మాస్ట్హెడ్… అంటే పత్రికల లోగో, పబ్లిషింగ్ సెంటర్ల వివరాలుండే ఫస్ట్ పేజీ టాప్ స్పేస్… తేదీ, సంచిక సంఖ్య, తమ పత్రిక ఫిలాసఫీ, లైన్ చెప్పేలా ఓ నినాదం వంటివి కూడా ఉంటయ్… ఉదాహరణకు సాక్షి మాస్ట్హెడ్ చూడండి, వైఎస్ బొమ్మ ఉంటుంది… సత్యమేవ జయతే అనే ఓ స్లగ్… ఈనాడు అయితే ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డెయిలీ అని రాసుకుంటుంది… గూగుల్ డూడుల్ లాగా కొన్ని పత్రికలు సందర్భాన్ని బట్టి మాస్ట్హెడ్ మారుస్తుంటయ్ కూడా…
ఉదాహరణకు పంద్రాగస్టు వస్తే లోగోకు మూడురంగులు పులమడం, దీపావళి అయితే రెండు పటాకులు… ఆ లోగో పక్కన తమ సొంత యాడ్స్ వేసుకుంటుంటయ్… ఉదాహరణకు ఈనాడు అయితే మార్గదర్శి, ఈటీవీ, ప్రియ ఫుడ్స్ యాడ్స్… మాస్ట్హెడ్ స్లగ్ పత్రిక ఫిలాసఫీ చెబుతుంది… ఉదాహరణకు నమస్తే తెలంగాణ మన రాష్ట్రం-మన పత్రిక అని రాసుకుంటుంది… అదీ తన ప్రయారిటీ, పత్రిక పంథా అన్నమాట…
Ads
నిన్న నమస్తే తెలంగాణ మాస్ట్హెడ్కు ఇటు పక్కన రాష్ట్రపతికి కేసీయార్ స్వాగతం ఫోటో, దాదాపు మాస్ట్హెడ్లో కలిపేసినట్టుగా అంబేడ్కర్ బొమ్మ ప్లస్ ఆయన జీవితకాల నినాదం బోధించు, సమీకరించు, పోరాడు ముద్రించారు… ఆసక్తికరం అనిపించింది… రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకుని, కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని ఇటీవల కేసీయార్ డిమాండ్ చేస్తున్నాడు కదా… దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు, అంబేడ్కర్ సంఘాలు, బహుజన, దళిత సెక్షన్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది…
ఈ ప్రశ్నను మొన్న ఓ ప్రెస్మీట్లో ఎదురైనప్పుడు కూడా… ‘‘అవును, రాజ్యాంగం కొత్తది కావాాలి, దళితులకు 19 శాతం రిజర్వేషన్లు అవసరం, ఆడపిల్లలకు భద్రత అవసరం, రాష్ట్రాలకు అధికారాల వికేంద్రీకరణ అవసరం, తప్పంటారా..?’’ అని కేసీయార్ తన వాదనకు కట్టుబడ్డాడు… స్పూర్తిని అమలు చేయలేనప్పుడు రాజ్యాంగాన్ని తగులబెట్టాలని అంబేడ్కరే అన్నాడని గుర్తుచేశాడు… దళితబంధు అద్భుత పథకం, కేంద్రానికి ఎందుకు చేతకాదు అని ప్రశ్నించాడు…
అయిదు పేజీల్లో ఆయన ప్రెస్మీట్ పరిచేసిన నమస్తే మాస్ట్హెడ్ పక్కన అంబేడ్కర్ బొమ్మ అచ్చేయడం విశేషంగా కనిపించింది… కానీ జస్ట్, ఒకటేరోజు… తెల్లవారి, అంటే ఈరోజు మాయమైపోయింది… ఓహ్, ఇది ఒక్కరోజు స్మరణేనా అనిపించింది… ఐనా కేవలం రాజకీయ అవసరాల కోసం, అప్పటికప్పుడు ఏవో రాజకీయ ఎత్తుగడల కోసం మాత్రమే ప్రయత్నించే పార్టీలు ఇంతేకదా అని కూడా అనిపించింది… రాజ్యాంగంలో కేసీయార్ ఏ మౌలిక మార్పుల్ని కోరుకుంటున్నాడో, వేటి మీద చర్చ జరగాలో వాటిని మాత్రం చెప్పడం లేదు కేసీయార్ గానీ, తన పత్రిక గానీ… డిబేట్ జరగాలని కోరుకునే కీలకనేతలు చర్చకు ఓ ఎజెండాను జనంలోకి వదలాలి కదా… అదీ లేదు..!!
Share this Article