Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒంటి పేరూ అది కాదు, ఇంటి పేరూ కాదు… బతుకులో ప్రతి అడుగూ ఓ విశేషమే…

June 25, 2025 by M S R

.

లతా మంగేష్కర్…. దేశమంతా మారుమోగిన పేరు… 80 ఏళ్ల సింగింగ్ కెరీర్ అంటే మాటలు కాదు… అలుపు లేని ప్రయాస… దేవుడిచ్చిన గొంతు… అయితే ఆ ఒంటి పేరు ఆమెది కాదు… ఆమె ఇంటిపేరు కూడా అది కాదు.., ఆమె పుట్టినప్పుడు పేరు హేమ… కానీ తండ్రి దీనానాథ్ వేసే నాటకాల్లో భావబంధన్ ఓ ఫేమస్ నాటకం… అందులో ఓ కేరక్టర్ పేరు లతిక…

హేమ స్థానంలో లత అనే పేరును ఆ తండ్రి తెచ్చిపెట్టాడు… అలాగే వాళ్ల ఒరిజినల్ ఇంటిపేరు హర్దీకర్… అంటే అభిషేకాలు నిర్వహించే అర్చకుడు… గోవాలో మంగేషి వాళ్ల స్వస్థలం… అందుకే దాని ఆధారంగా మంగేష్కర్ అని ఇంటిపేరు మార్చాడు దీనానాథ్…

Ads

తల్లి పేరు కూడా అంతే… నిజానికి తండ్రి ఫస్ట్ పెళ్లి చేసుకుంది నర్మద, ఆమె లత పెద్దమ్మ… ఆమె చనిపోయాక తండ్రి శివాంతెను పెళ్లిచేసుకున్నాడు… ఆమె పేరు కూడా మార్చి సుధామతి అని మార్చాడు…

తల్లి గుజరాతీ, తండ్రి మరాఠీ… పుట్టిందేమో మధ్యప్రదేశ్… బతుకంతా మహారాష్ట్రలో… పాన్ ఇండియా కేరక్టర్ ఆమె… కుటుంబంలో పెద్ద బిడ్డ… ఓ దశలో భారం తన మీద పడి కొన్ని సినిమాల్లో కూడా నటించింది… కానీ పనికిరావు అని నిర్మాతలు తేల్చేశారు…

అప్పుడు సంగీతం వైపు దృష్టి పెట్టింది… తరువాత కథ అందరికీ తెలిసిందే… కానీ మొదట్లో ఆమె గొంతు పీలగా, పలచగా ఉందని రిజెక్ట్ చేశారు సంగీత దర్శకులు, ఆమె పాడిన మొదటి పాటను కూడా సినిమాలో కత్తిరించేశారు… తండ్రి నాటకాల కోసం అయిదేళ్ల నుంచే నటిగా వెళ్లేది ఆమె…

ఆమె తోబుట్టువులు ఆశ (ఆశా భోంస్లే), మీనా, హృదయనాథ్, ఆశ… అందరూ గాయకులుగానో, సంగీత దర్శకులుగానే స్థిరపడ్డారు… ఆశ గురించి అందరికీ తెలిసిందే… 1999లో లతను రాజ్యసభకు నామినేట్ చేశారు, కానీ సభకు హాజరు కావడం సాధ్యం కాలేదు…

దాంతో ఒక్క రూపాయి కూడా పార్లమెంటు నుంచి తీసుకోలేదు, ఆ పేరుతో ఢిల్లీలో వసతిని కూడా తీసుకోలేదు ఆమె… రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఓ అవార్డుగా, ఓ గుర్తింపుగా స్వీకరించింది అంతే…

బడికి రాగానే పిల్లలకు సంగీతపాఠాలు చెబుతోందంటూ ఆమెతోపాటు ఆశను బడిలోకి రానివ్వలేదు… దాంతో మొదటి రోజే బడిని బహిష్కరించింది… అలాగే ఉండిపోయింది… అంటే, పెళ్లి లేదు, సంప్రదాయికమైన చదువూ లేదు… ఐతేనేం, ఆమె అధిరోహించిన శిఖరాలు అసామాన్యం… అది దేవుడిచ్చిన వరం మాత్రమే కాదు, అంతులేని ప్రయాస, సాధన ఉన్నయ్ వాటి వెనుక…

సో, పేరు ఆమెది కాదు, ఇంటిపేరు ఆమెది కాదు, ఆమె తల్లిదీ అసలు పేరు కాదు, బడి లేదు, ప్రేమ వ్యవహారం కూడా దెబ్బతినిపోయింది… రాజ్యసభ ఎంపీ, కానీ రాజకీయాల్లో లేదు, దగ్గరకే రానివ్వలేదు… అన్నీ అంతే…

1953లో ఫిలిమ్ ఫేర్ అవార్డు వచ్చినప్పుడు ఆ అవార్డు ప్రతిమ భారతీయ సంస్కృతికి విరుద్ధంగా, నగ్నంగా ఉందని తీసుకోవడానికి నిరాకరించింది… దాంటో దాన్ని బట్టలో చుట్టి ఇచ్చారు ఆమెకు… జాతీయ అవార్డుల్లో కూడా బెస్ట్ ఫిమేల్ సింగర్ అనే కేటగిరీ ఆమె ఒత్తిడి వల్లే ప్రారంభించారు…

రాయల్టీ విషయంలో పట్టింపు వచ్చి చాన్నాళ్లు ఆమె రఫీని దూరంగా ఉంచింది, తనతో పాడటానికి కూడా నిరాకరించింది… వాళ్లూ వీళ్లూ కలగజేసుకుని మళ్లీ సయోధ్య కుదిర్చారు… అప్పట్లో బాలీవుడ్ పాటల్లో ఉర్దూ మిళాయింపు బాగా ఉండేది… అందుకని ఆమె ప్రత్యేకంగా ఉర్దూ శిక్షణ పొందింది…

ఉర్దూ వాసనలున్న పాటల్ని కూడా బ్రహ్మాండంగా పాడింది ఆమె… మొదట్లో నూర్జహాన్ వంటి గాయనులతో పోటీ ఉండేది… తరువాత దేశవిభజన తరువాత ఇక లతదే హిందీ పాటల సామ్రాజ్యం అయిపోయింది…

ఆమె పేరిట లత ఎయిరు డే అనే పర్‌ఫ్యూమ్ కూడా మార్కెట్‌లో రిలీజ్ చేశారు… నటి, గాయని మాత్రమే కాదు, ఆమె సంగీత దర్శకత్వం చేసింది కొన్ని సినిమాలకు, కొన్ని తనే స్వయంగా నిర్మించింది కూడా… చెబుతూ పోతే ఆమె విశేషాలు ఒడవవు…

ఏదో గానం నేర్చుకుంది, పాడింది, హిట్టయింది అన్నట్టుగా ఉండదు ఆమె కథ… అడుగడుగునా ఓ అసాధారణత్వం ప్లస్ సంక్లిష్టం ప్లస్ ఆత్మాభిమానం ప్లస్ ఆదర్శం… ఆ కోకిల నిజంగా ఓ భారతరత్నం… సెలవు లతమ్మా… సెలవు…!! (సెప్టెంబరు 2022 నాటి వార్తాకథనం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions