మొన్న ఒక ఫుడ్ వీడియో… పుదీనా, మెంతి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు ప్లస్ ధనియాల పొడి, జిలకర పొడి, మసాలా ప్లస్ ఆవాలు, వెల్లుల్లి, ఉల్లి, జిలకర, మెంతులు, మినపపప్పు, శెనగపప్పు, అల్లం, పసుపు, ఇంగువ, కారం, ఎండుమిర్చి ప్లస్ నూనె, చిక్కదనం కోసం వరిపిండి లేదా సోయా… తీరా చూస్తే వంకాయ, ఆలూ, టమాట కరీ… ఇన్నిరకాల (దాదాపు 25) దినుసులు వేశాక అసలు ఒరిజినల్ వంట ఏముంది..? మనం ఏం తింటున్నామో మనకే అర్థం కాదు… కలగూరగంప అనే పదం దీనికి సరిపోదు… కలగూరకంపు… దింపేముందు నిమ్మరసం కూడా పిండాలట…
ఈమాట ఎందుకు అంటున్నాం అంటే… లక్షల మంది మనవాళ్లు దేశదేశాలకు కడుపు పట్టుకుని వెళ్లారు… చదువు అయిపోగానో జంప్… వాళ్లెవరికీ వంట రాదు… తల్లులు నేర్పిస్తే కదా… ఇక్కడ ఇప్పటి జనరేషన్ కూడా అంతే… చదువు, తరువాత కొలువు… తీరా పెళ్లయ్యాక మ్యాగీ చేయడానికి కూడా బ్బెబ్బెబ్బె… పైగా యూట్యూబ్ పాఠాలు… ఇక ఆ ట్యూబ్ చెఫుల సంగతి పైన చెప్పాను కదా… అన్ని దినుసులు రెడీ చేసుకునేంత ఓపిక, టైం ఉంటున్నాయా మనవాళ్లకు..?
సో.., వేగంగా అయిపోవాలి, టేస్ట్ నాలుకకి తగలాలి, నాలుగు రోజులు నిల్వ ఉండాలి, తక్కువ దినుసులు సరిపోవాలి, తక్కువ శ్రమ… ఇదీ వాళ్లకు కావల్సింది… అంతేతప్ప పెండాబెల్లం కలిపేసి, నోటికొచ్చిన వంట ఏదో వీడియో పెడితే చాలదు… ఎక్కువ దినుసులతో, మసాలాలతో వంట చెబుతున్న చెఫ్ ఎందుకూ పనికిరాని వంటమనిషి అని అర్థం… నిజానికి రుచి, వేగం, చౌక ఎట్సెట్రా కావాలంటే మనం పాత రోజుల్లోకి పోవాలి… నిజం… ఇప్పటి పాపులర్ యూట్యూబ్ చెఫ్ఫుల్లో మెజారిటీ వంటవాళ్లకు ప్రజెంట్ అవసరాలు ఏమిటో తెలియదు… కొత్త వంట అంటూ ఏదో పెంట గురించి చెబుతారు…
Ads
కొన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే లక్షల వ్యూస్, మరేం చేస్తారు..? వంట తెలియని జనరేషన్ ట్యూబ్ పాఠాలు చూసి నేర్చుకుంటోంది… అనుకోకుండా ఓ పచ్చడి వీడియో కనిపించింది… రియల్లీ ఇంట్రస్టింగు… నూనె లేదు, అసలు పొయ్యి మీద పెట్టే పనే లేదు… రుచి అదిరిపోవాలి… సరిగ్గా చేస్తే..! అసలు వాస్తవం తెలుసా..? కారం, ఉప్పు… సరిగ్గా వేసుకోగలిగితే ఏ వంటయినా బేఫికర్‌గా వండుకోవచ్చు… పైగా ఎంత తక్కువ మసాలాలు, అదనపు దినుసులు ఉంటే అంత ఒరిజినాలిటీ… మనం ఏం తింటున్నామో మనకు తెలుస్తుంది… ఇంతకీ ఈ పచ్చడి ఏమిటంటే..? ఈ వీడియో చూడండి…
పండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, చింతపండు, కాస్త జిలకర, గళ్ల ఉప్పు (రాళ్ల ఉప్పు)… అంతే… ఫ్రిజ్జులో పెట్టుకుంటే ఓ వారం వరకూ ఢోకా లేదు… అన్నంలోకి మాత్రమే కాదు, దోసెలు, అట్లు, రొట్టెలు, రాగిముద్ద… వాట్ నాట్..? దేనికైనా సూటవుతుంది… పైగా ఈ ఒమిక్రాన్ రోజుల్లో ఉపయోగకరమైన వెల్లుల్లి… నూనె లేదు, పోపు లేదు, పొయ్యి మంట కూడా ఏమీలేదు… నిజానికి ఈ వీడియోలో గ్రైండ్ చేసి చూపించారు గానీ, ఓపిక ఉన్నవాళ్లు, రోలు ఉన్నవాళ్లు రోటిపచ్చడిగా దంచుకుంటే ఇంకా సూపర్… వేడి అన్నంలోకి ఇది కలిపితే నాసామిరంగా… ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… అందుకే చెప్పాను, ఆత్మారాముడు ఆనందపడాలీ అంటే మనం పాత రోజుల్లోకి పోవాలి… ఏదో చెత్త చూపించే వీడియోల జోలికి పోవద్దు, కడుపును చెత్తకుండీ చేసుకోవద్దు…!! వెతికితే ఇలాంటి మంచి వీడియోలు దొరుకుతయ్..!!
Share this Article