రాజకీయాల్లో ఉన్నవాళ్లు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, ప్రేలాపనలకు దిగడం పరిపాటే… ఓ రీతిరివాజు ఉండవు వాటికి… అఫ్‌కోర్స్, సమాజానికి కూడా అలవాటైపోయింది… అయితే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత చేసిన వ్యాఖ్యల్ని కూడా అదే కోవలో జమచేయాలా..? నవ్వి వదిలేయాలా..? ఆమె వైపు జాలిగా చూడాలా..? ఇంతకీ ఆమె ఏమన్నదో తెలుసా..? ‘‘ముంబై ట్రాఫిక్ జామ్స్ 3 శాతం విడాకులకు కారణమవుతున్నయ్’’..! మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఆమె విమర్శలు కొత్తేమీ కాదు…
‘‘నేను ఫడ్నవీస్ భార్యగా కాదు, ఓ సామాన్యస్త్రీగా, ఒక ముంబైవాసిగా మాట్లాడుతున్నాను’’ అంటూ ఓ ట్వీట్ కొట్టింది… నిజంగా ఆమె బుర్ర కూడా సగటు రాజకీయ నాయకుడి బుర్రలా మకిలిపట్టిందా..? కాదు, ఆమె తెలివైందే, చదువుకున్నదే… తల్లి గైనకాలజిస్ట్, తండ్రి కళ్లడాక్టర్… ఎంబీఏ చేసి యాక్సిస్ బ్యాంకులో క్యాషియర్‌గా మొదలుపెట్టి వైస్ ప్రెసిడెంటు దాకా ఎదిగింది… బ్యాంకర్ మాత్రమే కాదు, ఆమె ట్రెయిన్డ్ క్లాసికల్ సింగర్, పాటలు పాడుతుంది… సోషల్ వర్కర్… మరెందుకిలా మాట్లాడింది..?
(amrita fudnavis)
Ads
అమృత ట్వీట్‌తో ఫస్ట్ స్పందించిన పొలిటిషియన్ ప్రియాంక చతుర్వేది… ఆమె శివసేన రాజ్యసభ ఎంపీ… భర్త ఐబీఎంలో ప్రోగ్రాం మేనేజర్… సేమ్, అమృత వయస్సే, 42 ఏళ్లు… ఆమె కూడా చదువుకున్నదే… కాలమిస్టు కూడా… శివసేనలో చేరకముందు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఆమె… ఇప్పుడు అమృత పేరు ఎత్తకుండానే ఫుల్లు వెటకారాన్ని దట్టించి ఓ ట్వీట్ కొట్టింది… అమృతకు కౌంటర్ అన్నమాట… ‘‘3 శాతం విడాకుల వ్యాఖ్య చేసిన మహిళకు లాజిక్ ఆఫ్ ది డే అవార్డు ఇవ్వొచ్చు… సో, ఎంతసేపూ బ్రేక్ మీద కాలు గురించే కాదు, కాస్త అప్పుడప్పుడూ కొలువుకు బ్రేక్ తీసుకొండి… ప్లీజ్, బెంగుళూరు ప్రజలు దీన్ని చదవకుండా ఉండటం ఉత్తమం… ఎందుకంటే, వాళ్ల పెళ్లిళ్లకూ పెటాకుల ప్రమాదం ఉంది’’ అన్నట్టుగా ఉంది ఆ ట్వీట్…
(amrita)
అమృత అది చదివింది… సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది కదా… ఆ కౌంటర్ చదివి చిర్రెత్తినట్టుంది… ఆమె కూడా ఎవరి పేరూ ఎత్తకుండా… ‘‘ఏయ్ లేడీ, నిజం నుంచి పారిపోకు, మంకీ సర్వే (ఓ ఆన్‌లైన్ సర్వే సంస్థ) ఏం చెప్పిందో తెలియదా..? ట్రాఫిక్ కష్టాలు ముంబైవాసుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై బాగా ప్రభావం చూపిస్తున్నదని సర్వే చెప్పలేదా..? మనుషుల్లో పనిచేసే సామర్థ్యం దెబ్బతింటోందనీ, విడాకులు పెరుగుతున్నాయనీ తేల్చలేదా..?’’ అని మరో ట్వీట్ కొట్టింది…
(priyanka chaturvedi)
నిజానికి ఇలాంటి విషయాల్లో వెంటనే నోరుచేసుకునేది ఎంపీ సంజయ్ రౌట్… ఈమధ్య బీజేపీ తనకు ఐటీ నట్లు బిగించే పనిలో పడింది కదా, ఆ కష్టాల్లో ఉండి దీనిపై దృష్టి పెట్టనట్టుంది… సరే, ఇద్దరు ఆడలేడీస్ మధ్య ఈ వాగ్వాదం మాటెలా ఉన్నా… మరి ముంబై, బెంగుళూరు ట్రాఫిక్ కష్టాలు గురించి చెబుతున్నారు కదా… హైదరాబాద్ అంతకు భిన్నంగా ఏమీలేదు… ఇక కాస్త వర్షం పడిందంటే ఈ విశ్వనగరం స్థంభించిపోతోంది… మంకీ సర్వే వంటి ఏదైనా సంస్థ ఏమైనా సర్వే చేసి ఉంటుందా..? చేస్తే ఏమని తేలేదో…!!
Share this Article