అంతన్నాడు, ఇంతన్నాడే…. అన్నట్టుగా… డీజే టిల్లు అనే సినిమా మీద హైప్ ఫుల్లు క్రియేటైంది… జొన్నలగడ్డ సిద్దూ… గతంలో చిన్నాచితకా సినిమాలతో కాస్త పరిచయం… తనదే కథ, తనదే స్క్రీన్‌ప్లే సహకారం… ఇంకేముంది..? ఫుల్లు తన కేరక్టర్ మీదే కాన్సంట్రేషన్… ఓవర్ యాంబిషన్స్… అచ్చం వంద కోట్ల సినిమా రేంజ్‌కు చేరాలనే తన వ్యక్తిగత ఆకాంక్షలాగే… ఈ పాత్ర కూడా ఓ ఆశావాది… అత్యాశావాది అనలేం, ఎవరి లక్కు ఏమిటో చెప్పలేం
ఓ తలతిక్క మెగా జర్నలిస్టు వేసిన ‘‘ఇంతకీ మీ హీరోయిన్ పుట్టుమచ్చలు ఎన్నో కనిపెట్టారా’’ అనే ఓ పిచ్చి ప్రశ్నతో వివాదం తలెత్తి… అది కూడా ఓ పబ్లిసిటీకి ఉపయోగపడింది… ఇక మీడియాలో సిద్దూ ఏది చెబితే అది విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసింది… పైగా ట్రెయిలర్ కాస్త మాస్ టైటిల్ సాంగుతో జనంలోకి వెళ్లింది…
Ads
అసలే గుంటూరు టాకీస్ హీరో… ఇక తెలుసు కదా… తన మీద ఎలాంటి ముద్ర ఉందో… సరిగ్గా దానికి తగ్గట్టే… తనను ఫుల్లు ఎక్స్‌పోజ్ కథను, పాత్రను రాసుకున్నాడు సిద్దూ… సినిమా అంతా తనే… కానీ జరిగింది ఏమిటి..? సిద్ధూ ఓ ప్యూర్ హైదరాబాదీ కుర్రాడిలా జీవించేశాడు, డౌట్ లేదు… తన స్లాంగ్, తన డైలాగ్స్, తన బాడీ లాంగ్వేజీ మొత్తం కథంతా తన చుట్టూ తిరిగేట్టు చూసుకున్నాడు…
కానీ మెరిట్‌ను దాచలేరు కదా… హీరోయిన్ నేహాశెట్టి అదరగొట్టేసింది… బోలెడు రొమాంటిక్ సీన్లు, కిస్సులు గట్రా ఉన్నా సరే… ఆమె కనిపిస్తున్నంత సేపూ ప్లజెంటుగా ఉంది… పలు సీన్లలో సిద్దూను డామినేట్ చేసి పారేసింది… ఆ మెగా జర్నలిస్టు మొహం మాడిపోయి ఉంటుంది అంటారా..? అంత మాట వద్దులెండి… ఆమె ఎంత తెలివిగా సదరు జర్నలిస్టుకు సమాధానం చెప్పిందో, అంతకుమించి తన నటనతో సినిమాలో ఇరగ్గొట్టేసింది…
ఎస్, అదే అవసరం… జస్ట్, నాలుగు మంచి సీన్లు దొరికినా సరే, తామేమిటో ప్రూవ్ చేసుకునే మెరిటే కొత్త హీరోయిన్లను నిలబెట్టేది… ఆమె అందంగా ఉంది, కొన్ని సీన్లలో రెచ్చిపోయింది… కానీ సరైన సీన్లు పడినప్పుడు తనలోని నటిని బాగా ఆవిష్కరించేసింది… వోకే, వోకే, సినిమా కథ అంటారా..? ఓ సోది కథ… డీజేగా పనిచేసే ఓ హైదరాబాదీ కుర్రాడికి పెద్ద పెద్ద ఆకాంక్షలు…
ఇప్పటి మోడర్న్ ఓటీటీ సినిమాల్లాగే… జస్ట్, ఓ క్లబ్‌లో ఆమె పరిచయం, వెంటనే కనెక్టయిపోవడం… తీరా చూస్తే ఆమె మ్యారీడ్… ఓ బాయ్ ఫ్రెండ్ హత్య… ఎలా బయటపడాలో తెలియక కొట్టుకుంటూ ఉంటుంది… ఈ బకరా దొరుకుతాడు… వాళ్లు ఎలా బయటపడ్డారనేది కథ… మాంచి మసాలా సీన్లకు స్కోపున్న పాత్రలు… కథ… ఇంకేముంది..? కథ, స్క్రీన్‌ప్లే తను ఇష్టం వచ్చినట్టు రాసుకున్న హీరో ఊరుకుంటాడా..? పేరుకు ఎవరో దర్శకుడు ఉన్నా సరే, సిద్దూ ముద్రే కనిపిస్తూ ఉంటుంది…
వోకే, కథ ఎలా ఉన్నా సరే… కాస్త కామెడీ అద్దారు… రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దాం అనిపించారు… కానీ ఫస్టాఫ్ సరదాగా సాగిపోయినా సరే, సెకండాఫ్ వచ్చేసరికి చేతులెత్తేశారు… హీరో చెప్పినట్టే చేద్దాంలే అనుకుని దర్శకుడు కూడా వదిలేసినట్టున్నాడు… హీరోకు ఈ కథను ఎలా ఓ మాంచి కథనంతో నడిపించాలో తెలిసినట్టు లేదు… వెరసి సెకండాఫ్ డల్లు…
దాంతో మొత్తం సినిమాయే బలహీనపడిపోయింది… పెరిగిన హైప్ భ్రమల్లో సిద్దూ కూడా పడిపోయినట్టున్నాడు… ఇక సీక్వెలే తరువాయి అన్నట్టు ఎడాపెడా ప్రెస్‌మీట్లు గట్రా…. వోకే, వోకే, థియేటర్ల దాకా వెళ్లే ఓపిక లేదా మీకు..? నాలుగు రోజులు ఆగితే సరి, ఏదో దిక్కుమాలిన ఓటీటీలో వస్తుంది… చూడండి, లేదంటే టీవీ ఉండనే ఉందిగా…!! చివరగా… నేహా, నీకు ఫ్యూచర్ ఉంది, మంచి పాత్రలు పడితే…!!
Share this Article