Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎదురుతన్నిన పాకీ ఎదవ డ్రామా..! 11 గ్లోబల్ ఫరమ్స్ గుడ్డిగా చిక్కుకున్నయ్ వలలో..!!

February 10, 2022 by M S R

………. By…. పార్ధసారధి పోట్లూరి …….. కాశ్మీర్ డే అంటూ పాకిస్థాన్ ఆడిన ఎదవ డ్రామా ఎదురు తన్నింది… కొన్ని అంతర్జాతీయ సంస్థల పాకిస్థానీ ఫ్రాంచైజీల పేర్లతో ట్విట్టర్, ఫేస్‌బుక్ సోషల్ మీడియా వేదికల ద్వారా ఇండియాతో గేమ్ ప్లే చేయడానికి ట్రై చేసింది పాకిస్థాన్… ఇండియాలోని నెటిజన్లను రెచ్చగొట్టి, వాటి వ్యాపారాన్ని, పాపులారిటీని దెబ్బకొట్టి, ఇండియా రాకుండా పరిస్థితుల్ని క్రియేట్ చేయాలని చూసింది పాకిస్థాన్… ఎందుకు..? తన మిత్రదేశం చైనా కోసం… చైనా నుంచి ఆల్‌రెడీ శాంసంగ్ అన్నీ క్లోజ్ చేసుకుని, ఇండియా వస్తోంది, పలు కంపెనీలు చైనాలో దుకాణాలు మూసేసి, ఇండియా వైపు చూస్తున్నయ్… దాన్ని దెబ్బతీయాలనేది ప్లాన్… కానీ బెడిసికొట్టింది…

చాలా తెలివిగా హ్యుందాయ్ కంపెనీని మొదట టార్గెట్ చేసారు. ఎందుకంటే దక్షిణ కొరియాకి చెందిన హ్యుందాయ్ దాని అనుబంధ సంస్థ కియా మోటార్స్ డీలర్స్ పాకిస్థాన్ లో ఉన్నారు… మొదట హ్యుదాయ్ నే ఎన్నుకోవడంలో ఓ వ్యూహం ఉంది. కొరియా ఆటో దిగ్గజం ప్రధాన కార్యాలయం చాలా అరుదుగా అంతర్జాతీయ విషయాల మీద స్పందిస్తుంది… అదీ న్యూట్రల్ గా… అందులోనూ చాలా ఆలస్యంగా కూడా… ఈ విషయం కొంచెం అంతర్జాతీయ విషయాల మీద అవగాహన ఉన్నవారు ఎవరయినా చెప్పగలరు.

hyundai

Ads

నిజానికి తన దోస్త్ చైనా కోసం పాకిస్థాన్ తెలివైన ఎత్తుగడే వేసింది… ఆ దెబ్బకు 11 గ్లోబల్ ఫర్మ్స్, వాటి ఫ్రాంచైజీలు పాకిస్థాన్ పన్నిన వలలో చిక్కుకున్నాయి… మొదట వ్యూహాత్మకంగా hyundai ఫ్రాంచైజీల ద్వారా అధికారిక ట్విట్టర్ ఎకౌంటు ద్వారా కాశ్మీర్ కి సంఘీభావంగా ట్వీట్ చేయించారు. దానిని చూసి ఇక పిజ్జా హట్,డామినోస్, KFC, BOSCH [జెర్మనీ ], ఒసాకా బాటరీస్ [జపాన్],SCHWABE [జెర్మనీ ],అట్లాస్ హోండా [అట్లాస్ పాకిస్థాన్ మరియు హోండా జపాన్ సంయుక్త సంస్థ ] [జపాన్], ఇసుజు D మాక్స్ [జపాన్], హోండా కార్స్ india… ఇలా మొత్తం 11 గ్లోబల్ సంస్థల ఫ్రాంచైజీలు కాశ్మీర్ సంఘీభావదినం పేరిట ఆయా సంస్థల అధికారిక చిహ్నాలు ఉన్న twitter, facebook ఎకౌంట్లలో పోస్ట్ చేసాయి…

honda(Honda లెంపలేసుకున్న ట్వీట్)

కొరియన్ కంపెనీలు, వాటి యాజమాన్యాలు ఏదన్నా సమస్య తలెత్తినప్పుడు వెంటనే స్పందించవు. సమస్య మీద చర్చించి, దాని మీద ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం మీద కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇది తెలిసే మొదట హ్యుందాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ ని మొదట ఎంచుకున్నారు పాకిస్తాన్ డీలర్లు… కియా మోటార్స్ పాకిస్తాన్ ఫ్రాంచైజీ కాశ్మీర్ ట్వీట్ వెలువడిన వెంటనే మిగతా 10 గ్లోబల్ సంస్థల ఫ్రాంచైజీలు కూడా తమ అధికారిక అకౌంట్లలో వరుసగా ట్వీట్లు చేసాయి.

pizzahut(ఇండియన్స్ పిజ్జా హట్ వెళ్లడం మానేస్తే మట్టిగొట్టుకుపోతుంది కంపెనీ)

