ఆహా… ఓహో… పార్చూన్ జాబితాలో పేరు… ఫోర్బ్ జాబితాలో పేరు… వ్యాపార కూడలి మహారాణి అనే పేరు… ఒక దశలో స్టాక్ ఎక్స్‌ఛేంజీల ఫెడరేషన్ చైర్‌పర్సన్… నిజంగానే లక్షల కోట్ల వ్యాపారాల రహస్యాలన్నీ తెలిసే అడ్డా అది… కానీ ఏమైంది..? అసలు స్వరూపం బట్టబయలైంది… పాపం పండేరోజుకు… చందా కొచ్చర్ వంటి వాళ్లే చివరకు తమ నిజస్వరూపాల్ని దాచుకోలేకపోయారు… ఓ టైం వస్తే అన్నీ బహిరంగమే… ఎస్, చిత్రా రామకృష్ణ కథ కూడా అంతే… ఎవరీమె అనడక్కండి… నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ ఎండీ, సీఈవో… మోస్ట్ పవర్ ఫుల్ కార్పొరేట్ లేడీ… కానీ ఇప్పుడు ఏమిటి..?
ఆ కథేమిటో చెప్పుకునేముందు ఓ విషయం చెప్పుకోవాలి… సెబి ఈ కార్పొరేట్ అవకతవకల్ని పట్టించుకోవాల్సిన సంస్థ… మన దరిద్రం ఏమిటంటే… అది 20 ఏళ్లుగా సాగిన ఓ నీచమైన నేరాన్ని పట్టుకోలేకపోయింది… నిజానికి ఇది సీబీఐ వంటి సంస్థలు సీరియస్‌గా పట్టించుకోవాల్సిన నేరం… సెబీ వంటి సంస్థలతో కాదు… అదీ కార్పొరేట్ గుమస్తాయే కదా… పైగా నేరం అనే కోణాన్ని పరిశోధించి, బోనులో నిలబెట్టేంత సీన్ దానికి లేదు…
Ads
సెబీ ఎంత చెత్తా సంస్థగా మారిందీ అంటే…. ఎవడో ఆనంద్ సుబ్రహ్మణ్యన్ అనేవాడిని మొదట ఓ అనామకపు పోస్టులో జాయిన్ చేసుకుని, ఏకంగా సీఓఓ స్థాయికి చేర్చి, కోట్ల వేతనం ఇస్తున్నప్పుడే… సెబీ అనుమానించాలి కదా… అది జరగలేదు… చివరకు ఫిర్యాదులు ఎక్కువయ్యేసరికి 2016లోనే సెబి బోర్డులో చర్చకు వచ్చేంతవరకూ దానికి సోయి లేదు… అప్పుడు సదరు ఆనందుడు, ఈ చిత్ర రాజీనామాలు చేశారు… దరిద్రం ఏమిటంటే… చిత్రకు అప్పటిదాకా అడ్డగోలు జీతం చెల్లిస్తున్న ఎన్ఎస్‌ఈ రాజీనామా డేట్ వరకు కోట్లాది పరిహారాన్ని చెల్లించింది… అంటే అసలు రోగం సెబీలో ఉంది, మన వ్యవస్థలో ఉంది…
ఇప్పుడు అందరూ ఎడాపెడా రాసేస్తున్నారు… ఏదేదో చెబుతున్నారు… కానీ ఎన్ఎస్‌ఈలో ఆమె కథ ముగిసి ఇప్పటికే ఆరేళ్లు… ఇన్నాళ్లూ సెబీ తేల్చిందీ, పీకిందీ ఏమీ లేదు… ఈరోజుకూ ఆమె వెనుక ఎవడో యోగి ఉన్నాడు, హిమాలయాల్లో తిరుగుతాడు అనే ఆమె వెర్షన్‌ను వెల్లడిస్తోంది కానీ, అసలు నేరాన్ని బయటపెట్టే చర్చలేమీ లేవు… పరమ నిరర్థక యంత్రాంగం అనగా సెబీ… అంతే… ఇప్పటికీ ఆమె చెప్పిందే వల్లెవేస్తోంది… కానీ అబ్సర్డ్, అబద్దం…
కొన్ని మెయిల్స్ బయటపడ్డయ్… సదరు శిరోన్మణి అని పిలవబడే గుర్తుతెలియని యోగి ఎవడో ఆమెకు మార్గదర్శకత్వం వహించాడట… ఆమె పాటించిందట… నాన్సెన్స్… ఇప్పటివరకూ ఆయన భౌతికరూపం చూడలేదు అంటోంది ఆమె… నిజానికి మన దరిద్రపు చేతకాని వ్యవస్థను ఔపోసన పట్టింది ఆమె… లండన్‌లో కార్పొరేట్ చట్టాలు, ఇండియాలో సీఏ… ఆమె అన్నీ చదివింది… అయితే ‘‘నీ హెయిర్ స్టయిల్ మార్చు, యంగ్ లుక్ వస్తుంది, మొహంలో గ్లో వస్తుంది, మనం సీషెల్స్ పోదాం, సీబాత్ చేద్దాం, ఈత వస్తుంది కదా, బీచ్‌లో చిల్ అయిపోదాం’’ అని అరవయ్యేళ్ల ఈ ముసలామెతో ఏ ‘‘సంబంధం ఉన్నవాడు’’ మాట్లాడతాడు..?!
ఆమె ఫ్యామిలీ డిటెయిల్స్ తెలియవు, భర్తాపిల్లల గురించి తెలియదు… ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు… ఏ భౌతిక సంబంధమూ లేనట్టుగా ఓ కవరింగు… ఏ బంధమూ లేనిదే ఆమె లుక్కు గురించి, బీచులో సీన్ బాత్ గురించి మాట్లాడతాడా సదరు యోగి…? మొత్తానికి అర్థం అయ్యేది ఏమిటీ అంటే… హిమాలయాలు లేవు, ఏ సిద్ధపురుషుడూ లేడు… అలాంటోడికి కార్పొరేట్, స్టాక్ ఎక్స్‌ఛేంజుల సాంకేతిక, వ్యాపార పరిజ్ఞానం ఎక్కడిది..? ఈ భౌతిక సంబంధాలేమిటి..? ఈ ఇహలోకపు సుఖాల మాటేమిటి..? వాడెవడో గానీ ఆమెతో రెగ్యులర్ సంబంధాల్లో ఉన్నాడనేది సుస్పష్టం…
సో, ఆ యోగి అనేది అబద్ధం… ఎవరో రహస్య శక్తి ఆమెను ఆడించింది… తనెవరో గానీ కార్పొరేట్ వ్యవహారాల మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాడే… ఆమె బయటపెట్టడం లేదు, అంతే… తను చెప్పినట్టుగా ఎక్స్‌ఛేంజ్‌ను ఆడించింది… బోర్డు అంతర్గత, కాన్ఫిడెన్షియల్ వ్యవహారాల మీద కూడా తన సలహాలు తీసుకుంది, పాటించింది… అంటే ఎవరో అన్నీ తెలిసిన ఎవరో వ్యక్తి..? ఆమెకే తెలుసు…
అవన్నీ బయటపడాలీ అంటే అది సెబీతో కాదు… సీబీఐ ఆర్థికవిభాగం నిపుణులు కొరడా పట్టుకోవాలి… అదేదీ లేకుండా ఆరేళ్ల తరువాత ఇప్పుడు మెల్లిగా బయటపెట్టడం ఏమిటి..? నేరం కోణం ఏమైంది..? అంటే ఇప్పటికీ సెబీ ఏదో డ్రామా ఆడుతోంది… చిత్ర ఓ మంత్రగత్తె… ఆమె వెనుక ఎవరో మాయ యోగి… ఆ రహస్యం బయటపడి, అన్ని కథలూ బయటపడాలంటే… అది సెబీతో కాదు, సీబీఐ వరకూ పోకుండా ఎవరు ఆపుతున్నారు..? ఆ యోగి అలియాస్ రహస్యశక్తేనా..? ఎవరు ఆయన మద్దతుదారులు..? అసలు ‘‘వాడెవడు..’’!!
Share this Article