీ ఇప్పుడు పట్టించుకునేవారే లేరు… స్వయంకృతం… అది ఫస్ట్ లుక్ మీద స్పందనలోనూ కనిపిస్తోంది… యూట్యూబ్‌లో దీనికి పూర్ రియాక్షన్ కనిపిస్తోంది… అంటే, జనంలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని అర్థం… అంతే…!!
Share this Article