పొరపాటు ఎక్కడ జరిగింది ? పాకిస్తాన్ లోని కియా మోటార్స్ కాశ్మీర్ సంఘీభావ ప్రకటన వెలువడగానే వెంటనే భారత్ లోని నెటిజన్లు మొదటగా హ్యుందాయ్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో నిరసన వ్యక్తం చేస్తూ వరుసగా ట్వీట్లు చేసారు… దాంతో ఆ అకౌంట్ హాండ్లర్ వరుసగా ఆయా భారత నెటిజెన్లని బ్లాక్ చేయడం మొదలుపెట్టాడు… దాంతో చిర్రెత్తిన ఇండియన్ నెటిజన్లు తప్పు చేసి క్షమాపణ చెప్పకపోగా, పైగా మమ్మల్నే బ్లాక్ చేస్తావా అంటూ అప్పటికే హ్యుందాయ్ కార్లని బుక్ చేసుకున్న 300 మంది తమ ఆర్దర్లని కాన్సిల్ చేసి, వాటి స్క్రీన్ షాట్లని పోస్ట్ చేయడం మొదలుపెట్టారు…

 domino(క్షమాపణ చెప్పిన డొమినో…)

జరిగింది ఏమిటో, జరుగుతున్నది ఏమిటో సదరు హ్యుందాయ్ ట్విట్టర్ అకౌంట్ ని హాండిల్ చేసే అధికారులకి అసలు విషయం బోధపడింది. వెంటనే ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేసారు. విషయం పాకిస్తాన్ డీలర్లది అవడంతో ఇండియాలోని కీలకాధికారులు కొరియాలోని తమ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు. మరోవైపు భారత విదేశాంగ మంత్రి జయ శంకర్ కొరియా అంబాసిడర్ ని పిలిచి నిరసన వ్యక్తం చేశాడు. దాంతో కొరియాలోని ప్రధాన కార్యాలయం క్షమాపణ కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది… కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొరియా సంస్థల పనితీరు మీద బాగా అధ్యయనం చేసిన ISI మొదట కియా పాకిస్తాన్ మోటార్స్ ని టార్గెట్ చేసింది… దాని లక్ష్యం నెరవేరింది…

isuzu

అయితే నెటిజన్లు కూడా తొందరపాటుగా వ్యవహరించారు. కనీసం మరో రెండు రోజులు ఆగాల్సింది. అలాగే సమస్య తీవ్రత ఎలాంటిదో పసిగట్టడంలో హ్యుందాయ్ ప్రధాన కార్యలయం విఫలం అయ్యింది. దరిమిలా మార్కెట్లో షేర్ ధర పడిపోవడంతో పాటు 300 కి పైగా ఆర్దర్లని కోల్పోయింది. అయితే ఇది 3000 లుగా ప్రచారం జరుగుతున్నది కానీ అది నిజం కాదు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య వైరం ఎలా ఉంటుందో వాళ్లకి తెలియంది కాదు… అదే సమయంలో కాశ్మీర్ విషయంలో భారత్ ఎలా స్పందిస్తుందో పసిగట్టలేకపోయింది. ప్రభుత్వం కంటే ముందు భారత్ పౌరుల ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అని ఊహించలేక పోవడమే తీవ్ర జాప్యానికి కారణం అయ్యింది.

kia(తప్పయింది అని కియా మోటార్స్ సారీ)

దక్షిణ కొరియా తరువాత ప్రపంచంలో బయట ఉన్న తమ శాఖల్లో భారత్ అతి పెద్దది. మన దేశం నుండి దాదాపుగా 20 దేశాలకి పైగా కార్లని ఎగుమతి చేస్తున్నది. పైగా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి వేల కోట్ల డాలర్లను ఖర్చు పెడుతున్న తరుణంలో నిర్లక్ష్యం కొంప ముంచింది. SAMSUNG తమ మొత్తం యూనిట్ ని చైనా నుండి తరలిస్తున్నది. ఇది మరి కొద్ది వారాల్లో పూర్తి అయిపోతుంది. అలాగే మరి కొన్ని కొరియా, జపాన్ సంస్థలు చైనా నుండి బయటికి వచ్చి భారత్ లో తమ యూనిట్లని పెట్టే పనిలో ఇప్పటికే నిమగ్నం అయ్యాయి.

schwabe

ఈ తరుణంలో భారత్ లో జాతీయ భావాలు ఎక్కువ కాబట్టి మీరు అక్కడ పరిశ్రమలు పెడితే నష్టపోతారు అనే సంకేతం ఇవ్వడానికే పాకిస్థాన్ ఆడిన నాటకం ఇది. అసలు ఇలాంటి విషయాలలో మన శత్రువుల లక్ష్యం ఏమిటో పూర్తిగా అవగాహన చేసుకోకుండా తొందరపడితే వాళ్ళ ఉచ్చులో పడిపోతాము అనడానికి ఇది చక్కని ఉదాహరణ ! ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోతే అప్పుడు చేయాలి… కానీ ఇలా తొందరపడితే మనకే నష్టం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions