ఎక్కడో సిరిసిల్లలో కేసు… ఇప్పుడు బిగ్‌బాస్ టీం తలపట్టుకుని టెన్షన్‌కు గురవుతోంది…! విచిత్రంగా ఉందా..? సిరిసిల్లలో కేసు ఏమిటి..? మాటీవీలో ఓంకారన్నయ్య తీసుకురాబోయే ఓటీటీ బిగ్‌బాస్ టీం నెత్తికొట్టుకోవడం ఏమిటి అంటారా..? సావధానంగా చదవండి… సరయు అనే పేరు యూట్యూబ్‌లో హాట్ వీడియోలు చూసే వాళ్లందరికీ తెలిసిందే… అంతా మింగుడు భాషలో, అశ్లీల సంభాషణల్ని యథేచ్ఛగా వదిలేసే 7ఆర్ట్స్ అనే సంస్థ వీడియోలు అవి… దాపరికాలు, పరోక్షమాటలు ఏమీ ఉండవ్, అంటే డబుల్ మీనింగ్ ఏమీ ఉండదు, స్ట్రెయిట్ బూతులే…
లక్షల్లో వ్యూస్ ఉంటయ్ కదా, అదసలే యూట్యూబ్ అడిగేవాడెవ్వడు..? అలాగే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు… ఆ వేడిలో పడి జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోయి ఓ షార్ట్ ఫిలిమ్ చేశారు… అక్కడ పడ్డది దెబ్బ… సిరిసిల్లలో 7ఆర్ట్స్ పేరిట ఓ రెస్టారెంట్ పెట్టారు… దాని ప్రమోషన్ కోసం ఈ షార్ట్ ఫిలిం… సరయు రేంజ్ చీప్ టేస్ట్… చిల్లర చిత్రీకరణ… భజరంగ్ దళ్ తరహాలో ఓ గ్యాంగు రెస్టారెంటులోకి వెళ్లి చేసే హంగామా… గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లను తలకు కట్టుకుని, పిచ్చి డైలాగులు వదులుతూ, డాన్సులు చేస్తూ సరయు ‘‘అతి’’ చేసింది…
Ads
సిరిసిల్ల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు… ఇది జరిగి ఏడాదయింది… పోలీసులు కేసు నమోదు చేశారు… ఆ 7 ఆర్ట్స్ టీం అంతా ఉండేది హైదరాబాదులోనే… ఇక్కడ కూడా ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టినట్టున్నారు తరువాత… సో, సిరిసిల్ల పోలీసులు ఆ కేసును హైదరాబాద్, బంజారా హిల్స్ స్టేషన్‌కు బదిలీ చేశారు… ఇలాంటి కేసులన్నింటికీ ఆ స్టేషనే కదా అడ్డా… వాళ్లు సరయుకు శ్రీముఖం పంపించి, కాస్త ఒకసారి వచ్చిపోవమ్మా మెరుపుతీగ అన్నారు… అదీ అసలు విషయం…
ఇదీ ఆ వీడియో… ఇక్కడ బలుపు (సారీ, ఇది 7 ఆర్ట్స్ భాషలో చాలా చాలా చిన్నది) ఏమిటంటే… కేసు నమోదైంది కదా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేట్టు అశ్లీలంగా, అసభ్యంగా ఉందనే వివాదం వచ్చినప్పుడు ఆ వీడియోను వాపస్ తీసుకోవచ్చు కదా… లేదు, అలాగే ఉంచేశారు… ఈ కథనం రాసే సమయానికి ఆ వీడియో యూట్యూబులో ఉంది… ఇదీ లింకు… పేరు ‘‘గిప్పని ఇస్తా…’
https://www.youtube.com/watch?v=g5WGSBoxqn0
ఇక ట్విస్ట్ ఏమిటంటే… మొన్నటి బిగ్‌బాస్ సీజన్‌లో ఉంది ఈమె… పొడుస్తా పొడుస్తా అని చెప్పింది, తీరా మొదటి వారంలోనే వాపస్ వచ్చేసింది… ఈమె పొడిచిందేమీ లేదు… బిగ్‌బాస్ ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు… అరెరె, మొదటివారంలోనే వాపస్ రావడం దురదృష్టమే అనే సానుభూతి ఉన్నట్టుంది… బిగ్‌బాస్ టీం ఈసారి ఓటీటీ బిగ్‌బాస్ సీజన్ కోసం ఆమెను ఎంపిక చేసుకున్నారు… ఆమె కూడా సై అంది… త్వరలో ఆ షూటింగ్ మొదలై, ఓటీటీలో ప్రసారం చేయాల్సి ఉంది…
ఇక ఇప్పుడు ఈ పోలీస్ కేసు తల్నొప్పి బిగ్‌బాస్‌కు పట్టుకుంది… ఆమె ఫోన్ స్విచాఫ్… ఎక్కడుందో తెలియదు… మరోవైపు సరయు అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు… ఇదండీ సిరిసిల్లలో కేసుకూ, సరయుకూ, బిగ్‌బాస్‌కూ లింకు… ఇంతకీ ఆమె ఎక్కడుంది అంటారా..? చికాగ్గా ఉండి ఫోన్ స్విచాఫ్ చేసి ఉంటుంది… తెల్లారేలోపు తెరపైకి వస్తుందేమో… అశ్లీలం చెలామణీ అయ్యేవరకే ఘాటుగా తలకెక్కుతుందేమో… ‘‘ఎక్కువైతే’’ ఇలాగే ఉంటుంది మరి…!!
Share this Article