మొన్నామధ్య నటి హిమజ బ్రేకప్ అని వార్తలు వచ్చినయ్ కదా… ఎహె, నాకసలు పెళ్లే కాలేదు, ఇలా పెళ్లి చేసేముందు, విడాకులు మంజూరు చేసేముందు నాకూ కాస్త చెప్పండి అని సెటైర్ వేస్తూ ఓ వీడియో కౌంటర్ రిలీజ్ చేసింది చూశారు కదా… అబ్బో, ఈ పిల్లకు ఎటకారం ఎక్కువే అని కొందరు ఉడుక్కున్నారు… ఆమె తన ఇన్‌స్టాలో చాలా ఫోటోలు డిలిట్ కొట్టేసింది… కొన్ని కీలకఫోటోలు ఎక్కడైనా దొరికితే ఈమెగారి బ్రేకప్‌కు ముందు చిత్రాలు ఇవీ అని చెప్పాలని యూట్యూబ్ చానెళ్లు వెతుకుతున్నయ్ కానీ దొరకడం లేదు ఫాఫం…
సరే, ఇప్పుడు ఈమె ప్రస్తావన ఎందుకంటే..? ఈ హిమజను ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి ఎక్కిస్తున్నారు… (ఎక్కించడం అంటే ఇక్కడ దురర్థం ఏమీ లేదని గమనించగలరు…) ఓ సీన్ చెప్పుకుందాం… ఈటీవీ ప్రోమోలో ఉన్నదే… ఈ షో కోసం రప్పించబడిన ఆడలేడీస్ అందరూ గోరింటాకు పెట్టుకునే, పెట్టించుకునే ఎపిసోడ్ ఒకటి ఉంది…
ఒకావిడ హిమజను అడుగుతుంది… సదరు షో డైరెక్టర్ లేదా స్క్రిప్ట్ రైటరో వెకిలిగా అడిగించాడన్నమాట… ‘ఈ కోన్ ఏమిటి ఇంత లావుగా ఉంది, సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి..? అనేది ప్రశ్న… దానికి హిమజ ‘ఒత్తాలి రా’ అని డెమోన్స్ట్రేట్ చేసి మరీ చెబుతుంది… తనే కిందకు ఒరిగిపోయి నవ్వుతుంది… (ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా..? ఫాఫం, మీరెంత అమాయకులండీ..?) అందులో బూతు గాఢత అర్థమైపోయి, అంతటి హైపర్ ఆది కూడా పాపం, వెనక్కి తిరిగి తలవంచుకుని సిగ్గుపడిపోయాడు… ఆటో రాంప్రసాద్ నోరు మెదిపితే ఒట్టు… ఇంద్రజ తలకొట్టుకుంది… సుధీర్ షాక్‌తో మ్రాన్పడిపోయాడు…
అఫ్కోర్స్, సుధీర్ మీద ఎప్పటిలాగే కొన్ని ద్వంద్వార్థాల పంచులు వేశారు… అన్నపూర్ణకూ ఒకటి తగిలించారు… ఈమధ్య కాస్త పద్దతిగా ఉంటోంది శ్రీదేవి డ్రామా కంపెనీ అనుకున్నాం, కామెడీతోపాటు చాలా అంశాలు టచ్ చేస్తున్నారు అనుకుంటున్నాం కదా… టీఆర్పీలు కూడా పర్లేదు కదా… ఇంకేం..? దాన్ని కూడా భ్రష్టుపట్టించే కార్యక్రమానికి తెరతీశారన్నమాట… ఎందుకంటే..?
Ads
ఈటీవీ రేటింగ్స్‌కు ప్రాణం ఈటీవీ న్యూస్‌తోపాటు జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్… అందరికీ తెలుసు కదా… గత వారం బార్క్ రేటింగ్స్ చూస్తే… జబర్దస్త్ 6.74 టీఆర్పీలతో ఈటీవీ టాప్ జాబితాలో నెంబర్ వన్… న్యూస్ తరువాత ప్లేస్ ఎక్సట్రా జబర్దస్త్… 5.61 టీఆర్పీలు… సో, ఆ షోలు అంటేనే బూతుల ధారావాహికలు కదా… ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బూతును ఎక్కిస్తే, ఇక జనం దాన్ని కూడా ఇరగబడి చూసేసి, జబర్దస్త్‌కు దీటుగా పాపులర్ చేస్తారనే ఎదవయిడియా ఏదో ఉన్నట్టుంది… గత వారం ఈ డ్రామా కంపెనీకి 4 రేటింగ్స్ వచ్చినయ్… ఈటీవీ మిగతా షోలతో పోలిస్తే చాలా నయం…
బూతును ఎక్కిస్తున్నారు దేనికి..?
నాసిరకాన్ని కూడా మెల్లిమెల్లిగా ఇంజక్ట్ చేస్తున్నారు, గతవారం ఎవరో ఒకాయన్ని పెద్ద ఇన్స్పైరింగ్ అని చాలాసేపు స్పెషల్ ఎపిసోడ్ వేశారు… అంతా అయిపోయాక కూడా ఆయన ఎవరో సగటు ప్రేక్షకుడికి అర్థం కాలేదు… వచ్చే ఎపిసోడ్లో ఓ కమెడియన్ చెల్లెను ఆకాశానికెత్తారు… ఎందుకో సదరు షో డైరెక్టర్లకే తెలియాలి… కొంపదీసి అటు స్టార్ మాటీవీలో కామెడీ స్ఠార్స్ ధమాకా క్లిక్ కావాలంటే ఈ డ్రామా కంపెనీని భ్రష్టుపట్టించాలి అనే ‘డబుల్ క్రాస్’ యవ్వారాలు ఏమైనా ఉన్నాయా..?
ఫాఫం, ఎన్ని వేషాలు వేసినా కదలని రేటింగ్స్
కామెడీ ధమాకా అంటే గుర్తొచ్చింది… ఈ డ్రామా కంపెనీ ప్రసారం అయ్యే టైంలోనే మాటీవీలో ఆ షో వస్తుంది… నాగబాబు వచ్చాక హోస్ట్‌ను పీకేశారు, జడ్జి ఛేంజ్… ఎవరెవరో వచ్చేస్తున్నారు, ఎవరెవరో మొహాలు మాడ్చుకుని వెళ్లిపోతున్నారు… పేరు కూడా ధమాకా అన్నారు… తీరా చూస్తే ఈసారి కూడా అట్టర్ ఫ్లాప్ షో… జస్ట్, 2.48 టీఆర్పీలు వచ్చాయి, మొన్నటి షోకు… జనానికి ఆ షో మీద సదభిప్రాయం రావడం లేదు… నిజానికి ఈటీవీ కామెడీ షోలతో పోలిస్తే ఈ ధమాకాలో సీనియర్లున్నారు ఇప్పుడు, వెరయిటీ జానర్లు చేస్తున్నారు, బూతు కూడా ఈటీవీతో పోలిస్తే తక్కువే… మరీ జబర్దస్త్‌లో అనసూయ పట్ల ఆది చెలరేగిపోతున్నాడు ఈమధ్య… కిక్కుమనడం లేదు అంతటి అనసూయ కూడా…!! కానీ కామెడీ స్టార్స్‌కు ఎక్కడో — శని తాండవిస్తున్నట్టుంది…!!
Share this Article